దెబ్బకు రికార్డులు బద్దలు.. సూపర్ స్టార్ ఫ్యాన్స్ తడాఖా.. హాట్ టాపిక్‌గా మహేష్ బాబు
సూపర్ స్టార్ మహేష్ బాబు స్టామినా ఏంటో బాక్సాఫీస్ లెక్కలు చెబుతాయి. అది కాకుండా మహేష్ బాబు రేంజ్ గురించి ప్రత్యక్షంగా తెలియాలంటే సోషల్ మీడియాను ఫాలో అవ్వాలి. తెలుగులో మరే స్టార్‌కు లేనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ మహేష్ సొంతం. అది ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టా అని తేడా లేకుండా అన్నింటా ఆధిపత్యాన్ని కనబరుస్తుంటాడు. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే మహేష్‌కు భారీగా అభిమాన గణం ఉంది.
Recommended Video

సోషల్ మీడియాలో రికార్డులు..
సోషల్ మీడియాలో మహేష్ బాబు క్షణాల్లో రికార్డులు క్రియేట్ చేయగలడు. మహేష్ ఫాలోయింగ్ అలాంటిది మరి. మహేష్‌కు సంబంధించిన ప్రతీ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సితారతో ఆడుకున్నా, మహేష్ నవ్వుతున్నా, ఫ్యామిలీతో సరదాగా గడిపినా వాటికి సంబంధించిన పిక్స్ తెగ సందడి చేస్తాయి.

బర్త్ డే ట్రెండ్స్..
ప్రస్తుతం హీరోల అభిమానులు బాక్సాఫీస్ లెక్కలపై దృష్టి పెట్టడం లేదు. సోషల్ మీడియాలో ఎవరు ముందంజలో ఉన్నారనే దాన్నే ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. అందులోనూ తమ హీరో బర్త్ డే వస్తుందంటే చాలు నానా హంగామా చేసేస్తున్నారు. దేశ వ్యాప్తంగా తమ హీరో పేరు మార్మోగిపోయేలా ట్వీట్లు చేస్తున్నారు.

కామన్ డీపీ, అడ్వాన్స్ బర్త్ డేలు..
ఒకప్పుడు యాభై రోజులు, వంద రోజుల వేడుకులు ఉండేవి. కానీ ఇప్పుడు బర్త్ డే ఇంకా వంద రోజుల్లో రాబోతోంది, యాభై రోజులే ఉంది అంటూ బర్త్ డేలను ట్రెండ్ చేస్తున్నారు. కామన్ డీపీలంటూ మరింత వైరల్ చేస్తున్నారు. దీని కోసం ప్రత్యేకమైన పోస్టర్‌ను డిజైన్ చేస్తున్నారు.

యాభై రోజుల వేడుక..
మహేష్ బాబు బర్త్ డే (ఆగస్టు 9)కు ఇంకా యాభై రోజులు ఉండటంతో నిన్న (జూన్ 20) ఓ హ్యాష్ ట్యాగ్‌తో బీభత్సం సృష్టించారు. #AdvanceHBDMaheshBabu అనే హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేయడంతో నిన్న దాదాపు 5.6 మిలియన్ల ట్వీట్లు చేసి రికార్డులు క్రియేట్ చేశారు. ఈ జోరు చూస్తుంటే సూపర్ స్టార్ బర్త్ డేన ట్విట్టర్ మోత మోగాల్సిందే.

ఆలస్యం కానున్న షూటింగ్..
మహేష్ బాబు ప్రస్తుతం పరుశురామ్ కాంబోలో సర్కారు వారి పాట చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే కరోనా తగ్గుముఖం పట్టేట్టు కనిపించకపోవడంతో షూటింగ్ చేయకూడదని మహేష్ భావిస్తోన్నట్టు కనిపిస్తోంది. అందుకే డిసెంబర్‌లో సర్కారును సెట్స్‌పైకి తీసుకవెళ్తారని టాక్.


Click it and Unblock the Notifications











