కేక పుట్టిస్తున్న మహేష్ మల్టీప్లెక్స్.. ఇంధ్రభవనాన్ని తలపించేలా.. రజనీకాంత్ చేతుల మీదుగా..(ఫొటోలు)
టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్‌బాబు వ్యాపార రంగంలోకి ప్రవేశించారు. నటుడిగా జోరు కొనసాగిస్తూనే మల్టీప్లెక్స్ థియేటర్ నిర్మించాడు. హైదరాబాద్ వినోద రంగంలో తలమానికంగా నిలిచిన ఈ థియేటర్ గురించి సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఏఎంబీ సినిమాస్ పేరుతో బ్రాండ్ న్యూ మల్టీప్లెక్స్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు ప్రిన్స్ మహేష్‌బాబు. మల్టీప్లెక్స్ థియేటర్ విశేషాలు ఇవే...

రజనీకాంత్ చేతుల మీదుగా
సూపర్‌స్టార్ రజనీకాంత్ ఈ థియేటర్లను నవంబర్ 29న ఆవిష్కరించనున్నారు. ఈ మల్టీప్లెక్స్‌లో శంకర్ దర్శకత్వంలో ప్రతిష్ఠాత్మకంగా రూపొందిన 2.O చిత్రం రిలీజ్ కానున్నది.

ఒకేసారి 1638 మంది
హైదరాబాద్‌లో నిర్మించిన ఏఎంబీ సినిమాస్‌లో ఏడు స్క్రీన్లు ఉంటాయి. ఒకేసారి 1638 మంది కూర్చుని సినిమా చూసే సామర్థ్యం ఉంది. ఇప్పటికే ఈ మల్టీప్లెక్స్‌లో సినిమా చూడాలనే కుతుహలం ప్రేక్షకుల్లో పెరిగింది.

3డీ టెక్నాలజీ, సౌండ్‌తో
గ్రాండ్ ఆడిటోరియంలో ఏడు స్క్రీన్లను అత్యున్నత సాంకేతికతతో రూపొందించారు. 3డీ టెక్నాలజీ, డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్‌తో ప్రేక్షకులకు చక్కటి అనుభూతి అందించే విధంగా నిర్మించారు.

అంతర్జాతీయ ప్రమాణాలతో
ఏఎంబీ సినిమాస్‌లో చూసే ప్రతీ ప్రేక్షకుడికి అన్ని విధాలా చక్కటి అనుభూతిని కలుగజేయడం ఖాయం. అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ మల్టిప్లెక్స్ నిర్మించినట్టు నిర్వాహకులు తెలిపారు.

మహేష్‌బాబు పర్యవేక్షణ
ఏఎంబీ సినిమాస్ పనులను ఇటీవల ప్రిన్స్ మహేష్‌బాబు పర్యవేక్షించారు. ప్రతీ విభాగంలో పనీతీరును నిపుణులతో కలిసి సమీక్షించారు. ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన ఈ మల్టీప్లెక్స్‌లో ఎలాంటి లోపాలు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఇంధ్రభవనాన్ని తలపించేలా
ఏఎంబీ సినిమాస్‌ను సందర్శించే ప్రేక్షకులకు వివేషంగా ఆకట్టుకునే విధంగా ఇంటీరియర్‌ను డిజైన్ చేశారు. ఇంధ్రభవనాన్ని తలపించే విధంగా లైటింగ్, ఇతర సౌకర్యాలను పొందుపరిచారు.


Click it and Unblock the Notifications











