మహేష్ బాబు ఫ్యాన్స్ హల్ చల్: ఇండియా వైడ్ షేక్ చేస్తున్నారు!
Recommended Video
టాలీవుడ్లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకరు. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు సౌతిండియా వైడ్ మహేష్ బాబును ఆరాధించే అభిమానులు ఉన్నారు. మరి అలాంటి స్టార్ పుట్టినరోజు వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
సూపర్ స్టార్ మీద తమ అభిమానం ప్రదర్శిస్తూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు. ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ లాంటి మాధ్యమాల్లో పోస్టులతో హడావుడి చేస్తున్నారు. మహేష్ పుట్టినరోజు సందర్భంగా 'సరిలేరు నీకెవ్వరు' ఇంట్రో కూడా విడుదలవ్వడం అభిమానులు మరింత ఉత్సాహంగా ఉన్నారు.

ఇండియా వైడ్ ట్రెండ్ అవుతున్న యాష్ ట్యాగ్స్
తెలుగుకు సంబంధించిన విషయాలు చాలా రేర్‌గా ఇండియా వైడ్ ట్రెండ్ అవుతుంటాయి. తాజాగా #HappyBirthdaySSMB, #SarileruNeekevvaru హ్యాష్ ట్యాగ్స్ టాప్ పొజిషన్లో కొనసాగుతున్నాయి. మహేష్ బాబు ఫ్యాన్స్ చేస్తున్న హంగామా చూసి ఇతర ఇండస్ట్రీల సినీ అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.

2 మిలియన్ ట్వీట్స్
#HappyBirthdaySSMB అనేదాన్ని అభిమానులు రెండు మూడు రోజుగా వైరల్ చేస్తున్నారు. ఈ యాస్ ట్యాగ్ మీద దాదాపు 2 మిలియన్ ట్వీట్స్ వచ్చినట్లు తెలుస్తోంది. #SarileruNeekevvaru అనే యాష్ ట్యాగ్ మీద కూడా లక్షల్లో ట్వీట్స్ పడ్డాయి.

సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే
ఆగస్టు 9, 1975లో జన్మించిన మహేష్ బాబు నేటితో 44వ వసంతంలోకి అడుగు పెడుతున్నాడు. బాలనటుడిగా 8 కి పైగా సినిమాల్లో నటించిన ఆయన ‘రాజకుమారుడు'తో తెరంగ్రేటం చేశారు. ఈ సినిమాకు ఉత్తమ నూతన నటుడిగా నంది పురస్కారం అందుకున్నారు. ఆ తర్వాత ‘నిజం'లో నటనకుగాను ఫస్ట్ టైమ్ ఉత్త నటుడిగా నంది పురస్కారం అందుకున్నాడు. ఇప్పటి వరకు 25 చిత్రాల్లో నటించిన ఆయన టాలీవుడ్ టాప్ హీరోగా, తెలుగు సూపర్ స్టార్‌గా ఎదిగారు.

సరిలేరు నీకెవ్వరు
మహేష్ బాబు ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘సరిలేరు నీకెవ్వరు' చిత్రం చేస్తున్నారు. ఇందులో ఆయన ఆర్మీ మేజన్ అజయ్ కృష్ణగా కనిపించబోతున్నారు. మహేస్ బాబు పెట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ఇంట్రో టీజర్ విడుదల చేశారు.


Click it and Unblock the Notifications











