ముఖ్యమంత్రితో మహేష్‌బాబు తాడో పేడో.. అసలేం జరిగుతున్నదంటే!
శ్రీమంతుడు, భరత్ అనే నేను చిత్రాల తర్వాత సామాజిక అంశం, రాజకీయ నేపథ్యం ఉన్న చిత్రాలపై సూపర్‌స్టార్ మహేష్‌బాబు దృష్టిపెట్టాడు. రైతుల సమస్యను ఆధారంగా చేసుకొని ప్రిన్స్ ప్రస్తుతం మహర్షి అనే చిత్రంలో నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, అశ్వినీదత్, పీవీపీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో మహేష్ పారిశ్రామికవేత్తగా కనిపించబోతున్నాడు. ఈ చిత్రంలో వ్యాపారవేత్తగా మహేష్ ఏపీ ముఖ్యమంత్రిని నిలదీసే సన్నివేశాలు హైలెట్‌గా నిలుస్తాయట. వివరాల్లోకి వెళితే..

రోమాలు నిక్కబొడిచే విధంగా
మహర్షి చిత్రంలో రైతుల సమస్యలను ఉద్దేశించి ఏపీ సీఎంను మహేష్ ప్రశ్నించే సన్నివేశాలు ప్రేక్షకుడికి రోమాలు నిక్కబొడిచే విధంగా ఉంటుంది. సీఎం పాత్రలో నాజర్ కనిపిస్తారు. మహేష్, నాజర్ మధ్య సీన్లు నువ్వా? నేనా అన్నట్టు కనిపిస్తాయి అని చిత్రవర్గాలు పేర్కొంటున్నాయి.

రైతులకు జరిగే అన్యాయాల గురించి
ప్రముఖ పారిశ్రామిక వేత్తగా ఉండే మహేష్ రైతులకు జరిగే అన్యాయంపై పోరాటం చేసే పాత్రలో కనిపించబోతున్నారు. తొలుత సూట్ బూటులో గ్లామర్‌గా, ఆ తర్వాత గ్రామాల్లో ప్రజలు, రైతుల వెతల గురించి ప్రశ్నించే యువకుడిగా నటిస్తున్నారు.

సక్సెస్‌పై ఫుల్ కాన్ఫిడెంట్‌గా
మహర్షి చిత్రంలో కొన్ని సీన్లు నభూతో నభవిష్యత్ అనే రేంజ్‌లో దర్శకుడు వంశీ పైడిపల్లి చిత్రీకరించారట. ఈ చిత్ర విజయంపై దిల్ రాజు, హీరో మహేష్ పూర్తి నమ్మకంతో ఉన్నారని టాక్. సామాజిక అంశంతోపాటు పూజా హెగ్డేతో కెమిస్ట్రీ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా మారిందనే మాట వినిపిస్తున్నది.

మే 9న విడుదల
మహేష్‌బాబు, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో అల్లరి నరేష్ ఓ కీలకపాత్రను పోషించారు. సొనాల్ చౌహాన్, మీనాక్షి దీక్షిత్ తదితరులు కనిపిస్తారు. ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం మే 9వ తేదీన రిలీజ్‌కు సిద్ధమవుతున్నది.


Click it and Unblock the Notifications











