మహేశ్ బాబు సినిమాలో నమ్రత కీలక పాత్ర.. ఆ అనుభవంతోనే డేరింగ్ స్టెప్.!
చాలా ఏళ్లుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్‌గా వెలుగొంతున్నాడు మహేశ్ బాబు. హ్యాండ్సమ్ లుక్‌తో పాటు యాక్టింగ్‌లోనూ రాణిస్తూ సక్సెస్ అవుతున్నాడు. చిన్న వయసులోనే సినిమాల్లోకి ప్రవేశించిన అతడు... తక్కువ వ్యవధిలోనే స్టార్ హీరోగా ఎదిగాడు. ఇక వివాహం తర్వాత మహేశ్ బాబుకు భార్య నమ్రత శిరోద్కర్ నుంచి మద్దతు లభిస్తోంది. అందుకే అతడికి సంబంధించిన వ్యవహారాలన్నీ ఆమె స్వయంగా చూసుకుంటోంది. ఈ నేపథ్యంలో తాజాగా నమ్రత గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఆ వివరాలు మీకోసం.!

వరుస విజయాలతో మహేశ్ బాబు దూకుడు
ఇటీవల ‘భరత్ అనే నేను', ‘మహర్షి' వంటి హిట్లను అందుకున్నాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. ఈ క్రమంలోనే గత సంక్రాంతికి ‘సరిలేరు నీకెవ్వరు' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. అదే సమయంలో భారీ కలెక్షన్లు సాధించింది. దీంతో మహేశ్ ఖాతాలో హ్యాట్రిక్ నమోదైంది.

ఒకరితో అనుకుంటే.. ఇంకొకరు ఫిక్సయ్యారు
‘సరిలేరు నీకెవ్వరు' విడుదలై ఐదు నెలలు గడుస్తున్నా... మహేశ్ బాబు తదుపరి సినిమా ప్రకటన మాత్రం వెలువడలేదు. వాస్తవానికి అతడు వంశీ పైడిపల్లితో సినిమా చేయాల్సి ఉంది. దీనికి సంబంధించిన క్లారిటీ కూడా ఇచ్చాడు సదరు దర్శకుడు. కానీ, అనివార్య కారణాల వల్ల ఈ మూవీ పట్టాలెక్కలేదు. పైగా, మరో డైరెక్టర్ పరశురాంతో సినిమా చేస్తున్నాడు మహేశ్.

కెరీర్‌లో చేయని ప్రయోగాలన్నీ ఇందులోనే
పరశురాంతో చేసే సినిమాలో మహేశ్ బాబు డిఫరెంట్ లుక్‌తో దర్శనమిస్తాడని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. అలాగే, ఈ సినిమాలో అతడు లవర్ బాయ్ క్యారెక్టర్ చేస్తున్నాడని, హీరోయిన్‌తో సుదీర్ఘమైన రొమాంటిక్ సన్నివేశాల్లో నటిస్తాడని అంటున్నారు. మరీ ముఖ్యంగా కెరీర్‌లో ఇంత వరకూ చేయని సరికొత్త ప్రయోగాలు ఈ మూవీలో చేయబోతున్నాడట సూపర్ స్టార్.

ఆరోజే ముహూర్తం... మహేశ్ రావడం లేదు
పరశురాం - మహేశ్ బాబు కాంబినేషన్‌లో రాబోతున్న సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాలు మే 31న జరగనున్నాయని ప్రచారం జరుగుతోంది. మైత్రీ ఆఫీస్‌లో జరిగే ఈ కార్యక్రమానికి మహేశ్ బాబు హాజరు కావడం లేదని సమాచారం. ఆయన స్థానంలో నమ్రత శిరోద్కర్ రాబోతున్నారనే టాక్ వినిపిస్తోంది.

మహేశ్ బాబు సినిమాలో నమ్రత కీలక పాత్ర
పరశురాంతో మహేశ్ బాబు చేయబోయే సినిమా గురించి తాజాగా ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. దీని ప్రకారం... ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న ఈ సినిమాకు మైత్రీ సంస్థతో పాటు మహేశ్ బాబు సహా నిర్మాతగా వ్యవహరించనున్నాడట. ప్రొడక్షన్‌కు సంబంధించిన బాధ్యతలను నమ్రత దగ్గరుండి చూసుకోబోతున్నారని ఓ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో చక్కర్లు కొడుతోంది.

యంగ్ హీరోను డీల్ చేస్తున్నది నమ్రతనే
సూపర్ స్టార్‌కు ‘జి మహేష్‌బాబు ఎంటర్‌టైన్‌మెంట్' అనే నిర్మాణ సంస్థ ఉన్న విషయం తెలిసిందే. ఈ సంస్థ ద్వారా అడవి శేష్ హీరోగా ‘మేజర్' అనే సినిమా తెరకెక్కుతోంది. శశికిరణ్ తిక్క రూపొందిస్తోన్న ఈ సినిమా ప్రొడక్షన్ పనులను స్వయంగా చూసుకుంటున్నారు మహేశ్ భార్య నమ్రత శిరోద్కర్. ఆ అనుభవంతోనే పరశురాం సినిమాను డీల్ చేయబోతున్నారని సమాచారం.


Click it and Unblock the Notifications











