twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సౌత్ ఇండియాలో మహేష్ బాబు ఒక్కడు.. రజనీ, కమల్‌, ప్రభాస్, బన్నీకి అందనంత దూరంలో..

    |

    సినీ తారలకు అప్పుడైనా, ఇప్పుడైనా ఫ్యాన్స్ కొండంత బలం. ఇప్పుడు వారికి సోషల్ మీడియాలో ఉండే మరింత మంది అభిమానులు అదనపు బలంగా మారారు. సినిమా ప్రమోషన్‌లో సోషల్ మీడియా ప్రభావాన్ని గుర్తించిన స్టార్ హీరోలు తన ఫాలోవర్స్‌ను పెంచుకొనే పనిలో ఉన్నారు. తన అభిమాన హీరోల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకొనేందుకు ఫ్యాన్స్‌ను స్టార్ హీరోలను ఫాలో అవుతున్నారు. అలాంటి ప్రభావవంతమైన సోషల్ మీడియా యాప్‌ ట్విట్టర్‌లో సూపర్‌స్టార్ మహేష్ బాబు అరుదైన ఘనతను సాధించారు. అదేమిటంటే..

    వరుస విజయాలతో సూపర్‌స్టార్

    వరుస విజయాలతో సూపర్‌స్టార్

    ఇటీవల కాలంలో మహేష్ బాబు వరుస విజయాలతో దూసుకెళ్తున్నారు. శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు లాంటి చిత్రాలతో భారీ విజయాలను అందుకొన్నారు. ఇలాంటి క్రమంలో మహేష్ అంటే ఫ్యాన్స్‌లో మరింత క్రేజ్ పెరిగింది. అదే మొత్తంలో సోషల్ మీడియాలోని ట్విట్టర్, ఇన్స్‌టాగ్రామ్‌లో ఫ్యాన్స్ సంఖ్యను గణనీయంగా పెంచుకొంటూ పోతున్నారు.

    సోషల్ మీడియాలో యాక్టివ్‌గా

    సోషల్ మీడియాలో యాక్టివ్‌గా

    ఇక సోషల్ మీడియాను విశేషంగా ఉపయోగిస్తున్న తెలుగు హీరోల్లో మహేష్ బాబు ముందు వరుసలో ఉంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఫ్యామిలీ, పర్సనల్, కెరీర్, సోషల్ ఇష్యూస్‌ను తన సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు చేరవేయడంలోనూ, స్పందించడంలో చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు. కరోనా సమయంలో మహేష్ స్పందించిన తీరుకు అన్ని వర్గాల నుంచి మంచి రెన్సాన్స్ వచ్చింది.

    సౌత్ ఇండియాలో 10 మిలియన్ ఫాలోవర్స్‌తో

    సౌత్ ఇండియాలో 10 మిలియన్ ఫాలోవర్స్‌తో

    ఇలా మరింత యాక్టివ్‌గా ఉండటంతో మహేష్ బాబుకు సినీ అభిమానులే కాకుండా సాధారణ నెటిజన్స్ కూడా ఫాలోవర్స్‌గా మారిపోయారు. తాజాగా ట్విట్టర్‌లో మహేష్ 10 మిలియన్ల ఫాలోవర్స్‌ను అంటే అక్షరాల కోటి మంది ఫాలోవర్స్‌ను సొంతం చేసుకోవడం విశేషంగా మారింది. దాంతో అభిమానులు ట్విట్టర్‌లో పండుగ చేసుకొంటున్నారు.

    టాప్ ఫాలోవర్స్ జాబితాలో

    టాప్ ఫాలోవర్స్ జాబితాలో

    సోషల్ మీడియా యాప్ ట్విట్టర్‌లో 10 మిలియన్ల ఫాలోవర్స్‌ను సొంతం చేసుకొన్న హీరోగా మహేష్ బాబు దక్షిణాది చిత్రసీమలో మొదటి వ్యక్తిగా ఓ రికార్డును సొంతం చేసుకొన్నారు. దక్షిణాదిలోకమల్ హాసన్ 6.1 మిలియన్లు, రజనీకాంత్ 5.7 మిలియన్లు, అల్లు అర్జున్ 4.7 మిలియన్లు, జూనియర్ ఎన్టీఆర్‌కు 4.2 మిలియన్స్, తమిళ సూపర్‌స్టార్ విజయ్‌కు 2.5 మిలియన్ల ఫాలోవర్స్‌తో కొనసాగుతున్నారు.

    Recommended Video

    Sushant Singh Rajput : సుశాంత్ కేసు లో Rhea Chakraborty పై కేసు వేసిన Sushant అభిమాని
    మహేష్ సర్కారు వారీ పాట ఎప్పుడంటే...

    మహేష్ సర్కారు వారీ పాట ఎప్పుడంటే...

    ఇక మహేష్ బాబు కెరీర్ విషయానికి వస్తే.. సరిలేరు నీకెవ్వరు లాంటి బ్లాక్ బస్టర్ విజయం తర్వాత సూపర్‌స్టార్ మహేష్ గీతా గోవిందం దర్శకుడు పరుశురాంతో సర్కారు వారీ పాట చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం ఇప్పటికే సెట్స్‌పైకి వెళ్లాల్సి ఉండగా, కరోనావైరస్ కారణంగా షూటింగ్ వాయిదా పడింది. ఈ చిత్ర షూటింగ్ తిరిగి అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్యలో ఎప్పడైనా ప్రారంభం కావొచ్చనే మాట వినిపిస్తున్నది.

    English summary
    Super Star Mahesh Babu becomes First South Indian Hero to cross 10 millions Followers on Twitter. In South film Industry, Versatile actor Kamal Hassan with 6.1 millions, Super Star Rajinikanth has 5.7 followers.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X