పవన్ రికార్డును బ్రేక్ చేసిన మహేష్.. అయినప్పటికీ ఆయన రికార్డులే ఎక్కువ!
ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద స్టార్ హీరోల ఫైట్ ఒక రేంజ్ లో కొనసాగేది అనే లెక్కలు అభిమానుల్లో ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ ని కలిగించేవి. కానీ ఇప్పుడు ఆ రికార్డులన్ని కాకుండా సోషల్ మీడియా ద్వారా సరికొత్తగా రికార్డులు క్రియేట్ చేస్తున్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా ఇంటర్నెట్ ప్రపంచంలో స్టార్స్ క్రేజ్ అమాంతంగా పెరిగిపోతోంది. ఇక ఇటీవల ఒక రికార్డులో మహేష్ పవన్ కళ్యాణ్ నెంబర్ వన్ రికార్డును బ్రేక్ చేశాడు. అయినప్పటికీ ఆ టాప్ 5స్థానాల్లో పవన్ మూడు రికార్డులతో కొనసాగుతున్నాడు.

సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వాల్సిందే
మన హీరోల సినిమాల గురించి ఎలాంటి అప్డేట్స్ వచ్చినా కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వాల్సిందే. అభిమానులు ఈ పోటీలను రోజురోజుకి మరింత సీరియస్ గా తీసుకుంటున్నారు. ఇక బర్త్ రాబోతోంది అంటే చాలు నెల రోజుల ముందే కామన్ డీపీలు హ్యాష్ ట్యాగ్ లతో వండర్స్ క్రియేట్ చేస్తున్నారు.

పవర్ స్టార్ రికార్డ్
కొన్నిరోజుల క్రితం పవన్ కళ్యాణ్ కి అడ్వాన్స్ హ్యాపీ బర్త్ డే అంటూ హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేసి అభిమానులు ట్విట్టర్ లో ట్రెండ్ అయ్యేలా చేశారు. 27.4 మిలియన్ ట్వీట్స్ తో పవన్ కళ్యాణ్ పేరు ఇండియా ట్విట్టర్ లో టాప్ ట్రెండ్ లిస్ట్ లోకి చేరింది. గత రికార్డులన్ని బద్దలు చేసి పవర్ స్టార్ అభిమానులు వారి బలాన్ని చూపించారు.

బ్రేక్ చేసిన మహేష్ ఫ్యాన్స్
అయితే రీసెంట్ గా మహేష్ బాబు అభిమానులు కూడా ఆ రికార్డును బ్రేక్ చేయాలని టార్గెట్ గా పెట్టుకొని మహేష్ బాబు బర్త్ CDP హ్యాష్ ట్యాగ్ తో నెంబర్ వన్ స్థానాన్ని అందుకున్నారు. 31.1మిలియన్ ట్వీట్స్ రావడంతో మహేష్ పవన్ రికార్డును బ్రేక్ చేశాడు. ఆగస్టు 9న మహేష్ పుట్టినరోజు కావడంతో మళ్ళీ సరికొత్త రికార్డులు నమోదయ్యే అవకాశం ఉంది.
Recommended Video

పవర్ స్టార్ vs సూపర్ స్టార్
ఇక పవన్ కళ్యాణ్ బర్త్ డే సెప్టెంబర్ 2న కాబట్టి ఆ తరువాత కూడా అభిమానుల మధ్య ఫైట్ మరింత రసవత్తరంగా మారే అవకాశం ఉంది. మొత్తానికి ఈ రెండు నెలలు పవర్ స్టార్ సూపర్ స్టార్ అభిమానులు వారి హీరోల పేర్లను భారీ స్థాయిలో ట్విట్టట్ లో ట్రెండ్ చేయాలని డిసైడ్ అయ్యారు.


Click it and Unblock the Notifications











