twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అలాంటి వారు ఉంటే ఎంత పోతే ఎంత మర్యాదగా దొబ్బేయండి.. రెచ్చిపోయిన మాధవీలత

    |

    మాధవీలత సోషల్ మీడియాలో ఎంత ఫేమస్సో అందరికీ తెలిసిందే. సినిమాల ద్వారా, రాజకీయాల్లోకి రావడం ద్వారా వచ్చిన ఫేమ్ కు పదింతలు సోషల్ మీడియా ద్వారా వచ్చింది. యూట్యూబ్‌లో ఇంటర్వ్యూలు, ఫేస్ బుక్‌లో పోస్ట్‌లతో మాధవీలత విపరీతమైన క్రేజ్‌ను తెచ్చుకుంది. ఆ మధ్య మీటూ, క్యాస్టింగ్ కౌచ్ సమయంలో మాధవీలతా సంచలన కామెంట్స్ చేసింది. శ్రీ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడటం, పవన్ కళ్యాణ్‌కు మద్దతు తెలపడంతో అప్పట్లో బాగానే వైరల్ అయింది. ఇక అప్పటి నుంచి సోషల్ మీడియాలో ఏదో ఒక కామెంట్ చేసి వార్తల్లో నిలుస్తూనే ఉంది.

    సోషల్ మీడయాలో యాక్టివ్..

    సోషల్ మీడయాలో యాక్టివ్..

    మాధవీలత సోషల్ మీడయాను విపరీతంగా ఫాలో అవుతూ ఉంటుంది. సినీ, రాజకీయ, సామాజిక సమస్యలపై నిత్యం స్పందిస్తూనే ఉంటుంది. లాక్ డౌన్ సమయంలో అయితే నక్షత్ర ఫౌండేషన్ ద్వారా ఆకలితో ఉన్న వారికి సాయం చేసింది. సేవా కార్యక్రమాలు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. వీటి కోసం తన ఫాలోవర్స్ నుంచి విరాళాలను కూడా సేకరిస్తూ ఉంటుంది.

    పరోక్ష పోస్ట్‌లు..

    పరోక్ష పోస్ట్‌లు..

    తాను సంతోషంగా ఉన్నానని, కొత్త జీవితాన్ని ప్రారంభించాలని ఇలా కారణాలు చెప్పకుండా చేసే పోస్ట్‌లు సైతం తెగ వైరల్ అయ్యాయి. అయితే ఈ పోస్ట్‌లు తన పెళ్లి గురించేనని అందరూ అనుకోవడం, అది కాస్తా మీడియాలో వైరల్ కావడంతో మాధవీయే స్వయంగా క్లారిటీ ఇచ్చింది. తాను పెళ్లి చేసుకోవడం లేదని ఆ వార్తలు అవాస్తవమని చెప్పుకొచ్చింది.

     అరె లుచ్చా లఫంగ్..

    అరె లుచ్చా లఫంగ్..

    తాజాగా మాధవీలత నెగెటివ్ కామెంట్స్ చేసే వారిపై విరచుకుపడింది. బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడే ఓ వ్యక్తికి సాయం చేయండని పెట్టిన పోస్ట్‌కు నెగెటివ్ కామెంట్స్ రావడంపై విరుచుకుపడింది. తాను ఆ పోస్ట్ పెట్టినప్పుడే అలాంటి కామెంట్స్ వస్తాయని ఊహించానని, వచ్చిన 26 కామెంట్లలో 20 కామెంట్లు అలాంటివేనని, నీవు ఏం పీకుతున్నావ్, నువ్ సాయం చేయొచ్చు కదా అని అంటున్నారని తెలిపింది. సాయం చేసేంత తనకు ఉంటే చేసే దాన్ని అని చెబుతూ.. లుచ్చా లఫంగ్ ఫెలోస్ అంటూ విరుచుకుపడింది.

    మర్యాదగా దొబ్బేయండి..

    మర్యాదగా దొబ్బేయండి..

    ఓ మనిషి ప్రాణం కాపాడేందుకు సాయం చేయండని పోస్ట్ పెడితే నెగెటివ్ కామెంట్లు పెట్టే యెదవలు ఉంటే ఎంత పోతే ఎంత అని ఓ రేంజ్‌లో ఫైర్ అయింది. అలాంటి వారు నా ఫాలోవర్స్ నుంచి వెళ్లిపోండని, తానే చాలామందిని బ్లాక్ చేస్తున్నానని, ఇక మిగతావారు కూడా మర్యాదగా దొబ్బేయండని వార్నింగ్ ఇచ్చింది.

    English summary
    Madhavi Latha Fires On Netizens For Negative Comments On Brain Tumor Post. She wants To Do Help For Brain Tumor Patient. But netizens Trolled Her.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X