Don't Miss!
- News barrelakka: వివాహ బంధంలోకి అడుగుపెట్టిన బర్రెలక్క
- Sports IPL 2024: అందుకే పృథ్వీ షా ఆడటం లేదు: సౌరవ్ గంగూలీ
- Lifestyle గుడ్ ఫ్రైడే 2024 ఎప్పుడు? క్రైస్తవులు గుడ్ ఫ్రైడే ఎందుకు జరుపుకుంటారు?మీకు తెలియని కొన్ని వాస్తవాలు
- Technology రియల్‌మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్‌లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్‌లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
మా ఎన్నికలు: మెగా ఫ్యామిలిలో శ్రీరెడ్డి చిచ్చు.. చిరంజీవి, నాగబాబు తలోదారి.. మెగా హీరోలు ఎటువైపు
మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ (మా) ఎన్నికలు రాజకీయ రణరంగాన్ని గుర్తుచేస్తున్నాయి. ఈ ఎన్నికల్లో శివాజీరాజా, వీకే నరేష్ వర్గాలు మా పీఠాన్ని దక్కించుకొనేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. అన్ని వర్గాల నుంచి మద్దతు కూడగట్టుకొనేందుకు అన్ని అస్త్రాలను కూడగట్టుకొంటున్నాయి. అంతా సవ్యంగా సాగుతున్నదని భావిస్తున్న సమయంలో హీరో రాజశేఖర్ కుటుంబాన్ని పరోక్షంగా టార్గెట్ చేస్తూ వివాదాస్పద నటి శ్రీరెడ్డి వ్యాఖ్యలు చేయడంతో ఎన్నికల సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. మెగా హీరోలు తలోదారి పట్టేందుకు ఆస్కారం ఏర్పడింది. వివరాల్లోకి వెళితే..
కేజీఎఫ్ హీరో హత్యకు కుట్ర.. భారీగా సుపారీ! కన్నడలో అరెస్టులు.. హీరో యష్ క్లారిటీ
హీరోయిన్ శ్రీరెడ్డి వ్యాఖ్యలతో
మా ఎన్నికల్లో శివాజీ రాజా వర్గం మొదటి నుంచి దూకుడుగా ప్రచారం సాగిస్తున్నది. మెగాస్టార్ చిరంజీవిని కలిసి మద్దతు కూడగట్టారు. దాంతో వారి గెలుపు సులభమనే అభిప్రాయం వ్యక్తమైంది. అయితే ఈ క్రమంలో హీరో రాజశేఖర్ కుటుంబంపై శ్రీరెడ్డి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేస్తూ.. శివాజీ రాజా వర్గానికి మద్దతు తెలపడంతో సీన్ రివర్స్ అయింది.
నాగబాబు షాకింగ్ నిర్ణయం
శ్రీరెడ్డి వ్యాఖ్యల చేయనంత వరకు తటస్థంగా ఉన్న నాగబాబు తన స్టాండ్ మార్చుకొన్నారు. తను సీనియర్ నటుడు వీకే నరేష్ ప్యానల్‌కు మద్దతు తెలుపుతున్నట్టు నాగబాబు బహిరంగ ప్రకటన చేశారు. వారితో కలిసి ప్రచారంలో పాల్గొనడంతో శివాజీరాజా వర్గానికి షాక్ తగిలినట్టు అయింది. ఇలా నాగబాబు అనూహ్య నిర్ణయం తీసుకోవడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
జీవితకు నా సపోర్ట్ ఉంది
నరేష్ ప్యానల్‌కు సపోర్ట్ చేయడంపై నాగబాబు స్పష్టమైన వివరణ ఇచ్చారు. మా అధ్యక్ష పదవికి ఒక్కరు ఒక్కసారి మాత్రమే చేపట్టాలని, రెండోసారి చేయడం తనకు నచ్చదు అని నాగబాబు అన్నారు. అంతేకాకుండా ఈ ప్యానల్లో నటి, దర్శకురాలు జీవిత గారికి మంచి హోదా ఇస్తున్నారని.. ఆడవాళ్లను గౌరవించుకోవడం మన బాధ్యత అంటున్నారు నాగబాబు. ఇప్పటివరకు మా అసోసియేషన్‌లో మహిళలకు తగిన పదవి ఇవ్వలేదని.. ఇప్పుడు నరేష్ వర్గం అది చేస్తున్నారు కాబట్టి తన సపోర్ట్ వాళ్లకు ఇస్తాను అంటున్నారు నాగబాబు.
శివాజీరాజా వర్గంపై ఫైర్
గతంలో మా అసోసియేషన్ గురించి కొందరు నోటికొచ్చినట్లు మాట్లాడుతుంటే శివాజీరాజా వర్గం చూశారు కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని నాగబాబు అన్నారు. ఆ విషయంలో తాను నిరాశపడ్డాను. మీడియా కూడా అప్పుడు మా కు వ్యతిరేకంగా మాట్లాడితే నరేష్, జీవిత గారు అభ్యంతరం చెప్పారు. ఈ సారి కొత్తవాళ్లకు అవకాశం ఇస్తే వాళ్లేం చేస్తారో కూడా తెలుస్తుంది కదా అని నాగబాబు తన వైఖరిని స్పష్టం చేశారు.
మెగా ఫ్యామిలీపై శ్రీరెడ్డి అనుచితంగా
గతంలో మెగా ఫ్యామిలీపై శ్రీరెడ్డి వ్యాఖ్యలు చేయడం అత్యంత వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. ఆ సమయంలో శ్రీరెడ్డి వివాదాన్ని పరిష్కరించడంలో శివాజీరాజా వర్గం విఫలమైందని, ఆ కారణంగానే ఆ వివాదం అనేక పరిణామాలకు దారి తీసిందనే అభిప్రాయం వ్యక్తమైంది. ఆ సమయంలో శ్రీరెడ్డి కారణంగా మెగా ఫ్యామిలీ మీడియాకు ఎక్కాల్సి వచ్చింది. ఇప్పుడు అలాంటి వివాదాస్పద శ్రీరెడ్డి.. శివాజీరాజాకు మద్దతు తెలుపడం నాగబాబుకు మింగుడు పడలేదనే మాట వినిపిస్తున్నది.
మెగా హీరోలు మద్దతు ఎటువైపు
ప్రస్తుతం చిరంజీవి సపోర్టు మాకే ఉందని, మెగా ఫ్యామిలీలో కొందరు మా వర్గానికే శివాజీ రాజా ప్యానెల్ ప్రచారం చేసుకొంటున్నది. అయితే చిరంజీవి మాత్రం బహిరంగంగా ఎవరికి మద్దతు ఇస్తున్నారో ప్రకటించలేదు. కానీ శ్రీరెడ్డి ఉదంతం వల్ల నాగబాబు మాత్రం తన వైఖరిని స్పష్టం చేయడం సెన్సేషన్‌గా మారింది. అయితే మెగా ఫ్యామిలీ హీరోలు ఎవరు ఎటువైపు ఉన్నారనే విషయంలో స్పష్టత కనిపించడం లేదనే వాదన వినిపిస్తున్నది.