ఆయన వద్దే నేర్చుకున్నాం.. సోదరుడి బర్త్ డేపై మహేష్ బాబు, మంజుల ఎమోషనల్
సూపర్ స్టార్ కృష్ణ వారసుడి రమేష్ బాబు సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. బజారు రౌడీ వంటి మంచి చిత్రాల్లో నటించి హీరోగా నిలదొక్కుకున్నాడు. కృష్ణతో ఆయుదం సినిమాలో నటించాడు. బజారు రౌడీ చిత్రంలో మహేష్ బాబు తన అన్న రమేష్ బాబుతో కలిసి నటించాడు. అయితే అకస్మాత్తుగా రమేష్ బాబు నటించడం మానేశాడు. ఇప్పుడు రమేష్ బాబు పూర్తిగా దూరంగానే ఉంటున్నాడు. నేడు (అక్టోబర్ 13) రమేష్ బాబు బర్త్ డే.
ఈ మేరకు మహేష్ బాబు తన అన్నయ్యపై ఉన్న ప్రేమను చాటుకున్నాడు. మా అన్నయ్యకు హాపీ బర్త్ డే. మామూలుగా చెప్పాలంటే సినిమా గురించి నేను తెలసుకున్నది ఆయన వద్దే. ఆయనకున్న ఆ అంకితభావం, క్రమశిక్షణ, ఆ ప్యాషన్ అన్నీ నాకు పంచారు. నిత్యం ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్టుగా ట్వీట్ చేశాడు. మరో వైపు మంజుల ఘట్టమనేని అన్నపై ప్రేమను కురిపించింది.

ఇంటికి పెద్దవాడైనందుకు కొన్ని బాధ్యతలు ఉటాయి.. మా అందర్నీ ఎంతో జాగ్రత్తగా చూసుకున్నాడు.. బాగోగులు చూసుకున్నాడు. ఏది మంచి ఏది చెడు అన్నది నేర్పించాడు. ఆయన వద్ద నుంచి ఎంతో నేర్చుకున్నాం.
ఆయన మమ్మల్ని కాపాడే విధానం, జాగ్రత్తగా చూసుకునే విధానం ప్రత్యేకంగా ఉంటుంది. ప్రతీ బర్త్ డే ఎంతో స్పెషల్.. ఎందుకంటే మనకు వయసు పెరుగుతూ ఉంటే ఫ్యామిలీలో ప్రాముఖ్యత పెరుగుతూ ఉంటుంది. హ్యాపీ బర్త్ డే అన్నయ్య.. మీకు ఈరోజు ఈఏడాది అంతా సంతోషంగానే గడవాలి.. లవ్యూ అన్నయ్య అంటూ మంజుల పోస్ట్ చేసింది.


Click it and Unblock the Notifications











