సరిలేరు నీకెవ్వరు ఎఫెక్ట్: మహేశ్ ఫ్యాన్స్ అందరూ ఆ షో జడ్జ్ మీద పడిపోతున్నారు.!
తెలుగు సినీ ఇండస్ట్రీలోని స్టార్ హీరోలలో సూపర్ స్టార్ మహేశ్ బాబు ఒకడు. బాల నటుడిగానే సినీ రంగ ప్రవేశం చేసిన అతడు.. 'రాజకుమారుడు'తో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో.. రెట్టించిన ఉత్సాహంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ క్రమంలోనే పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి మెప్పించాడు. దీంతో స్టార్ హీరోగా ఎదిగిపోయాడు. అంతేకాదు, మెగాస్టార్ చిరంజీవి తర్వాత టాప్ పొజిషన్‌ను అందుకోవడానికి ఆయన ఎంతగానో ప్రయత్నిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే తాజాగా 'సరిలేరు నీకెవ్వరు' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా వల్ల మహేశ్ ఫ్యాన్స్ అందరి దృష్టి ఓ సెలెబ్రిటీపై పడింది. ఇంతకీ ఎవరాయన.? వివరాల్లోకి వెళితే...

సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌కు ఛాన్స్ ఇచ్చాడు
వరుస విజయాలతో దూసుకుపోతున్న యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో మహేశ్ బాబు చేసిన చిత్రమే ‘సరిలేరు నీకెవ్వరు'. దిల్ రాజు, అనిల్ సుంకరతో కలిసి ఆయన స్వయంగా నిర్మించిన ఈ మూవీలో రష్మిక హీరోయిన్. అలాగే, ఇందులో విజయశాంతి, రాజేంద్ర ప్రసాద్, ప్రకాశ్ రాజ్ తదితరులు కీలక పాత్రలు చేశారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.

హ్యాట్రిక్ నమోదు చేసిన మహేశ్
‘భరత్ అనే నేను', ‘మహర్షి' వంటి హిట్ చిత్రాల తర్వాత మహేశ్ బాబు నటించిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు'. గత శనివారం విడుదలైన ఈ మూవీ కూడా సూపర్ హిట్ అయింది. దీంతో మహేశ్ ఖాతాలో హ్యాట్రిక్ విజయాలు నమోదయ్యాయి. ఈ మూవీ టాక్ పరంగానే కాదు కలెక్షన్లలోనూ దూసుకుపోతోంది. ఫలితంగా ఎన్నో రికార్డులను బద్దలు కొడుతోంది.

రెండు రోజుల్లో దుమ్ము దులిపేశాడు
ఎన్నో అంచనాల నడుమ విడుదలైన సరిలేరు నీకెవ్వరు కలెక్షన్ల పరంగా దుమ్ము దులిపేస్తోంది. ఈ మూవీ తొలి రోజే రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఏకంగా రూ. 32.77 కోట్లు కొల్లగొట్టింది. రెండో రోజు ముగిసేసరికి తెలుగు రాష్ట్రాల్లో రూ 42.20 షేర్ వసూలైంది. అలాగే రూ. 63 కోట్ల గ్రాస్ వచ్చింది. దీంతో మహేశ్ అభిమానులు సంతోష పడిపోతున్నారు.

మహేశ్‌ను అలా చూసి ఫుల్ ఖుషీ
ఈ సినిమా హిట్ అవడం ఏమో కానీ, ఇందులో మహేశ్ బాబు డ్యాన్స్‌ను చూసిన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోతున్నారు. ఈ సినిమా కోసం మహేశ్ బాబు కష్టతరమైన స్టెప్పులను నేర్చుకున్నాడు. సినిమాలోని రెండు మూడు పాటల్లో అతడి స్టెప్పులకు భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇందులో వేసిన స్టెప్పులకు సూపర్ స్టార్ ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
Recommended Video

ఆ షో జడ్జ్ మీద పడిపోతున్నారు.!
మహేశ్ బాబు డ్యాన్స్ చూసిన తర్వాత ఆయన అభిమానులు ఓ వ్యక్తిని తెగ పొగిడేస్తున్నారు. ఆయనే ప్రముఖ కొరియోగ్రాఫర్, ‘ఢీ' డ్యాన్స్ షో జడ్జ్ శేఖర్ మాస్టర్. అవును.. తమ అభిమాన హీరోతో అదిరిపోయే డ్యాన్స్ చేయించిన మాస్టర్‌పై వాళ్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఆయనను పొగుడుతూ పోస్టులు పెడుతున్నారు.


Click it and Unblock the Notifications











