Sukumar Family Function: ఎన్టీఆర్, మహేశ్‌ను కలిపిన సుక్కూ.. చరణ్ అందుకే రాలేదు.. బన్నీ మిస్సింగ్

తెలుగు సినీ ఇండస్ట్రీలో గతంతో పోలిస్తే ఇటీవలి కాలంలో సెలెబ్రిటీల మధ్య స్నేహపూర్వక సంబంధాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా పరిశ్రమలోని హీరోలు మిగిలిన పెద్దలంతా తమ ఇగోలను పక్కన పెట్టేసి అందరితో కలుస్తున్నారు. ఇందులో భాగంగానే ఒకరి సినిమా కోసం మరొకరు సహాయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. దీంతో ఫ్యాన్స్ మధ్య కూడా సత్సంబంధాలు కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో టాలీవుడ్ టాప్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, మహేశ్ బాబు సహా సినీ నటులంతా ఓ చోట కలిశారు. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

వైభవంగా సుకుమార్ కుమార్తె ఫంక్షన్

వైభవంగా సుకుమార్ కుమార్తె ఫంక్షన్

ఆరంభం నుంచే తనకంటూ ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకుని టాలీవుడ్‌లోనే స్టార్ డైరెక్టర్లలో ఒకడిగా వెలుగొందుతున్నాడు లెక్కల మాస్టారు సుకుమార్. బుధవారం రాత్రి ఆయన కుమార్తె ఓణీల ఫంక్షన్ జరిగింది. అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకకు సినీ పరిశ్రమకు చెందిన ఎంతో మంది ప్రముఖులు హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ప్రత్యేక ఆకర్షణగా మూడు ఫ్యామిలీలు

ప్రత్యేక ఆకర్షణగా మూడు ఫ్యామిలీలు

సుకుమార్ ఫ్యామిలీలో జరిగిన ఈ ఫంక్షన్‌కు టాలీవుడ్ స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్ - ప్రణతి, మహేశ్ బాబు - నమ్రత, నాగ చైతన్య - సమంతలు వచ్చారు. తద్వారా అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకలో ఈ మూడు జంటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. స్టైలిష్‌గా ఎంట్రీ ఇచ్చిన వీళ్లంతా చిన్నారిని ఆశీర్వదించారు. ఈ ఫొటోలు ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్నాయి.

ఎన్టీఆర్, మహేశ్ రావడానికి కారణమిదే

ఎన్టీఆర్, మహేశ్ రావడానికి కారణమిదే

సుదీర్ఘ కాలంలో సుకుమార్ ఎంతో మందితో సినిమాలు చేశాడు. ఇందులో మహేశ్ బాబుతో '1.. నేనొక్కడినే'.. జూనియర్ ఎన్టీఆర్‌తో 'నాన్నకు ప్రేమతో' చిత్రాలు తెరకెక్కించాడు. ఈ కారణంగానే వీళ్లిద్దరికీ ఆయనతో మంచి సంబంధం ఏర్పడింది. అందుకే ఈ వేడుకకు హాజరయ్యారు. వీళ్లతో పాటు ఆయనతో పని చేసిన నటీనటులు కూడా సుకుమార్ కూతురి ఫంక్షన్‌కు విచ్చేశారు.

మెగా ఫ్యామిలీ నుంచి వాళ్లంతా ఎంట్రీ

మెగా ఫ్యామిలీ నుంచి వాళ్లంతా ఎంట్రీ

ఇక, ఈ వేడుక కోసం ఇండస్ట్రీలోని అన్ని ఫ్యామిలీల నుంచి నటీనటులు విచ్చేశారు. ఇందులో భాగంగానే మెగా కుటుంబం నుంచి అల్లు బాబీ, అల్లు శిరీష్ హాజరయ్యారు. అలాగే, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ తమ తల్లితో కలిసి ఎంట్రీ ఇచ్చారు. ఇక, చిరంజీవి, రామ్ చరణ్ 'ఆచార్య' షూటింగ్ కోసం మారేడుమిల్లితో ఉన్న కారణంగా వాళ్లిద్దరూ ఈ ఫంక్షన్‌కు హాజరు కాలేదని తెలుస్తోంది.

ముగ్గురు హీరోల లుక్స్ రివీలయ్యాయి

ముగ్గురు హీరోల లుక్స్ రివీలయ్యాయి

సుకుమార్ ఫ్యామిలీ ఏర్పాటు చేసిన ఈ వేడుక వల్ల ముగ్గురు హీరోల కొత్త లుక్స్ రివీల్ అయ్యాయి. ఇందులో నాగ చైతన్య తొలిసారి క్లీన్ షేవ్‌తో కనిపించగా.. మహేశ్ బాబు 'సర్కారు వారి పాట' లుక్ విపరీతంగా ఆకట్టుకుంటోంది. అలాగే, హీరో రామ్ కూడా నయా స్టైల్‌తో దర్శనమిచ్చాడు. వీళ్లకు సంబంధించిన ఫొటోలన్నీ సోషల్ మీడియాను షేక్ చేసేలా వైరల్ అవుతున్నాయి.

ఇంకా ఎవరెవరు హాజరయ్యారో తెలుసా?

ఇంకా ఎవరెవరు హాజరయ్యారో తెలుసా?

సుకుమార్ ఇంట్లో జరిగిన ఈ ఫంక్షన్‌కు హీరో రామ్, హీరోయిన్లు అనుపమ పరమేశ్వరన్, కృతి శెట్టి, అనసూయ భరద్వాజ్ సహా తదితరులు విచ్చేశారు. అలాగే, పూరీ జగన్నాథ్ ఫ్యామిలీ కూడా వచ్చింది. వీళ్లతో పాటు బిగ్ బాస్ సీజన్ 1 విజేత శివ బాలాజీ కుటుంబం, సీజన్ 3 విన్నర్ రాహుల్ సిప్లీగంజ్, జబర్ధస్త్ మహేశ్‌తో పాటు సుకుమార్ దగ్గర పని చేసిన వాళ్లంతా హాజరయ్యారు.

అల్లు అర్జున్ మిస్సింగ్.. కారణమేంటి?

అల్లు అర్జున్ మిస్సింగ్.. కారణమేంటి?

ఇక, ఈ ఫంక్షన్‌కు మెగా హీరో అల్లు అర్జున్ మిస్ అవడం చర్చనీయాంశం అవుతోంది. ప్రస్తుతం అతడు సుకుమార్‌తోనే 'పుష్ప' అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. అయినప్పటికీ ఈ ఫంక్షన్‌కు హాజరు కాలేదు. ఒకవేళ వచ్చినా దానికి సంబంధించిన ఫొటోలు మాత్రం బయటకు రాలేదు. దీంతో అతడి మిస్సింగ్‌పై ఎన్నో ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X