For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఏడేళ్ల క్రితమే కీర్తీ సురేష్‌తో మహేశ్ బాబు: అప్పుడలా చేయబట్టే ఇప్పుడు సర్కారు వారి పాటలో!

  |

  తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉన్న హ్యాండ్సమ్ హీరోల్లో సూపర్ స్టార్ మహేశ్ బాబు ఒకడు. కెరీర్ ఆరంభంలోనే ఎంతో మంది అమ్మాయిల కలల 'రాజకుమారుడిగా' మారిపోయిన అతడు.. ఆ తర్వాత తన క్యూట్ అండ్ స్వీట్ లుక్స్‌తో కొన్ని కోట్ల మంది అభిమానాన్ని అందుకున్నాడు. ఇందులో ఎక్కువ మంది మహిళా అభిమానులే ఉంటారు. ప్రేక్షకుల వరకూ ఎందుకు? సినీ పరిశ్రమల్లో ఉన్న హీరోయిన్లే మహేశ్ బాబుతో ఒక్క సినిమాలో అయినా నటించాలని కలలు కంటుంటారు. అంతలా ఇతగాడు తన స్టైల్స్‌తో అమ్మాయిల మనసులు దోచుకుంటున్నాడు. ఇక, ఇప్పుడు 'సర్కారు వారి పాట'లో హీరోయిన్‌గా నటిస్తోన్న కీర్తీ సురేష్‌.. ఏడేళ్ల క్రితమే మహేశ్ బాబును కలిసింది. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

  టాలీవుడ్ యువరాజు... ఫుల్ ఫామ్‌తో

  టాలీవుడ్ యువరాజు... ఫుల్ ఫామ్‌తో

  సూపర్ స్టార్ కృష్ణ కుమారుడిగా చిన్న వయసులోనే తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు మహేశ్ బాబు. బాల నటుడిగానే సత్తా చాటిన అతడు.. హీరోగా మారిన తర్వాత కూడా టాలీవుడ్‌లో యువరాజుగా వెలుగొందుతున్నాడు. ఇక, ఈ మధ్య కాలంలో వరుసగా విజయాలను అందుకుంటూ ఫుల్ ఫామ్‌తో కనిపిస్తున్నాడు. తద్వారా తన మార్కెట్‌ను కూడా భారీగా పెంచుకుంటున్నాడు.

  హాట్ షోతో షాకిచ్చిన అనన్య నాగళ్ల: అందాలన్నీ కనిపించేలా తెలుగమ్మాయి ఘాటు ఫోజులు

  హ్యాండ్సమ్ హీరోతో మహానటి రొమాన్స్

  హ్యాండ్సమ్ హీరోతో మహానటి రొమాన్స్

  వరుస విజయాలతో దూసుకుపోతోన్న మహేశ్ బాబు ప్రస్తుతం పరశురాం దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో అతడి సరసన కీర్తీ సురేష్ నటిస్తోంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలతో కలిసి మహేశ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. థమన్ సంగీతం అందిస్తున్నాడు. దీన్ని సంక్రాంతికి విడుదల చేయనున్నారు.

  ఆ పాత్రకు ప్రాధాన్యం... దానితో క్లియర్‌

  ఆ పాత్రకు ప్రాధాన్యం... దానితో క్లియర్‌

  ‘సర్కారు వారి పాట' నుంచి మహేశ్ పుట్టినరోజు కానుకగా ‘సర్కారు వారి పాట బర్త్‌డే బ్లాస్టర్' పేరిట టీజర్ విడుదలైంది. ఇందులో హీరోను అల్ట్రా స్టైలిష్ గెటప్‌తో చూపించారు. అతడు చెప్పిన డైలాగ్స్, చూపించిన గ్రేస్‌ అదుర్స్ అనిపించాయి. అలాగే, ఈ వీడియోలో కీర్తి సురేష్‌ను కూడా బాగానే హైలైట్ చేశారు. దీంతో సినిమాలో ఆమె పాత్రకు ప్రాధాన్యం ఉంటుందన్నది క్లియర్ అయింది.

  షర్ట్ మొత్తం విప్పేసిన సీరియల్ నటి: లోదుస్తులు కూడా లేకుండా మరీ పచ్చిగా కనిపించడంతో!

  7ఏళ్ల క్రితమే సూపర్ స్టార్‌తో మహానటి

  7ఏళ్ల క్రితమే సూపర్ స్టార్‌తో మహానటి

  కీర్తీ సురేష్ ఎనిమిదేళ్ల వయసులోనే చైల్డ్ ఆర్టిస్టుగా పలు మలయాళ చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత అదే భాషలో ‘గీతాంజలి' అనే సినిమాతో హీరోయిన్‌గా మారింది. అప్పటి నుంచి వరుస చిత్రాలతో దూసుకెళ్తోంది. ఈ క్రమంలోనే 2016లో ‘నేను శైలజ'తో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే, అంతకంటే ముందే అంటే ఏడేళ్ల క్రితమే మహేశ్ బాబును ఈమె కలిసింది.

  పాత ఫొటోలో ఆ దిగ్గజాలతో మహానటి

  ఏడేళ్ల క్రితం కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించిన ఓ సినిమాను సూపర్ స్టార్ మహేశ్ బాబు లాంచ్ చేశాడు. దీనికి సంబంధించిన ఫొటో ఒకటి తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో సూపర్ స్టార్ మహేశ్ బాబుతో పాటు దిగ్గజాలు డీ రామానాయుడు, విజయ నిర్మల, నటుడు నరేష్ కూడా ఉన్నారు. ఇందులో చిట్ట చివరన కీర్తీ సురేష్ చిరునవ్వులు చిందిస్తూ కనిపిస్తోంది.

  అప్పుడలా చేయబట్టే.. ఇప్పుడిలా అని

  అప్పుడలా చేయబట్టే.. ఇప్పుడిలా అని


  ఇప్పుడీ ఫొటోను మహేశ్ బాబు అభిమానులు సోషల్ మీడియాలో షేర్లు చేస్తున్నారు. అంతేకాదు, ‘అలా మహేశ్ బాబు ఏడేళ్ల క్రితం ఎంకరేజ్ చేస్తే.. ఇవాళ బాబు పక్కన హీరోయిన్. జాతీయ అవార్డును కూడా గెలుచుకుంది' అని పోస్టులు పెడుతున్నారు. అదే సమయంలో పాత ఫొటోతో పాటు ఇప్పుడు ‘సర్కారు వారి పాట' స్టిల్‌ను కూడా షేర్ చేస్తూ మహేశ్‌ను ఆకాశానికి ఎత్తుతున్నారు.

  English summary
  Mahesh Babu Now Doing Sarkaru Vaari Paata Movie under Parasuram Direction. This Movie Heroine Keerthy Suresh and Mahesh Babu Old Pic Gone Viral Now.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X