మదర్స్ డే: అమ్మ జ్ఞాపకాల్లోకి మహేష్ బాబు, మంచు లక్ష్మి, రష్మి గౌతమ్, రకుల్, చార్మి

ఈ సృష్టిలో విలువ కట్టలేనిది అంటూ ఏమైనా ఉంది అంటే...అది ఒక అమ్మ ప్రేమ మాత్రమే. ఈ భూమి మీద అమ్మ లేకుండా ఏదీ లేదు. అమ్మ ఆ మాటలోనే ఎంత కమ్మదనం ఉంది. అమ్మ ఒడి అందరికి తొలి బడి. ఈ లోకంలోకి వచ్చిన ప్రతి జీవి మొదట చూసేది అమ్మనే. మనల్ని ప్రేమించే మొదటి మనిషి కూడా అమ్మనే.

ఈ సృష్టికి మూలం ఆ భగవంతుడు అవునో కాదు తెలియదు కాని, మానవ సృష్టికి మూలం మాత్రం అమ్మే. జోలపాట నుంచి చందమామ కథల వరకు, ఒడి నుంచి బడి వరకు మనల్ని అనుక్షణం కంటికి రెప్పలా కాపాడటంలో అమ్మ పాత్ర ఎంత కీలకం. ఆ మాతృమూర్తి ఔన్నత్యాన్నిగుర్తు చేసుకొనే రోజు మదర్స్ డే నేడు(మే 12). మహేష్ బాబుతో పాటు పలువురు స్టార్స్ మదర్స్ డే సందర్భంగా అమ్మ గొప్పదనాన్ని గుర్తు చేసుకున్నారు.

మహేష్ బాబు

మహేష్ బాబు

‘నా జీవితంలో ఇప్పటివరకు పట్టుకున్న బెస్ట్‌ హ్యాండ్స్ అమ్మవే. నా పిల్లలు కూడా వారి అమ్మ చేయి పట్టుకునే పెరుగుతున్నారు. ఎవరి జీవితంలో అయినా ఇంతకు మించిన బ్లెస్సింగ్స్ ఏమీ ఉండవు. నా జీవితంలో ముఖ్యమైన వ్యక్తలు వీరు. అందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు'' అంటూ మహేష్ బాబు తన తల్లితో దిగిన ఫోటోను... సితార, గౌతమ్ నమ్రత ఫోటోస్ షేర్ చేశారు.

సుధీర్ బాబు

నా జీవితంలో వండర్ ఉమెన్ అమ్మే.. నా హీరో, నా బలం, నా నమ్మకం ఆవిడే, అమ్మను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను. అందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు అంటూ సుధీర్ బాబు ట్వీట్ చేశారు.

మంచు లక్ష్మీ

మదర్స్ డే సందర్భంగా మంచు లక్ష్మి తన కూతురు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘నువ్వు నా జీవితంలోకి వచ్చినందుకు థాంక్స్. నీ వల్లే నేను ఇంత ఫన్నీగా, నిబద్ధతగా, దృఢంగా ఉన్నాను. నీకు బెస్ట్‌ అమ్మగా ఉంటానని మాటిస్తున్నాను. ఏ తల్లి అయినా నీ లాంటి కూతురునే కోరుకుంటుంది. ఐ లవ్యూ యాపిల్‌. అందరికీ మదర్స్‌ డే శుభాకాంక్షలు.' అని ట్వీట్ చేసింది.

రకుల్ ప్రీత్ సింగ్

రకుల్ ప్రీత్ సింగ్

‘‘దేవుడు సృష్టించిన వాటిలో ది బెస్ట్ అమ్మ. నాకు నీలాంటి అమ్మ దొరికినందుకు నేనెంతో అదృష్టవంతురాలిని. హ్యాపీ మదర్స్ డే అమ్మ... నువ్వే నా బలం, సపోర్ట్, ఫ్రెండ్... నేను చేసే తప్పుల్లో భాగస్వామివి. నీ ప్రోత్సాహం వల్లే ఈ స్థాయికి చేరుకున్నాను.'' అని రకుల్‌ ప్రీత్‌సింగ్‌ ట్వీట్ చేశారు.

సౌందర్య రజనీకాంత్

‘‘మా అమ్మ చూపించే ప్రేమకు దరిదాపుల్లోకి కూడా ఎవరూ రాలేరు. అదే సమయంలో నేను అమ్మగా మారినపుడు పొందిన అనుభూతి వర్ణించడానికి మాటలు సరిపోవు. అమ్మకు మదర్స్ డే శుభాకాంక్షలు.'' అని ట్వీట్ చేస్తూ తన తల్లి లత, కుమారుడు వేద్ కృష్ణతో కలిసి దిగిన ఫోటోను సౌందర్య ట్వీట్ చేశారు.

ఛార్మి కౌర్

‘‘మదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ చార్మి కౌర్ తన తల్లితో కలిసి దిగిన ఫోటోను ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. ‘నువ్వు ఈ ప్రపంచంలోనే మోస్ట్ బ్యూటిఫుల్ ఉమెన్... కేవలం నాపై ప్రేమ చూపించడంలో మాత్రమే కాదు... నన్ను నువ్వు నమ్మినంతగా ఎవరూ నమ్మలేదు'' అని చార్మి ట్వీట్ చేశారు.

రష్మి గౌతమ్

రష్మి గౌతమ్

‘‘నెవర్ అనే పదాన్ని ఎప్పటికీ చెప్పకుండా ఉండటం నీ నుంచే నేర్చుకున్నాను. ఎన్నో కష్టాలను ఎదుర్కొని పోరాడి, సర్వైవ్ అయ్యావు. ఈ తరానికి అన్నీ సులభంగా దొరకుతున్నా కూడా వారిలో నీలాంటి ధైర్యాన్ని సగం చూడలేకపోతున్నాను. నేను నీ వజ్రాన్ని ఎప్పుడూ చెప్పేదానివి... నీ వల్లే నేను ఇలా ఉన్నాను. హ్యాపీ మదర్స్‌ డే మామ్‌. ఇప్పుడు నా భుజాలపై నువ్వు చిల్ అవ్వాల్సిన సమయం వచ్చింది.''- అని యాంకర్ రష్మి గౌతమ్ వ్యాఖ్యానించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X