ముంబైలో మహేష్, నమ్రత.. రూమర్లకు చెక్ చెప్పిన ప్రిన్స్
టాలీవుడ్‌లో వరుస సినిమాలు, విజయాలతో ప్రిన్స్ మహేష్ దూసుకెళ్తున్నారు. ఓ పక్క సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటూనే యాడ్ షూటింగ్స్‌లో కూడా పాల్గొంటుంటారు. తాజాగా ముంబైలో నమ్రత, మహేష్ బాబు మీడియా కంటపడ్డారు. దాంతో బాలీవుడ్ సినిమా ప్రయత్నాలు మొదలు పెట్టనున్నారనే రూమర్లు చెలరేగాయి.
అసలు విషయమేమిటంటే... ఇటీవల ఓ వ్యాపార ప్రకటన షూటింగ్‌లో మహేష్ బాబు పాల్గొన్నారు. ఆ షూటింగ్‌కు సంబంధించిన పని పూర్తి చేసుకొని వచ్చారు. ఆ షూటింగ్‌ను అవినాష్ గోవారికర్ దర్శకత్వం వహించారు. అనంతరం గోవారికర్ ట్వీట్ చేస్తూ.. షూటింగ్ అనంతరం సూపర్‌స్టార్ చార్మింగ్. సూపర్ ఫాస్ట్ సూపర్‌స్టార్ అని పేర్కొన్నారు. ఓ బ్లాక్ వైట్ ఫోటోను షేర్ చేశారు.
గోవారికర్ ట్వీట్‌కు రిప్లై ఇస్తూ.. మీ పనితీరు నాకు నచ్చింది. మీతో షూటింగ్ చేయడం చాలా ఫన్‌గా ఉంటుంది. మహారాష్ట్ర భోజనం ఇష్టంగా తిన్నాను అని మహేష్ రీట్వీట్ చేశారు. బాలీవుడ్ సినిమా గురించి వస్తున్న వార్తలపై పరోక్షంగా ఇలా చెక్ పెట్టారు.



Click it and Unblock the Notifications











