అది మాత్రం పక్కా సర్.. మహేష్ బాబు విషెస్‌కు పరుశురాం స్ట్రాంగ్ రిప్లై
మహేష్ బాబు పరుశురాం ప్రస్తుతం సర్కారు వారి పాటతో బాగా దగ్గరయ్యారు. మహేష్ బాబు తనతో పని చేసే దర్శకులను ఎంత ఫ్రెండ్లీగా చూసుకుంటాడో అందరికీ తెలిసిందే. తమ ఫ్యామిలీలో ఒక సభ్యుడిగా చేర్చుకుంటాడు. అలా ఇప్పుడు పరుశురామ్ కూడా మహేష్ ఫ్యామిలీలో ఒకడయ్యాడు. ఆ మధ్య దీపావళికి మహేష్ బాబు నుంచి స్పెషల్ గిఫ్ట్స్ పరుశురాం ఇంటికి చేరాయి. వాటిని చూసి పరుశురాం గాల్లో తేలిపోయాడు. తాజాగా మరోసారి మహేష్ బాబు నుంచి స్పెషల్ సర్ ప్రైజ్ అందింది.

పరుశురాం బర్త్ డే..
డైరెక్టర్ పరుశురాం బర్త్ డే నేడు (డిసెంబర్ 25). ఈ సందర్భంగా దర్శకుడికి సోషల్ మీడియాలో విషెస్ వెల్లువెత్తుతున్నాయి. పరుశురాం మొదటి నిర్మాత బండ్ల గణేష్ ప్రత్యేకంగా శుభాకాంక్షలు అందించాడు. మొదటిసారి సోలో హీరోగా పరుశురాం డైరెక్షన్‌లో యువత సినిమాతో సక్సెస్ కొట్టిన నిఖిల్ కూడా ఆయనకు శుభాకాంక్షలు తెలిపాడు.

మహేష్ సర్ ప్రైజ్ ట్వీట్..
నా డైరెక్టర్ పరుశురామ్ బర్త్ డే సందర్భంగా శుభాకాంక్షలు అంటూ మహేష్ బాబు ట్వీట్ చేశాడు. సర్కారు వారి పాట నీకు జీవితంలో మెమోరబుల్‌గా గుర్తింపు పోవాలి.. నీకు ఎల్లప్పుడూ సంతోషం, విజయం చేకూరాలి అంటూ మహేష్ బాబు కోరుకున్నాడు.

పక్కా సర్..
మహేష్ బాబు అందించిన విషెస్‌పై పరుశురాం గాల్లో తేలిపోయాడు. థ్యాంక్యూ సో మచ్ సర్.. అంటూ తెగ సంబరపడిపోయాడు. మీ విషెస్‌తో నా ఈ బర్త్ డే స్పెషల్‌గా మారిపోయింది.. సర్కారు వారి పాట కచ్చితంగా మెమోరబుల్ సినిమా అవుతుంది.. పెద్ద సినిమా కూడా అవుతుంది.. పక్కా సర్ అంటూ పరుశురాం రిప్లై ఇచ్చాడు.
Recommended Video

కీర్తీ సురేష్ విషెస్..
సర్కారు వారి పాట హీరోయిన్ కీర్తి సురేష్ పరుశురాంకు విషెస్ చెప్పింది. హ్యాపీ బర్త్ డే సర్ అంటూ ట్వీట్ చేసింది. రాబోయే కాలంలో మీకు సంతోషం, విజయం చేకూరాలి సర్ అంటూ కీర్తి సురేష్ చెప్పుకొచ్చింది. మొత్తానికి పరుశురాం బర్త్ డే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.


Click it and Unblock the Notifications











