ఈ ప్రేమకు 16ఏళ్ళు.. ఎప్పటికైనా నీతోనే అంటూ ముద్దుపెట్టిన మహేష్.. ఎమోషనల్ పోస్ట్ వైరల్
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా దేశవ్యాప్తంగా మోస్ట్ హ్యాండ్సమ్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ను అందుకున్నాడు. అయితే మహేష్ సినిమా ప్రపంచంలో ఎలా ఉన్నా కూడా పర్సనల్ లైఫ్ లో మాత్రం చాలా సింపుల్ గా ఉంటాడు అనేది అందరికి తెలిసిన విషయమే. ఇక రీసెంట్ గా మహేష్ తన ప్రేమకు 16ఏళ్ళు అంటూ ఒక రొమాంటిక్ ఫొటో కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

ప్రతి హ్యాపీ మూమెంట్ ను..
కాస్త టైమ్ దొరికినా కూడా ఫ్యామిలీతో కలిసి విదేశాలకు ట్రిప్పులు వేస్తుంటాడు మహేష్. లాక్ డౌన్ లో అందరికంటే ఎక్కువగా ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేశాడు. అలాగే తన ప్రతి హ్యాపీ మూమెంట్ ను కూడా సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నాడు. ఇక మహేష్ తన లేడి బాస్ నమ్రతకు సంబంధించిన ఫొటోలను కూడా చాలా ఎమోషనల్ గా షేర్ చేసుకుంటూ ఉంటాడు.

ఆ సినిమా ద్వారా.. ప్రేమలోకి
మహేష్ బాబు కంటే నమ్రత 4ఏళ్ళు పెద్ద. 2000వ సంవత్సరంలో వంశీ సినిమా ద్వారా ఏర్పడిన పరిచయం వారిని ప్రేమలోకి లాగేసింది. ఇక 2005లో అతడు సినిమా సమయంలోనే మహేష్ ప్రయివేట్ గా పెళ్లి చేసుకున్నాడు. ముంబైలోనే వారి వివాహమై జరిగింది. ఇక వారి పిల్లలు గౌతమ్, సితారా కూడా వారి టాలెంట్ తో ఆడియెన్స్ కు దగ్గరవుతున్న విషయం తెలిసిందే.

హ్యాపీ ప్రేమకు 16ఏళ్ళు
ఇక వారి పెళ్లి జరిగి నేటికి 16ఏళ్లవుతోంది. ఈ సందర్భంగా మహేష్ తన భార్యకు కిస్ ఇచ్చిన ఫొటోను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నాడు. నా హ్యాపీ ప్రేమకు 16ఏళ్ళు.. ఎప్పటికి నీతోనే అని ఒక మంచి కామెంట్ కూడా పెట్టాడు. అందుకు సంబంధించిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

బిజినెస్ పనులలో బిజీగా..
నిజానికి మహేష్ బాబుకు నమ్రత కేవలం ఒక బార్యగానే కాకుండా పర్సనల్ అడ్వైజర్ గా ఎన్నో సలహాలు ఇస్తుంటుంది. ఒకవిధంగా మహేష్ నేషనల్ లెవెల్లో యాడ్స్ చేయడానికి ముఖ్య కారణం అలాగే ప్రొడక్షన్ హౌజ్ ను స్థాపించడానికి కారణం కూడా నమ్రతనే. ఇంటి వ్యవహరాలతో పాటు బిజినెస్ వ్యవహారాలు కూడా ఎంతో తెలివిగా మ్యానేజ్ చేయడం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య.


Click it and Unblock the Notifications











