దర్శకుడికి మహేష్ బాబు దీపావళి గిఫ్ట్.. సర్‌ప్రైజ్‌కు గాల్లో తేలిపోయిన పరుశురామ్
సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకులకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాడో అందరికీ తెలిసిందే. మహేష్ బాబు దర్శకుల హీరో అని చెబుతుంటారు. డైరెక్టర్స్ చెప్పినట్టుగా చేస్తూ వారి నిర్ణయాలకు గౌరవిస్తాడని అందరూ అంటారు. మహేష్ బాబు తన దర్శకులను ఫ్యామిలీ మెంబర్స్‌లా ట్రీట్ చేస్తుంటాడు. అందుకే స్పెషల్ ఈవెంట్లకు తన డైరెక్టర్లకు స్పెషల్ ట్రీట్‌లు ఇస్తుంటాడు. తాజాగా మహేష్ బాబు తన దర్శకుడు పరుశురామ్‌కు స్పెషల్ సర్ ప్రైజ్ ఇచ్చాడు.

సర్కారు వారి కోసం..
మహేష్ బాబు మహర్షి సినిమా తరువాత ఎంత గ్యాప్ ఇచ్చాడో అందరికీ తెలిసిందే. ఎన్నెన్నో ప్రయత్నాలు చేసి చివరకు సరిలేరు నీకెవ్వరు తీసేశాడు. అది ఆరు నెలలలోపే పూర్తి చేశాడు. మళ్లీ ఈ మూవీ తరువాత ఎన్నో ప్రయత్నాలు చేశాడు. వంశీ పైడిపల్లితో సినిమా అన్నాడు. కానీ వర్కవుట్ కాలేదు. ఆ తరువాత ఇంకెన్నో చర్చలు జరిగాయి. చివరకు పరుశురామ్‌తో సర్కారు వారి పాట ఫిక్స్ అయింది. మామూలుగా అయితే ఈ పాటికి షూటింగ్ కూడా పూర్తి అయి ఉండేదేమో.

కరోనా వల్ల..
కరోనా వల్ల సినిమా మొత్తానికి వెనుకపడి పోయింది. అయితే అన్ లాక్ ప్రక్రియ మొదలైనా కూడా సినిమా సెట్స్ పైకి రాలేదు. మహేష్ బాబు ఇప్పుడే వద్దన్నాడని యూనిట్ వెనుకడుగు వేసినట్టు సమాచారం. మొత్తానికి ఈ మూవీ షూటింగ్ నవంబర్ చివర్లో గానీ డిసెంబర్ మొదటి వారంలో గానీ ప్రారంభం కానుందని తెలుస్తోంది. అందులో భాగంగానే మహేష్ బాబు యూఎస్‌కు వెళ్లాడు. ఫ్యామిలీని తీసుకుని ఎంచక్కా చాలా రోజుల తరువాత వెకేషన్‌కు వెళ్లాడు.

దీపావళి విషెస్..
ప్రస్తుతం మహేష్ బాబు యూఎస్‌లో ఎలా ఎంజాయ్ చేస్తున్నాడో అందరికీ తెలిసిందే. శిల్పా శిరోద్కర్ ఫ్యామిలీ బర్త్ డే వేడుకల్లో మహేష్ బాబు కుటుంబం సందడి చేసింది. పిల్లలతో కలిసి మహేష్ బాబు కూడా చిన్న పిల్లాడిలా మారిపోయాడు. తాజాగా ప్రేక్షకులకు, అభిమానులు దీపావళి విషెస్ తెలిపాడు. కాలుష్యానికి దూరంగా ఉండండని కోరాడు. ఎప్పుడూ వెలుగుతూ ఉండాలని అన్నాడు.
Recommended Video

దర్శకుడికి సర్ ప్రైజ్
అయితే మహేష్ బాబు తన దర్శకుడు పరుశురామ్‌కు దీపావళి సందర్భంగా బహుమతులను పంపాడు. వాటిని పరుశురామ్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ గాల్లో తేలిపోయాడు. ఇలాంటి దీపావళి ఇంతకు ముందెన్నడూ రాలేదని, చూడలేదని, మహేష్ బాబు నాకోసం స్పెషల్ గిప్ట్స్‌ను పంపించాడని చెప్పుకుంటూ పరుశురామ్ ఎమోషనల్ అయ్యాడు.


Click it and Unblock the Notifications











