పాక్ హీరోయిన్‌‌తో దావూద్ ఇబ్రహీం రొమాన్స్.. అఫైర్ లీక్ కావడంతో డాన్‌కు ముచ్చెమటలు

పాకిస్థాన్‌ హీరోయిన్ మెహ్వీష్ హయత్‌తో అఫైర్ వ్యవహారం భారతీయ మీడియాలో బట్టబయలు కావడంతో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం తీవ్ర దిగ్బ్రాంతికి గురైనట్టు తెలుస్తున్నది. కొద్ది రోజుల క్రితం దావూద్ రాసలీలల జీవితాన్ని జాతీయ ఛానెల్ జీ న్యూస్ బయటపెట్టడం మీడియాలో సంచలనం రేపింది. అయితే తనకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించిన విషయం బయటకు రావడంపై దావుద్‌ ఆరా తీసినట్టు వార్తలు వస్తున్నాయి. ఆ వివారాల్లోకి వెళితే..

 మెహ్వీత్ హయత్ ఐటెం గర్ల్‌గా

మెహ్వీత్ హయత్ ఐటెం గర్ల్‌గా

ఇక మెహ్వీష్ హయత్ విషయానికి వస్తే ఐటెం గర్ల్‌గా వినోద పరిశ్రమలోకి ప్రవేశించారు. తన ఐటెం డాన్యులతో ఆమె యువతను ఊర్రూతలూగించారు. ఈ క్రమంలో పాకిస్థాన్‌లో అత్యంత శృంగార తారగా గుర్తింపు పొందారు. ఆ క్రమంలోనే మెహ్వీష్ దావూద్ ఇబ్రహం దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత మెహ్వీష్‌ను లైన్‌లో పెట్టి అఫైర్ కొనసాగిస్తున్నారు అనే విషయం మీడియా కథనాల్లో స్పష్టమైంది.

 సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ..

సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ..

పాకిస్థాన్ నటి మెహ్వీష్ హయత్‌ పాకిస్థాన్ చిత్ర పరిశ్రమలో లోడ్ వెడ్డింగ్, పంజాబ్ నహీ జౌంగీ, యాక్టర్ ఇన్ లా చిత్రాల్లో నటించారు. అయితే పలు చిత్రాల్లో నటించినప్పటికీ పెద్దగా గుర్తింపు పొందలేదు. దావూద్‌తో ఆఫైర్ ఉందనే వార్తల తర్వాత మెహ్వీష్ ప్రస్తుతం సెలబ్రిటీగా మారిపోయారు. పాకిస్థాన్‌ సోషల్ మీడియాలో దావూద్, మెహ్వీష్ అఫైర్ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్రమంలో దావూద్‌, మెహ్వీష్‌కు సంబంధించిన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

దావూద్‌తో పరిచయం తర్వాత గ్రాఫ్ అలా

దావూద్‌తో పరిచయం తర్వాత గ్రాఫ్ అలా

దావూద్‌తో మెహ్వీష్ హయత్ అఫైర్ మొదలైన తర్వాత ఆమె క్రేజ్ మరింత పెరిగిపోయింది. దావూద్ తన పలుకుబడితో మెహ్వీష్‌కు పాకిస్థాన్ ఇండస్ట్రీలో భారీ అవకాశాలు ఇప్పించారు. దాంతో ఆమె పాకిస్థాన్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. కరాచీలో ఇప్పుడు దావూద్ చెప్పిందే వేదంగా మారిందనే, మెహ్వీష్ కోసం ఎంత వరకు వెళ్లడానికైనా వెనుకాడరనే మాట బలంగా వినిపిస్తున్నది.

మెహ్వీష్‌కు ప్రతిష్టాత్మక అవార్డు

మెహ్వీష్‌కు ప్రతిష్టాత్మక అవార్డు

పాకిస్థాన్‌లో ప్రతిష్టాత్మక తంగా ఏ ఇంతియాజ్ అవార్డును మెహ్వీష్ హయత్‌కు రావడంతో అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆ విషయంపై చేలరేగిన వివాదం పాక్ మీడియాలో రచ్చగా మారింది. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావూద్ కారణంగానే ఈ అవార్డు ఆమెకు లభించిందనే విషయంపై స్పష్టత వచ్చింది. ఇంకా దావూద్ కరాచీలో ఉన్నారనే వార్తకు ఈ ఘటన అద్దం పట్టింది. పాక్‌ రాజకీయాల్లో కీలక నేతలతో దావూద్‌కు సత్సంబంధాలు ఉన్నాయనే విషయం వెలుగులోకి వచ్చింది.

Recommended Video

Dawood Ibrahim May Have Hand in Sri Devi's Case?
మెహ్వీష్ బలహీనత బయటపడటంతో

మెహ్వీష్ బలహీనత బయటపడటంతో

దావూద్‌ ఇబ్రహీం తనకంటే వయసులో 27 ఏళ్ల చిన్నదైన మెహ్వీష్‌తో పీకల్లోతు ప్రేమలో ఉన్నట్టు ఓ వార్త వైరల్ అవుతున్నది. అలాగే మెహ్వీష్ ఇప్పుడు దావూద్ ఇబ్రహీంకు అత్యంత బలహీనతగా మారింది. ఆమె లేకుండా దావూద్ ఉండలేకపోతున్నారనే విషయం మీడియా కథనాల్లో రావడం ఆసక్తిగా మారింది. అయితే తన అఫైర్ విషయం భారతీయ మీడియాకు పొక్కడంపై దావూద్‌కు ముచ్చెమటలు పడుతున్నట్టు తెలిసింది. తన వ్యవహారాలు ఎలా బయటపడ్డాయనే కోణంలో దావూద్ వివరాలు సేకరిస్తున్నట్టు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X