twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    లాక్‌డౌన్‌లో పెళ్లిళ్లపై మాధవీలత కామెంట్.. నెటిజన్స్ ఫైర్.. నీకేమైనా నొప్పా అంటూ హీరోయిన్ సెటైర్స్

    |

    మాధవీలత వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తోంది. తాజాగా లాక్ డౌన్‌లో పెళ్లిళ్లు చేసుకుంటున్న వారిపైనా సెటైర్స్ వేసింది. ఆగలేకపోతున్నారా? నిజాలు బయటపడతాయని భయపడుతున్నారా? మాస్ఖ్‌లు వేసుకుని మరీ పెళ్లిళ్లు చేసుకోవాలా? అని ఇష్టమొచ్చినట్టు ఫైర్ అయింది. ఈ మేరకు నెటిజన్స్ కూడా పెద్ద ఎత్తున స్పందించారు. కొందరు మాధవీలతను సపోర్ట్ చేయగా.. మరికొందరు చేసుకుంటే తప్పేంటని ఫైర్ అయ్యారు. మాధవీలత కూడా నెటిజన్లకు ఘాటుగా రిప్లై ఇచ్చింది. అసలు ఆ సంగతేంటో ఓ సారి చూద్దాం.

    Recommended Video

    Madhavi Latha Controversial Post Viral On Celebrities Marriages In Lockdown
    మాస్క్ ముసుగులో పెళ్లి అవసరమా?

    మాస్క్ ముసుగులో పెళ్లి అవసరమా?

    నిత్యం ఏదో ఒక వివాదాస్పద పోస్ట్ చేసే మాధవీలత లాక్ డౌన్‌లో జరిగి పెళ్లిళ్లపై ఫైర్ అయింది. ఈ మేరకు పోస్ట్ చేస్తూ.. ‘అసలు ఆగట్లేదుగా జనాలు.. మాస్క్‌లు వేసుకుని పెళ్లిళ్లు ఎందుకు?.. ముహూర్తం మళ్లీ రాదా ఇది పోతే.. శ్రావణం కాకపోతే మాఘ మాసం లేకుంటే మరో ఏడాది? పిల్ల దొరకదా? పిల్లొడు మారిపోతడ.. అలా మారిపోయే మనుషులతో బంధాలు ఎందుకటా? మాస్క్ ముసుగులో పెళ్లి అవసరమా? కొన్నాళ్లు ఆగలేని వాళ్లు సంసారాలు చేస్తారా?

    సచ్చిపోతున్నార్రా నాయన..

    సచ్చిపోతున్నార్రా నాయన..

    ఫిక్స్ అయిన మ్యారెజ్‌లో గ్యాప్ వస్తే నిజాలు తెలిసి బంపర్ ఆఫర్ మిస్ అవుతున్నారు.. సచ్చిపోతున్నార్రా నాయన అంటే ఈ పెళ్లి ఏందో.. నాకేం అర్థం కావడం లేదు.. క్రేజీ జనాలు.. కాదు కాదు దేవుడే చాలా క్రేజీ.. నా పోస్ట్ నా ఇష్టం నా అభిప్రాయం నా ఇష్టం.. నా భావాలను ప్రకటించే హక్కు నాకుంది' అని సెలెబ్రిటీల వివాహాలపై సెటైర్ వేసింది.

    నీకేమైనా నొప్పా..

    నీకేమైనా నొప్పా..

    మీరు కూడా వెయిట్ చేయండి... నీకు చాలా టైమ్ ఉంది అనుకుంటా అని ఓ నెటిజన్ చేసిన కామెంట్‌కు నీకేమైనా నొప్పా అంటూ సెటైర్ వేసింది. మధ్యలో హ్యాండ్ ఇచ్చే వారు కూడా ఉంటారు కదా బెటర్ ఆప్షన్ దొరికిందని.. చేసుకుంటే తప్పేంటని మరో నెటిజన్ సమర్థించాడు.

    అలాంటి వారని అర్థం..

    అలాంటి వారని అర్థం..

    ఆ కామెంట్‌కు స్పందించిన మాధవీలత.. అలా క్యాన్సల్ చేశారంటే వారు కమిటెడ్ పీపుల్ కాదు కదా అని చెప్పుకొచ్చింది. ఈ పోస్ట్ నిఖిల్-పల్లవి పెళ్లిని ఉద్దేశించే కదా అని అడిగితే.. ఏమో అని సింపుల్‌గా తప్పించుకుంది. మొత్తానికి మాధవీలత చేసిన ఈ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది.

    English summary
    Madhavi Latha Fires On Netizens About Celebrities Marriage In Lockdown. Some Of Netizens Supporting Madhavilatha Point Of View About Marriages In Lockdown.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X