మహేష్ బర్త్ డే విషెస్.. ఉబ్బితబ్బిబైన కమెడియన్
టాలీవుడ్ కమెడియన్స్‌లో వెన్నెల కిషోర్‌కు ఉండే ప్రత్యేకత అందరికీ తెలిసిందే. వెన్నెల కిషోర్ లేని సినిమా రావడం అంటే గగనమే. ఆయన కామెడీ టైమింగ్, ఎక్స్‌ప్రెషన్స్‌కు సాటి ఎవ్వరూ రారు. వెండితెరపై ఎంత యాక్టివ్‌గా ఉంటాడో సోషల్ మీడియాలోనూ అంతే సరదాగా ఉంటాడు. నెటిజన్లు వేసే కౌంటర్లకు అంతే స్థాయిలో పంచ్‌లు వేస్తుంటారు. ట్రోల్స్‌ను కూడా అంతే ధీటుగా ఎదుర్కొంటాడు. నేడు వెన్నెల కిషోర్ బర్త్ డే. ఈ సందర్భంగా టాలీవుడ్ ప్రముఖులందరూ విషెస్ చెబుతున్నారు.
ఈ మేరకు సూపర్ స్టార్ మహేష్ బాబు స్పందిస్తూ.. వెన్నెల కిషోర్‌కు బర్త్ డే విషెస్ తెలిపాడు. హ్యాపీ బర్త్ డే వెన్నెల కిషోర్.. నువ్ ఉండేలానే ఎప్పుడూ ఎంతో సంతోషంగా ఉండు.. అని శుభాకాంక్షలు తెలిపాడు. ఇక మహేష్ బాబు ట్వీట్ చూసి వెన్నెల కిషోర్ స్పందిస్తూ.. సంబరపడిపోయాడు. ఈ ట్వీట్ ఒక్కటి చాలు సర్ ఎంతో కాలం సంతోషంగా ఉంటాను.. ఎంతో గొప్పవారు మీరు.. టన్నుల కొద్దీ ధన్యవాదాలు సర్ అంటూ గాల్లో తేలిపోయాడు.

వరుణ్ తేజ్, ప్రియదర్శి, బ్రహ్మాజి, లావణ్య, లక్ష్మీ మంచు, ఈషా రెబ్బా, తమన్, అనసూయ భరద్వాజ, దిగంగనా సూర్య వంశీ, అనిల్ రావిపూడి, బీవీఎస్ రవి, అడివి శేష్, మధురా శ్రీధర్ రెడ్డి, కోన వెంకట్, సుధీర్ బాబు, సాయి ధరమ్ తేజ్, సుశాంత్, శ్రీముఖి, సుధీర్ వర్మ, నాని, సతీష్, సురేందర్ రెడ్డి, మంచు మనోజ్, ఆదర్శ్, మారుతి, ప్రియదర్శి, రామజోగయ్య శాస్త్రి, గోపీ మోహన్, దేవా కట్టా, రవితేజ వంటి వారంతా వెన్నెల కిషోర్‌కు శుభాకాంక్షలు తెలిపారు.


Click it and Unblock the Notifications











