లాక్‌డౌన్‌లో అనసూయ, రష్మిక, అరియానా గ్లోరి, రష్మీ గౌతమ్.. ఈ సెలబ్రిటీలు ఏం చేస్తున్నారంటే!
తెలంగాణ రాష్ట్రంలో కరోనావైరస్ కట్టడికి ప్రభుత్వం చర్యలు తీసుకొంటూ లాక్‌డౌన్ విధించిన నేపథ్యంలో సినీ తారలు, టెలివిజన్ నటీనటులు, బుల్లితెర యాంకర్లందరూ ఇంటికే పరిమితమయ్యారు. ఎప్పుడూ బిజీగా ఉండే ఈ తారలు ఇంటి పట్టున ఏం చేస్తున్నారంటే...

అనసూయ భరద్వాజ్..
కోవిడ్19 పరిస్థితులు విజృంభిస్తున్న సమయంలోనే జబర్దస్త్ కామెడీ షో, వెబ్ సిరీస్‌కు సంబంధించిన షూట్‌ను టాప్ యాంకర్ అనసూయ పూర్తి చేశారు. ఇటీవల లాక్‌డౌన్ విధించడంతో విలువైన సమయాన్ని ఫ్యామిలీకి కేటాయించింది. తన పిల్లలతో ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే తన పెంపుడు జంతువులతో కాలక్షేపంగా చూస్తూ బిజీగా మారిపోయారు. అలాగే ఇన్స్‌టాగ్రామ్‌లో తన సహచర నటులతో మాట్లాడుతూ సమయాన్ని గడుపుతున్నారు.

కొత్త ఇంటిలోకి అరియానా గ్లోరి
బిగ్‌బాస్ తెలుగు 4 సీజన్‌తో మంచి పాపులారిటీ సంపాదించుకొన్న అరియానా గ్లోరి.. ఆ తర్వాత సెలబ్రిటీగా మారిపోయారు. లాక్‌డౌన్‌కు ముందు కొత్త ఇంటిలోకి మారిపోయారు. లాక్‌డౌన్ విధించడంతో ఇంటికే పరిమితమయ్యారు. ఫ్యాన్స్, స్నేహితులతో మాట్లాడుతూ కాలక్షేపం చేస్తు్నారు. అలాగే కొత్త ఇంటిని సర్దుకొనే పనిలో బిజీగా మారిపోయారు.

మేఘాలయలో నవదీప్
అలాగే నటుడు, టీవీ హోస్ట్ నవదీప్ మంచి జోష్‌లో కనిపిస్తున్నారు. ప్రస్తుతం మేఘాలయ రాష్ట్రంలో విహార యాత్ర చేస్తున్నాడు. ప్రకృతిని ఆస్వాదిస్తూ లాక్‌డౌన్‌కు దూరంగా ఉంటున్నారు. అలాగే కరోనా సమయంలో సామాజిక సేవలో కూడా నిమగ్నమయ్యారు. పేదవారికి, సినీ కార్మికులకు సహాయం చేస్తున్నారు.

ముంబైలో రష్మిక మందన్న
అలాగే రష్మిక మందన్న కూడా ముంబైలో తన ఫ్లాట్‌కే పరిమితమయ్యారు. రెగ్యులర్‌గా జిమ్ కెళ్లి వర్కవుట్లు చేస్తూ మీడియాకు ఫోజులిస్తున్నారు. మంచి భోజనం చేస్తూ ఖాళీ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. సమయం చిక్కినప్పుడల్లా ఇన్స్‌టాగ్రామ్ లైవ్‌లో అభిమానులతో మాట్లాడుతున్నారు.

శ్రీముఖి ఫోటోషూట్స్‌తో అదుర్స్
ఇక శ్రీముఖి విషయానికి వస్తే.. ఇటీవల పుట్టిన రోజును జరుపుకొని మంచి జోష్‌లో ఉన్నారు. ఇన్స్‌టాగ్రామ్‌లో రకరకాల ఎక్స్‌ప్రెషన్స్‌తో ఫోజులు పెడుతున్నారు. మోడరన్ దుస్తులతో ఫోటోషూట్ చేస్తూ ఆ ఫోటోలను అభిమానులతో పంచుకొంటున్నారు. ఫేస్ యాప్‌లో మార్ఫింగ్ ఫోటోలు దిగి.. ఇన్స్‌టాలో పోస్టు చేస్తున్నారు.

జోష్‌లో యాంకర్ లాస్య
యాంకర్ లాస్య ఇంటిలోనే జున్నుతో సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే జోష్ యాప్ కోసం వీడియోలు తీసుకొని పోస్టు చేస్తున్నారు. అలాగే ఫ్యామిలీతో కలిసి క్వాలిటీ టైమ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. లాక్‌డౌన్‌కు ముందే తనకు సంబంధించిన టీవీ షోల షూట్స్ ఫినిష్ చేసుకొన్నారు.

వకీల్ సాబ్ చూస్తూ రష్మీ గౌతమ్
లాక్‌డౌన్‌లో యాంకర్ రష్మీ గౌతమ్ ఇంటి పట్టునే ఉంటూ ప్రజలకు, అభిమానులకు ధైర్యం చెబుతున్నారు. ప్రస్తుతం మనమంత కష్టకాలంలో ఉన్నాం. అందరం కోవిడ్ నిబంధనలకు కట్టుబడి ఉందాం. మీకు వకీల్ సాబ్ సినిమా చూడమని చెబుతున్నాను. నాకు థియేటర్‌లో చూడటానికి వీలు కాలేదు. ఇప్పుడు ఓటీటీలో సినిమా చూస్తున్నాను అంటూ రష్మీ గౌతమ్ చెప్పారు.


Click it and Unblock the Notifications











