Don't Miss!
- News మేషరాశిలో శుక్ర దహనం.. ఈ రాశులవారికి కెరీర్ లో పెనుసవాళ్లు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
మహేష్ బాబు కూతురు యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టింది!
మహేష్ బాబు-నమ్రత శిరోద్కర్ కూతురు సితార చేసే అల్లరి అంతా ఇంతా కాదు. గౌతమ్ చాలా సైలెంట్ పర్సనే కానీ... సితార మాత్రం అల్లరి పిల్ల అని వారి సన్నిహితులు కూడా చెబుతుంటారు. ఇపుడు సితారకు మరో అల్లరి పిల్ల తోడైంది. ఆ పాప మరెవరో కాదు... వంశీపైడిపల్లి కూతురు ఆద్య.
'మహర్షి' మూవీ సమయంలో మహేష్ ఫ్యామిలీ, వంశీ పైడిపల్లి ఫ్యామిలీ ఎక్కువగా సినిమా సెట్లో గడిపారు. ఈ క్రమంలో సితార, ఆద్య మంచి ఫ్రెండ్స్ అయ్యారు. ఇద్దరూ కలిసి సెట్లో చాలా సందడి చేసే వారని సినిమా యూనిట్ సభ్యులు చెబుతుండేవారు.
ఇకపై సితార-ఆద్య కలిసి చేసే అల్లరి, సందడి మనం కూడా చూడొచ్చు. ఇద్దరూ కలిసి ఓ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశారు. తమ ముద్దు ముద్దు మాటలు, ఆటలతో నెటిజన్లను అలరిస్తున్నారు. ఆద్య-సితార పేరుతో ఈ ఛానల్ మొదలైంది.
మొదటి వీడియోలో.... తమను తాము పరిచయం చేసుకోవడంతో పాటు 3 మేకర్స్ చాలెంజ్ చేసి చూపించారు. ఈ ఛానల్ మొదలు పెట్టిన ఒక్కరోజులోనే వేల సంఖ్యలో వ్యూస్, సబ్స్క్రైబర్స్ రావడం విశేషం. మహేష్ బాబు అభిమానులు ఈ ఇద్దరు చిన్నారులను విష్ చేస్తూ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు.