ఆ విషయంలో నేను కూడా అలాంటిదాన్నే.. సమంతతో పోల్చుకున్న మాధవీలత
మాధవీలత సినిమాలతో వివాదాస్పద కామెంట్లతోనే ఎక్కువగా పాపులర్ అయింది. చేసింది తక్కువ సినిమాలే కావడం, ఆపై రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడంతో పరిశ్రమకు దూరమైంది. శ్రీ రెడ్డి లేవనెత్తిన క్యాస్టింగ్ కౌచ్, మీటూ అంశంలో మాధవీలత మళ్లీ వెలుగులోకి వచ్చింది. అప్పటి నుంచి నిత్యం ఏదో ఒక కామెంట్ చేయడం, పోస్ట్‌లు పెట్టడం చేస్తూనే ఉంటుంది. సినీ రాజకీయ అంశాలతో పాటు వ్యక్తిగత విషయాలకు కూడా షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఆమె చేసిన ఓ కామెంట్ తెగ వైరల్ అవుతోంది.

నిత్యం ఏదో ఒక పోస్ట్..
మాధవీలత నిత్యం ఏదో ఒక పోస్ట్ చేస్తూనే ఉంటుంది. ఆ మధ్య చిత్రపురి కాలనీ సమస్యలపై, రాకేష్ మాస్టర్ వ్యవహారంపై, కరోనా వైరస్ వ్యాప్తి చెందడంపై, లిక్కర్ షాపులు ఓపెన్ చేయడంపైనా కామెంట్స్ చేసింది. ఇక శ్రీరెడ్డిపై చేసే పరోక్ష కామెంట్స్ తెగ వైరల్ అవుతుంది.

పరోక్ష పోస్ట్‌లు..
మాధవీలత, శ్రీరెడ్డి మధ్య పరోక్ష పోస్ట్‌లు నిత్యం చక్కర్లు కొడుతూనే ఉంటాయి. సాధినేని యామిని వ్యవహారంతో వీరిద్దరి మధ్య వైరం మొదలైంది. అప్పటి నుంచి ఈ ఇరువురు పరోక్షంగా దూషించుకుంటారు. కాసేపటి క్రితమే శ్రీరెడ్డి పరోక్షంగా మాధవీలతపై సెటైర్స్ వేసింది. తాజాగా మాధవీలత సమంత చేసిన ఓ కామెంట్‌పై స్పందించింది.

ద్వేషించే వారిపై కౌంటర్..
గత వారం సమంత నెటిజన్లతో కాసేపు ముచ్చటించింది. ఆ సందర్భంలో సమంతకు ఓ ప్రశ్న ఎదురైంది. నిన్ను ద్వేషించే వారి గురించి ఏం చెబుతారని ప్రశ్నిస్తే.. ‘వారే నాకు స్ఫూర్తి.. మాములుగా పొగడ్తలతో నేను బద్దకస్తురాలిగా తయారవుతాను.. నన్ను తిట్టే వారి వల్లే నాలోని పనితనాన్ని మెరుగు పరుచుకుంటాన'ని చెప్పుకొచ్చింది.
Recommended Video

నేను కూడా అలాంటిదాన్నే..
సమంత చేసిన ఆ కామెంట్‌ను స్క్రీన్ షాట్ తీసుకుని మాధవీలత తన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది. ‘ఈ పోస్ట్ నాకెంతో నచ్చింది. అవును నిజమే.. ఇన్‌సల్ట్ చేస్తేనే నాలోని బెస్ట్ బయటకు వస్తుంది.. గుర్తు చేసినందుకు ధన్యవాదాలు.. వాస్తవానికి అదే నేను.. ' అని మాధవీలత కామెంట్ చేసింది.


Click it and Unblock the Notifications











