twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మహేష్ బాబు కూతురు యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టింది!

    |

    మహేష్ బాబు-నమ్రత శిరోద్కర్ కూతురు సితార చేసే అల్లరి అంతా ఇంతా కాదు. గౌతమ్ చాలా సైలెంట్ పర్సనే కానీ... సితార మాత్రం అల్లరి పిల్ల అని వారి సన్నిహితులు కూడా చెబుతుంటారు. ఇపుడు సితారకు మరో అల్లరి పిల్ల తోడైంది. ఆ పాప మరెవరో కాదు... వంశీపైడిపల్లి కూతురు ఆద్య.

    'మహర్షి' మూవీ సమయంలో మహేష్ ఫ్యామిలీ, వంశీ పైడిపల్లి ఫ్యామిలీ ఎక్కువగా సినిమా సెట్లో గడిపారు. ఈ క్రమంలో సితార, ఆద్య మంచి ఫ్రెండ్స్ అయ్యారు. ఇద్దరూ కలిసి సెట్లో చాలా సందడి చేసే వారని సినిమా యూనిట్ సభ్యులు చెబుతుండేవారు.

     Mahesh Babu daughter Sitara started YouTube channel

    ఇకపై సితార-ఆద్య కలిసి చేసే అల్లరి, సందడి మనం కూడా చూడొచ్చు. ఇద్దరూ కలిసి ఓ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశారు. తమ ముద్దు ముద్దు మాటలు, ఆటలతో నెటిజన్లను అలరిస్తున్నారు. ఆద్య-సితార పేరుతో ఈ ఛానల్ మొదలైంది.

    మొదటి వీడియోలో.... తమను తాము పరిచయం చేసుకోవడంతో పాటు 3 మేకర్స్ చాలెంజ్ చేసి చూపించారు. ఈ ఛానల్ మొదలు పెట్టిన ఒక్కరోజులోనే వేల సంఖ్యలో వ్యూస్, సబ్‌స్క్రైబర్స్ రావడం విశేషం. మహేష్ బాబు అభిమానులు ఈ ఇద్దరు చిన్నారులను విష్ చేస్తూ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు.

    English summary
    Super Stars Mahesh Babu daughter Sitara and director Vamshi paidipally daughter Aadya start their YouTube channel. "Sitara and her friend Aadya start their YouTube channel - A & S! Wishing these two beautiful children all the very best," Mahesh PR Team said.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X