పవన్ కళ్యాణ్ తో మల్టీస్టారర్.. మహేష్ బాబు చెప్పిన ఒకే ఒక్క మాట!
టాలీవుడ్ ఇండస్ట్రీలో మల్టీస్టారర్ సినిమాల హవా మళ్ళీ మొదలైందని చెప్పవచ్చు. ఒకప్పుడంటే అభిమానుల మధ్య విబేధాలు ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు సోషల్ మీడియాలో తప్పితే బయట అలాంటివి ఎక్కువగా కనిపించడం లేదు. అందుకే దర్శకులు కూడా దైర్యంగా కథలు రాస్తున్నారు. ఇక మహేష్ బాబు - పవన్ కళ్యాణ్ లాంటి హీరోలు మల్టీస్టారర్ సినిమాలు చేస్తే బాక్సాఫీస్ వద్ద సందడి మాములుగా ఉండదు. అయితే పవర్ స్టార్ తో మూవీపై మహేష్ ఒక ఇంటర్వ్యూలో చెప్పిన మాట ఫ్యాన్స్ ఎవరు అంతగా ఈజీగా మర్చిపోలేరు.

అది కరెక్ట్ గా ఉంటే..
సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు సినిమా నుంచి పెద్ద హీరోల మల్టీస్టారర్ సినిమాలకు ఒక ప్రత్యేకమైన ఏర్పడింది. వెంకటేష్ మహేష్ బాబు కలిసి నటించడంతో అప్పటి నుంచి ఇతర హీరోలు కూడా ఫ్రెండ్లిగా వర్క్ చేయాలని అనుకుంటున్నారు. అయితే అందరికి కావాల్సింది ముఖ్యంగా కథ. అది కరెక్ట్ గా ఉంటే చాలని అనుకుంటున్నారు.

రెమ్యునరేషన్ విషయంలో
మల్టీస్టారర్ కథలు అంటే ఇప్పుడు రెమ్యునరేషన్ విషయంలో ఎవరు కూడా ముందే డిమాండ్ చేయడం లేదు. సినిమా రిజల్ట్ తరువాత మాట్లాడుకుందామని కూడా అనుకుంటున్నారు. ఇక సినిమా హిట్టయితే కొందరికి రెమ్యునరేషన్ కంటే ఎక్కువ షేర్ కూడా లభిస్తోంది. అందుకే మల్టీస్టారర్ లకు డిమాండ్ ఎక్కువయ్యింది.

అది మాములు విషయం కాదు
ఇక ప్రస్తుతం మెగా, నందమూరి అభిమానులకు కిక్కిచ్చేలా రాజమౌళి RRR సినిమాను రెడీ చేస్తున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి బడా హీరోలు కలిసి నటించడం అంటే అది మాములు విషయం కాదు. సినిమా విడుదలైతే ఒక పండగలా ఉంటుందని చెప్పవచ్చు.

మహేష్ బాబు - పవన్ కళ్యాణ్
అయితే ఇండస్ట్రీలో ఎక్కువమంది కోరుకునే ఏకైక మల్టీస్టారర్ ఏదైనా ఉందా అని అంటే.. అది మహేష్ బాబు - పవన్ కళ్యాణ్ సినిమానే. వీరి కలయికలో మల్టీస్టారర్ వస్తే చూడాలని కోట్లాది మంది ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే మహేష్, పవన్ ఇద్దరు ఎక్కువగా కలుసుకోకపోయినా కూడా మంచి స్నేహితులని అందరికి తెలిసిందే.

సమాధానం ఇచ్చిన మహేష్బ్
జల్సా సినిమాకు త్రివిక్రమ్ అడగ్గానే మహేష్ వాయిస్ ఓవర్ ఇచ్చాడు. ఇక సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు సినిమా అనంతరం ట్విట్టర్ లో చాలామంది పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తారా అని ప్రశ్నించగా తప్పకుండా చేస్తానని మహేష్ సమాధానం ఇచ్చారు.
ఒక ఇంటర్వ్యూలో కూడా పవన్ కళ్యాణ్ తో చేయడానికి నేను సిద్ధమే అని ఓపెన్ గా వివరణ ఇచ్చారు.

సాధ్యమయే పనేనా?
దాంతో అప్పట్లో ఆ కాంబినేషన్ కలవబోతున్నట్లు అనేక రకాల రూమర్స్ వచ్చాయి. ముఖ్యంగా త్రివిక్రమ్ కథ కూడా సెట్ చేసినట్లు రూమర్స్ వచ్చాయి. కానీ అవేవి నిజం కాదు. ఒకవిధంగా అలాంటి పెద్ద స్టార్స్ కు కథ సిద్ధం చేయాలి అంటే ఎవరికి సాధ్యం కాదనే చెప్పాలి. ఏదేమైనా మహేష్ మాత్రం చాలా ఫ్రీగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అది నిజమవ్వాలని అభిమానులు ఇంకా కోరుకుంటూనే ఉన్నారు.


Click it and Unblock the Notifications











