నమ్రతతో మహేశ్ బాబు లవ్ స్టోరీ.. వీరిద్దరిని కలిపిన దర్శకుడు అతనే?

తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు - నమ్రతా శిరోద్కర్ నేటి యువతకు ఆదర్శ దంపతులుగా నిలుస్తున్నారు. భర్తకు వెన్నంటే తోడుగా నిలిచే భార్య నమత్రా.. కుటుంబమే సర్వస్వంగా బతికే మహేశ్ బాబు.. తల్లిదండ్రులను గర్వించేలా చేస్తున్న పిల్లలతో మహేశ్ బాబు కుటుంబం స్ఫర్తినిస్తుంటుంది. కేవలం సినిమాలకే పరిమితం కాకుండా పలు సామాజిక సేవా కార్యక్రమాలతోనూ ఈ ఆదర్శ దంపతులు మానవత్వాన్ని చాటుతుంటారు. నేటి తరానికి కొత్త మార్గాన్ని చూపించేందుకు తమ జీవితాన్ని ఉదాహరణగా చూపిస్తున్నారు.

అయితే.. ప్రస్తుతం వాలెంటైన్స్ వీక్ ట్రెండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మహేశ్ బాబును అభిమానించే వారికి ఆయన ప్రేమకథ తెలియడం కూడా ఓ పండగలాంటిదే. కాగా, ఫిబ్రవరి 10న మహేశ్ బాబు -నమత్రా శిరోద్కర్ పెళ్లి రోజు కావడం విశేషం. మొన్నటితో వీరు వివాహబంధంలో అడుగుపెట్టి 20 ఏళ్లు గడిచింది. రెండు దశాబ్దాలుగా ఎంతో అన్యోన్యంగా, ప్రేమగా కనిపించారు. ఒకరిపట్ల మరొకరు గౌరవాన్ని ప్రదర్శిస్తూ తమ అభిమానులకు స్ఫూర్తినిస్తుంటారు. ఇక చిటికిమాటికి ఒకరినొకరు విడిచివెళ్తున్న జంటలు, నేటి యువత నేర్చుకోవడానికి మహేశ్ బాబు - నమ్రతా శిరోద్కర్ అన్యోన్య బంధమే మంచి ఉదాహరణ.

Mahesh babu Interesting Love Story With Wife Namrata Shirodkar

అయితే.. వాలెంటైన్స్ వీక్ సందర్భంగా మహేశ్ బాబు - నమ్రతా ల అందమైన ప్రేమకథ గురించి తెలుసుకుందాం. మొదట వీరు తెలుగు చిత్రం 'వంశీ' సెట్స్ లోనే కలిశారు. దర్శకుడు బీ గోపాల్ వీరి కాంబినేషన్ ను సెట్ చేశారు. దీంతో మొట్టమొదట మహేశ్ బాబు - నమ్రతా కలవడానికి ఆయన కారణమని చెబుతుంటారు. 1999లో స్టార్ కపుల్ ప్రేమకథ మొదలైంది. ఆ తర్వాత వీరి పరిచయం ప్రేమగా మారింది. దాదాపు ఐదేళ్లపాటు వీరు రిలేషన్ షిప్ లో ఉన్నారు. ఒకరికిమరొకరు పూర్తిగా అర్థమైయ్యాక పెళ్లిపీటలు ఎక్కారు. 2005 ఫిబ్రవరి 10న ముంబైలోని జేడబ్ల్యూ మారియట్‌లో వీరి వివాహం అప్పట్లో చాలా గ్రాండ్ గా జరిగింది.

పెళ్లి తర్వాత నమ్రతా సినిమాలకు పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టింది. మళ్లీ వెండితెరపై కనిపించే ప్రస్తక్తే లేదని ఇప్పటికే పలుమార్లు చెప్పింది. తెలుగులో వంశీ, అంజి వంటి చిత్రాలు చేసింది నమ్రతా. ప్రస్తుతం కొడుకు గౌతమ్, కూతురు సితారలను ఉన్నత చదువులు చదివిస్తున్నారు. మరోవైపు గౌతమ్ కు కూడా యాక్టింగ్ పట్ల శిక్షణ ఇప్పిస్తోంది. మహేశ్ బాబు సినిమాలతో బిజీ ఉంటుండగా.. వారి బిజినెస్ లు, పలు సేవా కార్యక్రమాలను నమ్రతానే దగ్గరుండి చూసుకుంటోంది.

Mahesh babu Interesting Love Story With Wife Namrata Shirodkar

ఇక సూపర్ స్టార్ మహేశ్ బాబు ఎంత డీసెంట్ గా, హుందాగా కనిపిస్తారో తెలిసిందే. తండ్రి క్రిష్ణ బాటలోనే పయనిస్తూ తండ్రికి తగ్గ తనయుడు అనిపించాడు. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను ప్రారంభించిన మహేశ్ బాబు ప్రస్తుతం ప్రపంచాన్ని తెలుగు సినిమాలవైపు తిప్పే సినిమాలను చేయబోతున్నారు. ఇప్పటికే ఇండియాలో బాబుకు ఉన్న క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ అంతా ఇంతా కాదు. ఇక ప్రస్తుతం ఇండియాస్ బిగ్గెస్ట్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళితో ఎస్ఎస్ఎంబీ29లో నటించబోతున్న విషయం తెలిసిందే. అమెజాన్ అడవుల్లో సాగే అడ్వేంచరస్ కథలో మహేశ్ బాబు విధ్వంసం చేయబోతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X