ఈడబ్బా యేసాలో సూడలేకున్నాం నాయనా.. అవన్నీ మా కళామతల్లికి తెలుసు.. మాధవీలత సైటైర్స్

మాధవీలత వెండితెరపై కంటే సోషల్ మీడియా, యూట్యూబ్ చానెల్‌ల్లోనే ఎక్కువగా ఫేమస్. చేసింది కొన్ని సినిమాలే అయినా మంచి పాత్రలనే ఎంచుకుంది. అయితే సినీరంగం నుంచి బయటకు వచ్చి రాజకీయాల్లోకి అడుగు పెట్టింది. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే మాధవీలత.. ప్రతీ సమస్యపై స్పందిస్తుంది. సినీ, రాజకీయ అంశాలకు సంబంధించిన రోజూ ఏదో ఒక పోస్ట్ చేస్తూనే ఉంటుంది. మొన్న సుశాంత్ ఆత్మహత్యపై స్పందించగా నేడు సినీ ప్రపంచంపై ఓ సెటైర్ వేసింది.

 ఈడబ్బా యేసాలో సూడలేకున్నాం...

ఈడబ్బా యేసాలో సూడలేకున్నాం...

అయితే మాధవీలత ఎవ్వరిని ఉద్దేశించి పోస్ట్ చేసిందో కానీ అందులో అర్థం, యాస అందర్నీ ఆకట్టుకుంటోంది. ఇంతకీ ఆ పోస్ట్ ఏంటంటే.. ‘అబ్బో సాలు సామి సంబురాలు .. ఈడబ్బా యేసాలో సూడలేకున్నాం నాయనా ..... అబ్బా అబ్బా ఎం కథలు.. ఎం యవ్వారాలు.. ఇయన్నీ నిజాలైతే సాన బాగుండు దొర కానీ కాకపోయానే .... ఎందోలే పెద్దోళ్ళు సెప్తానే ఉండేటోళ్లు పైన ఒక యేసం లోపల వేరే రూపం అని

 నమ్మించుడు తెలుసు ముంచుడు తెలుసు

నమ్మించుడు తెలుసు ముంచుడు తెలుసు


మా సినిమావోల్లు ఇన్ని ఏసాలేయ్యరయ్య... అన్ని తెరమీదనే.. పాపం సేతకానపుడు ఎన్ని పానాలు విడిసాయో.. మా కళామతల్లికి తెలుసు.. సిత్రాలల్ల నటింసుడు తప్ప లౌక్యం తెల్వకపోయే ....
మీరంతా గొప్పోళ్ళు సామి .. నమ్మించుడు తెలుసు ముంచుడు తెలుసు మళ్ళా ఎం తెల్వనట్లు తెల్ల మనసులెక్క నవ్వుడు తెల్సు ....

మాయదారి లోకం మాయదారి మనుసులు

మాయదారి లోకం మాయదారి మనుసులు

ఎందోలే సామి .. తెరమీద ఉండేటోళ్లకి మాకు తెర ఎదురుగ నటించేటోళ్లు ఎట్టా తెలుస్తారులే.. బతక నేర్సినోళ్లు గొప్పోళ్ళంటారు మిమ్మల్నే .... ఎంతైనా మిమ్మల్ని సూసి నేర్సుకోవాలయ్యా ......
ఈ జన్మకి ఈ జీవితం లో నటించుడు వస్తాడో రాదో సామి ..... మాయదారి లోకం మాయదారి మనుసులు .... బలే సిత్రమయ్యా ......

ఎట్టా నవ్వుతారు సామి

ఎట్టా నవ్వుతారు సామి

ఎన్ని బతుకులు ఉసురు పోసుకుని ఉంటారు.. ఎట్టా నవ్వుతారు సామి ... ఎట్టా అంత సల్లగుంటారు అయ్యా .... బతకటం తెల్సినోళ్లు ఇట్లనే ఉంటరేమో అయ్యా .... ఎదుటోళ్ల బతుకులు కాటికి ఈడుస్తున్న మనకేమి పట్టనట్టు పచ్చగా ఉంటారయ్య .... దండాలయ్యా.. మీలాగా బతకలేకపోయినందుకు .... నా పోస్ట్ నా ఇష్టం అంటూ మాధవీలత రాసుకొచ్చింది.

Recommended Video

Madhavi Latha Reacts On Sushant's సూసైడ్ And How The Depression ఎఫెక్ట్స్
ఎవరిని అనుకుంటే వారే..

ఎవరిని అనుకుంటే వారే..

అయితే ఈ పోస్ట్‌ను ప్రతీ ఒక్కరూ గందరగోళానికి గురయ్యారు. ఎవరిని ఉద్దేశించి అన్నారో కాస్త చెప్పండని వేడుకోగా.. స్వాహా అనుకోవడమే ఎవరికీ వారు అని సమాధానం ఇచ్చింది. ఇంతకీ ఎవరి గురించి అని మాత్రం స్పష్టంగా సెలవివ్వలేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X