శిల్పాశెట్టి నివాసానికి వచ్చిన గణపతి.. భక్తి శ్రద్ధలతో..

వినాయక చవితి ఉత్సవాల కోసం బాలీవుడ్ చిత్ర పరిశ్రమ సిద్ధమవుతున్నది. ఆగస్టు 22వ తేదీన జరుపుకొనే పండుగ కోసం సినీ తారలు ఉత్సాహంతో ఎదురు చూస్తున్నారు. గణపతి బప్పా మోరియా అంటూ ఉత్సాహంగా పర్వదినాన్ని జరుపుకొనే అందాల తార శిల్పాశెట్టి కోవిడ్ నిబంధనలు పాటిస్తూ గణపతి విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకొన్నారు.

ముంబైలో కరోనావైరస్ విలయతాండవం చేస్తున్న సమయంలో లాక్‌డౌన్ నిబంధనలు పాటిస్తూ ముఖానికి మాస్క్ ధరించి.. సంప్రదాయ దుస్తులు ధరించి వినాయకుడి విగ్రహాన్ని తన సిబ్బంది, కుటుంబ సభ్యులతో కలిసి ఇంటికి తెచ్చుకొన్నారు.

Lord Ganapti Bappa at Shilpa Shetty home

గణేష్ చతుర్థి పండుగను ప్రతీ ఏడాది తన కుటుంబ సభ్యులు, భర్త రాజ్ కుంద్రా, కుమారుడు వియాన్‌తో కలిసి భక్తి శ్రద్దలతో జరుపుకోవడం అందరికి తెలిసిందే. ఈ ఏడాది కూడా తన ఇంటికి గణపతి మహారాజును తోడ్కొని వచ్చారు. ఆ విషయాన్ని తన సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా షేర్ చేసుకొన్నారు.

Lord Ganapti Bappa at Shilpa Shetty home

ఇక కెరీర్ విషయానికి వస్తే.. శిల్పాశెట్టి సబీర్ ఖాన్ రూపొందిస్తున్న నికమ్మ చిత్రంలో నటించనున్నారు. దాదాపు ఓ దశాబ్దం కాలం తర్వాత మళ్లీ వెండితెరపైన కనిపించనున్నారు. అలాగే ప్రియదర్శన్ దర్శకత్వంలో రూపొందే హంగామా 2లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.ఈ చిత్రంలో ప్రణిత సుభాష్, పరేష్ రావల్, మీజాన్ తదితరులు నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X