twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మాధురి దీక్షిత్ కెరీర్ బెస్ట్ సాంగ్స్ లో సరోజ్ ఖాన్ కీలకపాత్ర.. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్

    |

    బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మరో ఊహించని ఘటన చోటు చేసుకుంది. దాదాపు 2000పాటలకు కొరియోగ్రాఫర్ గా వర్క్ చేసిన సరోజ్ ఖాన్ హఠాత్తుగా గుండెపోటుతో మరణించడం సినీ అభిమానులను షాక్ కి గురి చేసింది. అయితే ఆమె బాలీవుడ్ లో 40 ఏళ్ల పాటు కొనసాగారు. ఎక్కువగా మాధురి దిక్షిత్ కెరీర్ కి ఆమె ఎంతగానో ఉపయోగపడ్డారు. మాధురీ కెరీర్ లో బెస్ట్ పెర్ఫెమెన్స్ ఇచ్చిన సాంగ్స్ లిస్ట్ తీస్తే అందులో టాప్ 5 సాంగ్స్ కి సరోజ్ ఖాన్ కంపోజ్ చేశారు.

    ధక్ ధక్ సే

    ధక్ ధక్ నుంచి చనే కె ఖేత్ మెయిన్ అనే సాంగ్ వరకు వీరి కాంబినేషన్ కి మంచి గుర్తింపు దక్కింది. ఒక విధంగా మాధురి దీక్షిత్ బెస్ట్ డ్యాన్సర్ గా అప్పట్లో గుర్తింపు తెచ్చుకున్నారు అంటే అందుకు ప్రధానం కారణం సరోజ్ ఖాన్. అప్పటివరకు ఉన్న డ్యాన్స్ మూమెంట్స్ కి సరికొత్త అర్ధాన్ని ఇచ్చారు.

    madhuri dixit and saroj khan all time best songs

    సంజయ్ లీలా భన్సాలి దేవ్ దేవ్ దాస్ సినిమాలో డోలారే డోలారే సాంగ్ ఆల్ టైమ్ బెస్ట్ సాంగ్స్ లో ఒకటి. ఐశ్వర్యారాయ్ , మాధురి దీక్షిత్ కలిసి చేసిన ఆ సాంగ్ ఇప్పటి జనరేషన్స్ ని కూడా ఎంతగానో ఆకట్టుకుంటుంది.

    ఎక్ దో తీన్ సాంగ్

    తేజాబ్ చిత్రంలో మాధురీ దీక్షిత్ ఎంట్రీ సాంగ్ ఎక్ దో తీన్ సాంగ్ భాషతో సంబంధం లేకుండా దేశ వ్యాప్తంగా ఒక ట్రెండ్ సెట్ చేసింది అంటే అందులో సరోజ్ ఖాన్ పనితనం క్లియర్ గా కనిపిస్తుంది. ఆ తర్వాత బేటా సినిమాలో మాధురి దీక్షిత్ సరోజ కాంబోలో వచ్చిన ధక్ ధక్ సాంగ్ కూడా సూపర్ హిట్ గా నిలిచింది.

    చాందినీలో మేరే హాతోం పే
    ఇక శ్రీదేవి నటించిన చాందినీ చిత్రంలో మేరే హాతోంపే పాట సంగీత అభిమానులను విశేషంగా ఆకట్టుకొన్నది. ఆ సమయంలో యువతను ఉర్రూతలూగించింది. పలు పెళ్లి కార్యక్రమంలో మహిళలు ఈ పాటకు జోష్‌తో డ్యాన్స్ చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.

    చోలీ కే పీచే క్యాహై

    చోలి కె పీచే క్యా హై అనే సాంగ్ తెలియని వారు ఉండరు. సాంగ్ తో పాటు మాధురి దీక్షిత్ స్టెప్స్ కూడా నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనేలా ఉంటాయి. అంతగా సరోజ్ ఖాన్ తన మూమెంట్స్ ని కంపోజ్ చేశారు.

    తమ్మా తమ్మా సాంగ్‌తో

    ఇక తనేదార్ సినిమాలోని తమ్మా తమ్మా సాంగ్ కూడా మాధురి కెరీర్ లో మరొక సూపర్ హిట్. కేవలం మాస్ మసాలా ట్రేడిషినల్ సాంగ్స్ అనే కాకుండా రాక్ అండ్ స్టైలిష్ సాంగ్స్ కూడా కంపోజ్ చేయగలరని నీరూపించాడు సరోజ్ ఖాన్.

    English summary
    Another tragedy occurred in Bollywood. Saroj Khan, who became a choreographer in the history of Indian cinema, died of a heart attack a few hours ago. When the news of her death came to light at dawn today, the Bollywood film industry was suddenly struck. Her sudden death as a dance master composes many songs.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X