ఎక్స్‌క్లూజివ్: చిరంజీవి సినిమాలో మహేశ్ బాబు రోల్ లీక్.. అప్పుడు కృష్ణ చేసినట్లే ఇప్పుడు ప్రిన్స్.!
తెలుగు సినీ ఇండస్ట్రీలో కొన్నేళ్లుగా హీరోల మధ్య సత్సంబంధాలు కనిపిస్తున్నాయి. అందుకోసమే ఇగోలను పక్కన పెట్టేసి వేరే హీరో సినిమాలను సైతం ప్రోత్సహిస్తున్నారు. అలాగే, ఓ హీరో సినిమా ప్రారంభోత్సవానికి మరో హీరో వెళ్లడం.. సినిమా ఫంక్షన్లకు హాజరవడం వంటివి చేస్తున్నారు. దీంతో పాటు మల్టీస్టారర్ మూవీలలో సైతం నటిస్తున్నారు. దీంతో ఫ్యాన్స్ మధ్య కూడా స్నేహబంధం పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో ఇద్దరు స్టార్ హీరోలు చిరంజీవి, మహేశ్ బాబు కలిసి నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలో సూపర్ స్టార్ రోల్ లీక్ అయింది. ఆ వివరాలేంటో చూద్దాం.!

మెగా టీమ్‌కు నిరాశను మిగిల్చింది
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం ‘సైరా: నరసింహారెడ్డి'. రామ్ చరణ్ నిర్మించిన ఈ సినిమాలో ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్రలు చేశారు. గత ఏడాది విడుదలైన ఈ సినిమా షాకింగ్ ఫలితాన్ని దక్కించుకుంది. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ మూవీకి తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రాలేదు.

భారీ ఫ్లాన్ రెడీ చేసిన రామ్ చరణ్
తన తండ్రికి భారీ హిట్ ఇవ్వాలన్న ఉద్దేశ్యంతో రామ్ చరణ్ నిర్మించిన ‘సైరా' నిరాశనే మిగిల్చింది. దీంతో చిరుకు ఈ సారి ఎలాగైన హిట్ ఇవ్వాలన్న పట్టుదలతో టాలీవుడ్ బడా డైరెక్టర్ కొరటాల శివతో సినిమా తీస్తున్నాడు చెర్రీ. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు ‘ఆచార్య' అనే టైటిల్ ఫిక్స్ చేయబోతున్నట్లు ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది.

చరణ్ - చిరంజీవి మల్టీస్టారర్ మూవీ
దేవాలయ భూముల ఆక్రమణలపై పోరాటం చేసే వ్యక్తికి సంబంధించిన కథతో ఈ మూవీ రూపొందుతోంది. ఇందులో చిరు మావోయిస్టుగా కనిపించనున్నారు. దీనికి సంబంధించిన లుక్ కూడా ఇటీవలే లీక్ అయింది. అలాగే, ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా కీలక పాత్ర చేస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. ఈ పాత్ర దాదాపు 20 నిమిషాల పాటు ఉంటుందని అన్నారు.

చరణ్ పోయి.. మహేశ్ బాబు వచ్చాడు
ఇక, ఈ సినిమాలో రామ్ చరణ్ నటించడం లేదని.. అతడి స్థానంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు కనిపించనున్నాడని ఇటీవల ఓ వార్త బయటకు వచ్చింది. కొరటాల శివ చేసిన ప్రయత్నాలతో ఈ కాంబో సెట్ అయిందని ప్రచారం జరుగుతోంది. ఇందులో సూపర్ స్టార్ దాదాపు 40 నిమిషాల పాటు ఉండే ఓ అతి ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాడనే టాక్ వినిపిస్తోంది.

చిరంజీవి సినిమాలో మహేశ్ బాబు రోల్ లీక్
ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న ఈ సినిమాలో మహేశ్ బాబు చేయబోయే పాత్ర గురించి ఓ న్యూస్ లీక్ అయింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం... ఇందులో అతడు ఐపీఎస్ అధికారిగా కనిపించనున్నాడట. మావోయిస్టు అయిన చిరంజీవిని పట్టుకునేందుకు ప్రభుత్వం నియమించిన అధికారిగా అతడు నటిస్తున్నాడని తెలిసింది.

అప్పుడు కృష్ణ చేసినట్లే ఇప్పుడు ప్రిన్స్.!
విజయశాంతి ప్రధాన పాత్రలో దాసరి నారాయణ రావు తెరకెక్కించిన చిత్రం ‘ఒసేయ్ రాములమ్మ'. ఈ సినిమా ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో సూపర్ స్టార్ కృష్ణ అత్యంత ముఖ్యమైన పాత్రను పోషించారు. కాసేపు మాత్రమే ఉండే ఈ పాత్ర.. విజయశాంతికి సహాయం చేస్తుంది. ఇప్పుడలాంటి పాత్రనే మహేశ్ పోషిస్తున్నాడని సమాచారం.


Click it and Unblock the Notifications











