17ఏళ్ళ క్రితం మహేష్ వచ్చాడని మురిసిపోయిన ప్రభాస్.. పక్కనే ఇలా ఫొటో దిగి..

టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి మనసున్న హీరోల లిస్టు తీస్తే అందులో ప్రభాస్ టాప్ లో ఉంటాడని చెప్పవచ్చు. నాలుగు పదుల వయసులో కూడా ఇంకా పాతికేళ్ల కుర్రాడిలా ఆకట్టుకుంటున్న డార్లింగ్ దాదాపు అందరితోను స్నేహంగానే ఉంటాడు. పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎదిగిన ప్రభాస్ కెరీర్ మొదట్లో విజయం కోసం ఎంతగానో తాపత్రయపడ్డాడు. ఇక అప్పటికే స్టార్ డమ్ అందుకున్న మహేష్ బాబు తన సినిమా కోసం రావడంతో ప్రభాస్ ఎంతగానో సంతోసించాడు. ఆ స్టొరీలోకి వెళితే..

నిరాశచెందిన ప్రభాస్

నిరాశచెందిన ప్రభాస్

రెబల్ స్టార్ కృష్ణంరాజు వారసుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ప్రభాస్ ఈశ్వర్(2002) సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. అయితే ఆ సినిమా ఆశించినంతగా సక్సెస్ కాలేదు. అనంతరం 2003లో కాస్త హై లెవెల్లో విడుదలైన రాఘవేంద్ర సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఆ సమయంలో ప్రభాస్ చాలా నిరాశచెందాడు.

ఎవరైనా వస్తే బావుండు అనుకుంటున్న టైమ్ లో

ఎవరైనా వస్తే బావుండు అనుకుంటున్న టైమ్ లో

ఎలాగైనా ఒక్క సినిమాతో హిట్టు కొట్టాలని అనుకుంటున్న తరుణంలో వర్షం ఆఫర్ వచ్చింది. ఆ సినిమాను ఏంఎస్.రాజు నిర్మించగా శోభన్ డైరెక్ట్ చేశాడు. ఆ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీత అందించగా పాటలతోనే మంచి హైప్ వచ్చింది. సినిమాకు బజ్ క్రియేట్ చేయాలని ఎవరైనా స్టార్ హీరోను ప్రమోషన్ లోకి లాగలని అనుకున్నారు.

మహేష్ ను చూసి..

మహేష్ ను చూసి..

ఇక వర్షం ఆడియో వేడుకకు మహేష్ బాబు రావడంతో ప్రభాస్ చాలా మురిసిపోయాడట. ఎందుకంటే అప్పుడే ఒక్కడు సినిమా చేసి మహేష్ ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు. మాస్ జనాల్లో భారీగా క్రేజ్ కూడా వచ్చింది. ఇక ముందుగానే నిర్మాత దర్శకుడితో మంచి అబుబంధం ఉండడంతో మహేష్ సినిమా ఆడియో వేడుకకు ప్రత్యేక అతిథిగా వచ్చాడు.

మళ్ళీ చాలా కాలం తరువాత

మళ్ళీ చాలా కాలం తరువాత

ఇక సినిమా వేడుకలో మహేష్ బాబును కలుసుకున్న ప్రభాస్ డీసెంట్ గా నిలబడి ఒక ఫొటో కూడా దిగాడు. ఇక మళ్ళీ చాలా కాలం తరువాత శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమా సక్సెస్ పార్టీలో కలుసుకున్నారు. ఇక దిల్ రాజు తన పెళ్లి సందర్భంగా ఇచ్చిన ప్రత్యేకమైన పార్టీలో కూడా పక్కపక్కనే నిలబడి ఫోటోలకు స్టిల్ ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X