Mahesh Babu: బెడ్ పై మహేష్ బాబును కోరికేస్తూ నమ్రత ముద్దులు.. సిగ్గుతో కళ్ళుమూసుకున్న హీరో!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీ లైఫ్ తో చాలా బిజీగా ఉంటాడు అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కుదిరితే షూటింగ్ లేదంటే ఫ్యామిలీతో ఎప్పుడైనా వెకేషన్స్ కు వెళ్లడానికి ఇష్టపడుతూ ఉంటాడు. ఇక నేడు ఈ స్టార్ కపుల్ పెళ్లిరోజు కావడంతో ఫ్యాన్స్ నుంచి విషెస్ అందుతున్నాయి. ఇక సతీమణి నమ్రత ఒక రొమాంటిక్ ఫోటో కూడా షేర్ చేసుకుంది. అందులో ఆ ఫోటో చూస్తే వీరు ఎంత అన్యోన్యంగా ఉంటారో అర్థం అవుతుంది. ఆ వివరాల్లోకి వెళితే..

క్యూట్ కపుల్స్
సూపర్ స్టార్ మహేష్ బాబు ఎక్కువగా ప్రైవేసి లైఫ్ ను ఇష్టపడుతూ ఉంటాడు. సినిమా షూటింగ్ అయిపోగానే సరాసరి ఇంటికి వచ్చేసి తన కుటుంబ సభ్యులతో కాలక్షేపం చేస్తూ ఉంటాడు. ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా మహేష్ చాలా సింపుల్ గా ఉండేందుకు ప్రయత్నం చేస్తాడు. ఇక తన భార్య నమ్రత శిరోద్కర్ తో కూడా మహేష్ బాబు ఎంత అన్యోన్యంగా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

పెళ్లి రోజు కావడంతో..
నేడు మహేష్ బాబు నమ్రత శిరోద్కర్ పెళ్లిరోజు కావడంతో ప్రత్యేకంగా ఫ్యాన్స్ తో పాటు ప్రముఖ సెలబ్రిటీలు విషెస్ అందిస్తున్నారు. మహేష్ బాబు తన భార్యతో కలిసి ఇటీవల స్పెయిన్ కు వెళ్ళాడు. అక్కడే వాలెంటైన్స్ డే ను కూడా వీరు సెలబ్రేట్ చేసుకోబోతున్నారు. ఇక ఈ సందర్భంగా మహేష్ బాబు నమ్రత ఇద్దరు కూడా సోషల్ మీడియాలో వారి ఫోటోలను పోస్ట్ చేస్తూ ఒకరికొకరు విషెస్ అందించుకుంటున్నారు.

సీక్రెట్ గా పెళ్లి
మహేష్ బాబు నమ్రత శిరోద్కర్ వంశీ సినిమాతో మొదట ఒకరికొకరు మంచి స్నేహితులుగా మారారు. ఇక ఐదేళ్ల ప్రేమాయణం తర్వాత ఇద్దరూ ఒక ప్రైవేట్ హోటల్లో పెళ్లి చేసుకున్నారు. 2005 ఫిబ్రవరి 10వ తేదీన చాలా గోప్యంగా వీరి వివాహం జరిగింది. అప్పుడు మహేష్ బాబు అతడు సినిమాతో బిజీగా ఉన్నాడు. మొదట మహేష్ బాబు ఇష్టపడి ప్రపోజ్ చేయడంతో నమ్రత కొన్ని రోజుల తర్వాత పెళ్లి చేసుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

మహేష్ ఐదేళ్లు చిన్న..
ఇక 2006లో మహేష్ బాబు నమ్రత మొదటి సంతానంగా గౌతమ్ కు జన్మనిచ్చారు. అనంతరం 2012లో వారి రెండవ సంతానంలో కూతురు సితార పాపకు జన్మనిచ్చారు. ఇక వారికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతూనే ఉంటాయి. ఇక నమ్రత కంటే వయసులో మహేష్ బాబు ఐదేళ్లు చిన్నవాడు అని అందరికీ తెలిసిన విషయమే. నమ్రత వయసు 51 ఏళ్ళు కాగా.. మహేష్ వయసు 47.
రొమాంటిక్ పిక్ షేర్ చేసిన నమ్రత
ఇక నేడు మహేష్ నమ్రత వారి 18వ మ్యారేజ్ యానివర్సరీని సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా నమ్రత, మహేష్ బాబుతో ఒక ప్రత్యేకమైన ఫోటో కూడా షేర్ చేసుకుంది. అందులో మహేష్ బాబు బెడ్ పై ఉండగా ఆమె మీద పడిపోయే ముద్దులు ఇస్తూ కొరికిస్తున్నట్లుగా అనిపిస్తోంది. ఇక ఆ రొమాంటిక్ ఫోటోలు చూసిన ఫ్యాన్స్ క్యూట్ కపుల్స్ అంటూ పాజిటివ్ గా స్పందిస్తున్నారు. ఇక మహేష్ బాబు కూడా ఒక ఫోటో షేర్ చేసుకున్నాడు. ఇక ఈ రెండు ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











