twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కీరవాణి చెల్లిని కాబట్టే ఫీలయ్యాడు, రాజమౌళి అన్నతో చిన్నతనంలో... పోసానితో గొడవ: ఎంఎం శ్రీలేఖ

    |

    తెలుగులో వన్ అండ్ ఓన్లీ లేడీ మ్యూజిక్ డైరెక్టర్‌గా రికార్డులకెక్కడమే కాదు.... తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ఎంఎం శ్రీలేఖ. తెలుగు, తమిళం, హిందీలో దాదాపు 80 సినిమాలకు ఆమె సంగీతం అందించారు. దాదాపు 4 వేలకు పైగా పాటలు పాడారు. తాజాగా తన సరదాగా షోలో పాల్గొన్న శ్రీలేఖ నుండి ఆసక్తికర విషయాలు రాబట్టారు కమెడియన్ అలీ.

    చిన్నతనం నుండి సంగీతంలోనే ఉండటంతో చదువుపై ఆసక్తి చూపలేదు. మా నాన్నగారు కూడా చదివిపించడం కంటే నాలో ఉన్న మ్యూజిక్ టాలెంట్ ఎంకరేజ్ చేయడానికే ఆసక్తి చూపారు, దీంతో ఎల్‌కేజీలోనే స్కూలుకు వెళ్లడం మానేశాను అని శ్రీలేఖ తెలిపారు.

    పోసాని కృష్ణ మురళితో గొడవ గురించి

    పోసాని కృష్ణ మురళితో గొడవ గురించి

    ఆపరేషన్ దుర్యోధన సినిమా సమయంలో పోసాని కృష్ణమురళితో గొడవ జరిగిన మాట నిజమే. సినిమా చివరి వరకు బాగానే సాగింది. రీ రికార్డింగ్ సమయంలోనే సమస్య వచ్చింది. ఒకచోట వైలెన్స్ కావాలన్నాను. నేను ఉంది కదా అన్నారు మాటా మాట పెరిగి గొడవైంది. తర్వాత ‘దుశ్శాసన' సినిమాకు కలిసి పని చేశామని శ్రీలేఖ గుర్తు చేసుకున్నారు.

    రాజమౌళి అన్నయ్యతో చైల్డ్ ఆర్టిస్టుగా

    రాజమౌళి అన్నయ్యతో చైల్డ్ ఆర్టిస్టుగా

    రాజమౌళి అన్నయ్యతో కలిసి చైల్డ్ ఆర్టిస్టుగా నటించాను. ‘పిల్లనగ్రోవి' అనే సినిమా అది. అయితే అది రిలీజ్ అవ్వలేదు. అది మా సొంత ప్రొడక్షన్. 90 శాతం పూర్తయిన తర్వాత పెదనాన్న వాళ్ల దగ్గర డబ్బులు అయిపోయి ఆపేశారు. అందులో రాజమౌళి అన్నయ్య కృష్ణుడి పాత్ర చేస్తే.... నేను భక్తురాలి పాత్ర చేశానని తెలిపారు.

    నన్ను హీరోయిన్ చేద్దామనుకున్నారు

    నన్ను హీరోయిన్ చేద్దామనుకున్నారు

    మా నాన్నగారి పేరు బోస్. నన్ను మ్యూజిక్ డైరెక్టర్ చేయడం ఆయనకు ఇష్టం లేదు. హీరోయిన్ చేద్దామనుకున్నారు. నాకేమో సంగీతం మీద ఆసక్తి. ఈ విషయంలో ఇద్దరం గొడవపడేవారమని శ్రీలేక గుర్తు చేసుకున్నారు.

     ఆయన చెల్లి కాబట్టే ఫీలయ్యారు

    ఆయన చెల్లి కాబట్టే ఫీలయ్యారు

    ముగ్గురు అత్తల ముద్దుల అల్లుడు సినిమాలో నేను సిల్క్ స్మితకు ఐటం సాంగ్ పాడతాను అంటే కీరవాణి అన్నయ్యకు కోపం వచ్చింది. అపుడు నేను చాలా చిన్న పిల్లను. 9 సంవత్సరాలు. పైగా ఆయనకు చెల్లిని కావడంతో ఫీలయ్యాడు. కీరవాణి అన్నయ్య ఇద్దరం కలిసి పాడాల్సి రావడం వల్ల ఆయనకు సమస్య అనిపించిందని తెలిపారు.

    English summary
    M. M. Srilekha Alitho Saradaga highlights. M. M. Srilekha is an Indian film playback singer and music composer, known for her works predominantly in Telugu cinema. She is the only female music director in the Telugu film industry.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X