twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఐఎఫ్ఎఫ్ఎం అవార్డ్స్: మహానటి, సంజు చిత్రాలకు అవార్డులు

    By Bojja Kumar
    |

    ఇండియన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ మెల్‌బోర్న్‌‌(ఐఎఫ్ఎఫ్ఎం) వేడుక గ్రాండ్‌గా జరుగుతోంది. ఈ సందర్భంగా పలు చిత్రాలకు అవార్డులను ప్రధానం చేశారు. తెలుగు నుండి 'మహానటి' సినిమాకు అవార్డు దక్కింది. దీంతో పాటు బాలీవుడ్ చిత్రాలు సంజు, హిచ్కీ, లవ్‌ సోనియా, గలీ గులేయా చిత్రాలకు అవార్డులు గెలుచుకున్నాయి.

    మహానటి చిత్రానికి క్వాలిటీ ఇన్ సినిమా కేటగిరీలో అవార్డు దక్కింది. ఈ విషయాన్ని చిత్ర బృందం సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులతో పంచుకున్నారు. నిర్మాతలు స్వప్న, ప్రియాంకతో పాటు హీరోయిన్ కీర్తి సురేష్, దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ ఫిల్మ్‌ఫెస్టివల్‌లో పాల్గొన్నారు.

    Mahanati wins IFFM Award

    అవార్డు అందుకోవడంపై నిర్మాత స్వప్న దత్ మాట్లాడుతూ... ఇది మా సినిమాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. మహానటి కేవలం డొమెస్టిక్ మార్కెట్లో మాత్రమే కాదు ఓవర్సీస్ మార్కెట్లో కూడా సత్తా చాటిందని తెలిపారు. ఇలాంటి సినిమా మా సంస్థ నుండి రావడం గర్వంగా ఉందన్నారు.

    Mahanati wins IFFM Award

    ఇతర కేటగిరీల్లో అవార్డుల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.

    ఉత్తమ ఇండీ (హిందీ, ఇంగ్లిషు) చిత్రం: 'లవ్‌ సోనియా'.
    ఉత్తమ ఇండీ (ప్రత్యేక) చిత్రం: 'గలీ గులేయా‌'.
    క్వాలిటీ ఇన్‌ సినిమా: 'మహానటి'.
    డైవర్సిటీ అవార్డు: 'ఫ్రీదా పింటో'.
    ఉత్తమ నటుడు: మనోజ్‌ బాజ్‌పాయ్‌ ('గలీ గులేయా‌').
    ఐఎఫ్ఎఫ్ఎం వాన్‌గార్డ్‌ అవార్డు: రణ్‌బీర్‌ కపూర్‌ ('సంజు').
    ఉత్తమ నటి: రాణీ ముఖర్జీ ('హిచ్కీ').
    ఉత్తమ చిత్రం: 'సంజు'.
    ఉత్తమ దర్శకుడు: రాజ్‌కుమార్‌ హిరాణీ.‌
    ఉత్తమ సహాయ నటులు: విక్కీ కౌశల్‌ ('సంజు'), రిచా చద్దా ('లవ్‌ సోనియా').
    ఎక్సలెన్స్‌ ఇన్‌ సినిమా: రాణీ ముఖర్జీ.

    English summary
    The film ‘Mahanati’ has bagged the Indian Film Festival of Melbourne (IFFM) Equality in Cinema award. This is the first award, the film has received after its release and blockbuster success. The team of ‘Mahanati’ i.e, director Nag Ashwin, actress Keerthy Suresh, producers Swapna Dutt and Priyanka Dutt have attended the IFFM award ceremony and received the award.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X