ఇంట్రెస్టింగ్: బడా బిజినెస్‌మ్యాన్‌ను టార్గెట్ చేసిన మహేశ్.. ఇండియా వచ్చే వరకు వదలడట.!

By Manoj

తెలుగు సినీ ఇండస్ట్రీలోనే భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరోల్లో సూపర్ స్టార్ మహేశ్ బాబు ఒకడు. నటశేఖర కృష్ణ కుమారుడిగా సినీ రంగ ప్రవేశం చేసినప్పటికీ.. హ్యాండ్సమ్ లుక్, అద్భుతమైన యాక్టింగ్‌తో స్టార్ హీరోగా ఎదిగిపోయాడు. ఒకవైపు సినిమాలు.. మరోవైపు వ్యాపార ప్రకటనలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఇటీవలే బంపర్ హిట్ కొట్టి జోష్ మీదున్న మహేశ్.. మనదేశంలోనే పెద్ద బిజినెస్‌మ్యాన్‌ను టార్గెట్ చేశాడని తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. ఆ సంగతులేంటో చూద్దాం పదండి.!

మహేశ్ దూకుడు.. రికార్డులు బద్దలు

మహేశ్ దూకుడు.. రికార్డులు బద్దలు

ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్ హీరోగా వెలుగొందుతోన్న మహేశ్ బాబు.. కొంత కాలంగా వరుస విజయాలు సాధిస్తూ ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవలి కాలంలో అతడు నటించిన ‘భరత్ అనే నేను', ‘మహర్షి'తో పాటు సంక్రాంతికి విడుదలైన ‘సరిలేరు నీకెవ్వరు' కూడా భారీ విజయాలను అందుకున్నాయి. ఫలితంగా మహేశ్ ఖాతాలో పలు రికార్డులు వచ్చి చేరాయి.

ఛాన్స్ ఇచ్చినట్లే ఇచ్చి తప్పుకున్నాడు

ఛాన్స్ ఇచ్చినట్లే ఇచ్చి తప్పుకున్నాడు

‘సరిలేరు నీకెవ్వరు' హిట్ ఇచ్చిన జోష్‌లో ఉన్నాడు మహేశ్ బాబు. ఈ క్రమంలోనే అతడు.. తనకు గతంలో ‘మహర్షి' వంటి సూపర్ హిట్ ఇచ్చిన స్టైలిష్ డైరెక్టర్ వంశీ పైడిపల్లితో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దీనికి సంబంధించిన ప్రకటన వెలువడుతుందని అనుకుంటున్న సమయంలో.. ఈ సినిమా ఆగిపోయినట్లు ఓ వార్త బయటకు వచ్చిన విషయం తెలిసిందే.

వంద కోట్ల దర్శకుడికి పచ్చ జెండా

వంద కోట్ల దర్శకుడికి పచ్చ జెండా

వంశీ పైడిపల్లితో చేయాల్సిన సినిమా ఆగిపోయిందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలోనే.. మహేశ్ బాబు ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ స్పెషలిస్టు పరశురాంకు పచ్చ జెండా ఊపాడని అంటున్నారు. దీనికి సంబంధించిన కథను కూడా అతడు ఇప్పటికే విన్నాడని తెలుస్తోంది. పరశురాం.. విజయ్ దేవరకొండతో ‘గీత గోవిందం' అనే సినిమాను తెరకెక్కించిన విషయం తెలిసిందే.

మెగాస్టార్ సినిమాలో మహేశ్ బాబు

మెగాస్టార్ సినిమాలో మహేశ్ బాబు

కుటుంబంతో కలిసి ఫారెన్ టూర్ వెళ్లొచ్చిన మహేశ్ బాబు.. ప్రస్తుతం ఫ్యూచర్ ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టాడు. ఈ క్రమంలో అతడు.. మెగాస్టార్ చిరంజీవి - కొరటాల శివ కాంబినేషన్‌లో రాబోతున్న సినిమాలో అవకాశం దక్కించుకున్నాడని ప్రచారం జరుగుతోంది. ముప్పై నిమిషాల పాటు ఉండే ఈ పాత్ర కోసం మహేశ్ ఏకంగా రూ. 30 కోట్లు తీసుకుంటున్నాడనే టాక్ వినిపిస్తోంది.

బిజినెస్‌మ్యాన్‌ను టార్గెట్ చేసిన మహేశ్

బిజినెస్‌మ్యాన్‌ను టార్గెట్ చేసిన మహేశ్


పరశురాంతో మహేశ్ బాబు చేయబోయే సినిమాకు సంబంధించిన కథ తాజాగా లీక్ అయింది. దీని ప్రకారం.. మహేశ్ బాబు తల్లి ఓ బ్యాంక్‌లో ఉద్యోగి. ఆమె సంతకాలు ఫోర్జరీ చేసి ఓ బిజినెస్‌మ్యాన్ బ్యాంక్ నుంచి భారీ మొత్తం లోన్‌గా తీసుకుని ఫారెన్ పారిపోతాడు. అతడిని ఇండియాకు రప్పించి, తన తల్లి నిజాయితీని కాపాడేందుకు హీరో చేసే ప్రయత్నాలే సినిమా కథ అని సమాచారం.

Recommended Video

8 Reasons Behind Superstar Mahesh Babu Craze || Filmibeat Telugu
ఆ ఇద్దరికి పాత్రలకు అధిక ప్రాధాన్యం

ఆ ఇద్దరికి పాత్రలకు అధిక ప్రాధాన్యం

ఈ సినిమాలో మహేశ్ బాబు తల్లి పాత్రతో పాటు లోన్ తీసుకుని పారిపోయే బిజినెస్‌మ్యాన్ పాత్రకు అత్యధిక ప్రాధాన్యం ఉంటుందని అంటున్నారు. అందుకోసం ఆ పాత్రలకు ఎవరిని తీసుకోవాలన్న దానిపై ప్రస్తుతం చర్చ జరుగుతున్నట్లు తెలిసింది. అలాగే, వ్యాపారవేత్త కుమార్తె పాత్ర చేసే హీరోయిన్‌నూ ఎంపిక చేయాల్సి ఉందని విశ్వసనీయంగా తెలిసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X