మాస్క్ ముసుగులో పెళ్లి అవసరమా?.. ఆగలేకపోతున్నారా , నిజాలు బయట పడతాయనా?.. మాధవీలతా ఫైర్

మాధవీలతా సినిమాలతో ఫేమస్ అయింది ఎంతో గానీ.. వివాదాస్పద వ్యాఖ్యలు చేసి జనాల నోళ్లలో నానుతోంది. అప్పుడెప్పుడే రెండు మూడు సినిమాల్లో మెరిసిన మాధవీలత.. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. సోషల్ మీడియాలో ఆమె చేసే కామెంట్స్, పలువురిపై చేసే వ్యాఖ్యలతో తెగ పాపులర్ అయింది. మీటూ, క్యాస్టింగ్ కౌచ్ అంటూ సంచలన కామెంట్స్ చేసి సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేసింది. గత కొన్ని రోజులుగా మళ్లీ సోషల్ మీడియాలో పోస్ట్‌లు చేస్తూ వివాదాస్పదంగా మారింది. తాజాగా టాలీవుడ్‌లో జరిగిన దిల్ రాజు -వైషూ రెడ్డి, నిఖిల్-పల్లవిల వివాహాలపై సెటైర్ వేసింది.ఇంతకీ ఆమె చేసిన కామెంట్స్ ఏంటన్నది ఓ సారి చూద్దాం.

 గత కొన్ని రోజులుగా..

గత కొన్ని రోజులుగా..

మాధవీలతా గత కొన్ని రోజులుగా ఏదో ఒక పోస్ట్ చేస్తూనే ఉంటోంది. చిత్రపురి కాలనీలో జరిగే అన్యాయాల గురించి, సాధినేని యామిని, శ్రీ రెడ్డి వంటి వారి గురించి ఏదో కామెంట్ చేస్తూనే ఉంది. ఇక యూట్యూబ్‌లో అయితే తనపై నెగెటివ్ కామెంట్స్ చేసేవారిని చీల్చి చెండాడుతోంది.

కరోనా కాలంలో సాయం..

కరోనా కాలంలో సాయం..

కరోనా లాంటి కష్టకాలంలో చేతనైన సాయాన్ని చేస్తూ అందరికీ అండగా ఉంటోంది. నక్షత్ర ఫౌండేషన్ ద్వారా అవసరమైన వారికి నిత్యావసర సరకులను అందిస్తోంది. కరోనా వైరస్ ఇంతలా విజృంభిస్తూ ఉంటే.. మద్యం షాపులు ఓపెన్ చేయడంపై ప్రభుత్వాలపై సెటైర్ వేసింది. తాజాగా సెలెబ్రిటీల పెళ్లిళ్లపై కామెంట్స్ చేసింది.

మాస్క్ ముసుగులో పెళ్లి అవసరమా?

మాస్క్ ముసుగులో పెళ్లి అవసరమా?

ఈ మేరకు మాధవీలతా ఫేస్ బుక్‌లో స్పందిస్తూ.. ‘అసలు ఆగట్లేదుగా జనాలు.. మాస్క్‌లు వేసుకుని పెళ్లిళ్లు ఎందుకు?.. ముహూర్తం మళ్లీ రాదా ఇది పోతే.. శ్రావణం కాకపోతే మాఘ మాసం లేకుంటే మరో ఏడాది? పిల్ల దొరకదా? పిల్లొడు మారిపోతడ.. అలా మారిపోయే మనుషులతో బంధాలు ఎందుకటా? మాస్క్ ముసుగులో పెళ్లి అవసరమా? కొన్నాళ్లు ఆగలేని వాళ్లు సంసారాలు చేస్తారా?

Recommended Video

Rayalaseema Love Story Movie Press Meet
సచ్చిపోతున్నార్రా నాయన..

సచ్చిపోతున్నార్రా నాయన..

ఫిక్స్ అయిన మ్యారెజ్‌లో గ్యాప్ వస్తే నిజాలు తెలిసి బంపర్ ఆఫర్ మిస్ అవుతున్నారు.. సచ్చిపోతున్నార్రా నాయన అంటే ఈ పెళ్లి ఏందో.. నాకేం అర్థం కావడం లేదు.. క్రేజీ జనాలు.. కాదు కాదు దేవుడే చాలా క్రేజీ.. నా పోస్ట్ నా ఇష్టం నా అభిప్రాయం నా ఇష్టం.. నా భావాలను ప్రకటించే హక్కు నాకుంది' అని సెలెబ్రిటీల వివాహాలపై సెటైర్ వేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X