శివాజీరాజా ఓటమికి కారణం ‘ఆమె’నట.. చిరు, నాగ్ కలిసికట్టుగా.. పంతం నెగ్గించుకొన్న నాగబాబు!

Recommended Video

MAA Elections 2019 : Why Did Sivaji Raja Lose In The Maa Election | Filmibeat Telugu

టాలీవుడ్ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ (మా) ఎన్నికలు రసవత్తరంగా జరిగాయి. పరస్పర ఆరోపణలతో ప్రచారం, తీవ్ర ఉత్కంఠ మధ్య ఎన్నికలు ఆదివారం జరిగాయి. అయితే ఎన్నికలకు రెండు రోజుల ముందు వరకు శివాజీరాజాదే గెలుపు ఖాయమనే మాట సినీ వర్గాల్లో వినిపించింది. అయితే మెగా బ్రదర్ నాగబాబు చివరి రోజు చక్రం తిప్పడంతో మా ఎన్నికల్లో అనూహ్యమైన మార్పులు సంభవించాయి. వివరాల్లోకి వెళితే..

 శ్రీరెడ్డితో శివాజీరాజా ప్యానెల్‌కు ఇబ్బందులు

శ్రీరెడ్డితో శివాజీరాజా ప్యానెల్‌కు ఇబ్బందులు

ఎన్నికల ప్రచారానికి ముందు నుంచి శివాజీ రాజా, శ్రీకాంత్, తదితర హీరోలతో కూడిన ప్యానెల్‌కు మెగా సపోర్టు ఉంది. ఆ ధీమాతోనే శివాజీ రాజా ప్యానెల్ ఉత్సాహంతో ప్రచారం చేసింది. అయితే ఈ ఎన్నికల్లో వివాదాస్పద నటి శ్రీరెడ్డి తలదూర్చడంతో శివాజీరాజాకు ప్రతికూలత మొదలైంది.

 మెగా బ్రదర్ అనూహ్య నిర్ణయం

మెగా బ్రదర్ అనూహ్య నిర్ణయం

హీరో రాజశేఖర్ కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ శ్రీరెడ్డి వ్యాఖ్యలు చేయడం, వాటిని ఎవరూ కూడా ఖండించకపోవడం వివాదాస్పదంగా మారింది. శ్రీరెడ్డి వ్యాఖ్యల నేపథ్యంలో మెగా బ్రదర్ నాగబాబు అనూహ్యమైన నిర్ణయం తీసుకొని నరేష్ ప్యానెల్‌కు మద్దతిచ్చారు.

జీవిత ఫ్యామిలీకి నాగబాబు సపోర్ట్

జీవిత ఫ్యామిలీకి నాగబాబు సపోర్ట్

వీకే నరేష్ ప్యానెల్‌లో కీలక స్థానాలకు పోటీచేసిన రాజశేఖర్, జీవితా రాజశేఖర్‌కు బహిరంగ మద్దతు ప్రకటించారు. వారి వెంట నడిచి ప్రచారంలో పాల్గొన్నారు. మహిళలకు మా స్థానం కల్పించాలనే ఉద్దేశంతో జీవితకు సపోర్ట్ చేస్తున్నాను అని నాగబాబు చెప్పడంతో మా ఎన్నికల ప్రచారం మరో మలుపు తిరిగింది.

శివాజీరాజాపై ఓ వర్గం గుర్రుగా

శివాజీరాజాపై ఓ వర్గం గుర్రుగా

గతేడాది శ్రీరెడ్డి వివాదం సమయంలో శివాజీ రాజాతో కూడిన మా కమిటీ సరైన నిర్ణయం తీసుకోవడంలో విఫలమైందనే విమర్శలు వచ్చాయి. ఆ కారణంగానే శ్రీరెడ్డి వివాదం మెగా ఫ్యామిలీని రోడ్డును పడేశాయనే వాదన సినీ వర్గాల్లో వినిపించాయి. ఇలాంటి పరిస్థితుల్లో తాజా ఎన్నికల్లో శివాజీ రాజాకు శ్రీరెడ్డి మద్దతు ఇవ్వడాన్ని మెగా ఫ్యామిలీ జీర్ణించుకోలేకపోయిందని, అందుకే నరేష్ ప్యానెల్‌కు బాహాటంగా మద్దతు పలికిందని పలువురు పేర్కొన్నారు.

చిరంజీవి, నాగార్జున కలిసికట్టుగా

చిరంజీవి, నాగార్జున కలిసికట్టుగా

ఇటీవల శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యల కారణంగానే చిరంజీవి, నాగార్జున, ఇతర అగ్రనటులు కీలక నిర్ణయం తీసుకొన్నట్టు సమాచారం. సినీ ఇండస్ట్రీకి ప్రతిష్టాత్మకంగా మారిన మా ఎన్నికలు, కమిటీని సరైన వర్గం చేతుల్లో పెట్టాలనే డిసిషియన్‌ను ఓ రోజు ముందే తీసుకొన్నట్టు తెలిసింది. గుట్టుచప్పుడు కాకుండా పక్కా వ్యూహాన్ని రచించినట్టు తెలిసింది. ఆ క్రమంలోనే చిరంజీవి, నాగార్జున ఒకే కారులో వచ్చి ఒకేసారి ఓటు వేయడం కొన్ని సమీకరణాలను మార్చేసిందనే మాట వినిపిస్తున్నది.

పంతం నెగ్గించుకొన్న నాగబాబు

పంతం నెగ్గించుకొన్న నాగబాబు

శ్రీరెడ్డి వివాదంతో మెగా ఫ్యామిలీ చాలా సమస్యలు ఎదుర్కొన్నది. మా సభ్యులు సరైన రితీలో స్పందించకపోవడంపై కొంత గుర్రుగానే ఉన్నారనే విషయం స్పష్టమైంది. శ్రీరెడ్డికి మద్దతు తెలిపిన ఓ వర్గాన్ని టార్గెట్‌గా చేసుకొని మెగా ఫ్యామిలి తమ మార్కు రాజకీయాన్ని ప్రదర్శించినట్టు పలువురు పేర్కొంటున్నారు. తన వర్గాన్ని గెలిపించుకొనేందుకు మెగా మార్కు రాజకీయంతో నాగబాబు పంతం నెగ్గించుకొన్నారనే విషయం మా ఎన్నికలు స్పష్టం చేశాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X