నెం.1 స్టార్: ఈ విషయంలోనూ మహేష్ బాబు టాప్!
Recommended Video

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మరో రికార్డు నమోదు చేశారు. ఇప్పటికే సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న హీరోగా ఆయన వార్తల్లోకి ఎక్కారు. ట్విట్టర్, ఫేస్‌బుక్ లాంటి సోషల్ మీడియా మాధ్యమాల్లో ఆయనకు అత్యధిక ఫాలోవర్స్ ఉన్నారు. తాజాగా ప్రపంచ ప్రఖ్యాత ఎన్‌సైక్లోపీడియా... 'వికీపిడియా' విషయంలోనూ ఆయన కొత్త రికార్డు నమోదు చేశారు. ఈ ఏడాది మహేష్ బాబు వికీపీడియా పేజీని సందర్శించిన వారి సంఖ్య ఇతర టాలీవుడ్ హీరోలందరినీ మించిపోయింది.

మహేష్ బాబు
ఈ ఏడాది మహేష్ బాబు వికీపీడియా పేజీని సందర్శించిన వారి సంఖ్య 1,314,299లకు చేరుకుందట. యావరేజ్‌గా రోజుకు 6,443 వ్యూస్ వస్తున్నాయట. ఇతర హీరోలంతా మహేష్ బాబు తర్వాతి స్థానంలోనే ఉన్నారు.

అల్లు అర్జున్
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వికీపీడియా పేజీకి 1,130,834 వ్యూస్ వచ్చాయి. మహేష్ బాబు తర్వాత ఎక్కువ మంది బన్నీ గురించిన విషయాలను శోధించారు అనడానికి ఈ సంఖ్యే నిదర్శనం.

రామ్ చరణ్
రామ్ చరణ్ వికీపీడియా పేజీని సందర్శించిన వారి సంఖ్య 902,823గా ఉంది. టాలీవుడ్లో టాప్ హీరోగా కొనసాగుతున్న రామ్ చరణ్ ఈ విషయంలోనూ టాప్ 3లోనే ఉండటం గమనార్హం.

ప్రభాస్
ఈ ఏడాది యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వికీపీడియా పేజీని సందర్శించిన వారి సంఖ్య భారీగానే ఉంది. ఆయన పేజీకి 880,416 వ్యూస్ వచ్చాయి.

పవన్ కళ్యాణ్ అన్నా ఒక్కసారి మాట్లాడు
పవన్ కళ్యాణ్ వికీపీడియా పేజీని సందర్శించిన వారి సంఖ్య యంగ్ హీరోల కంటే తక్కువా ఉంది. ఆయన పేజీ వ్యూస్ 772,177 మించలేదు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్
ఎన్టీఆర్ వికీపీడియా పేజీని సందర్శించిన వారి సంఖ్య 696,892గా ఉంది.


Click it and Unblock the Notifications











