లేడి బాస్ కు స్పెషల్ బర్త్ డే విషెస్ చెప్పిన మహేష్.. అలా మొదలైన ప్రేమ..
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ను అందుకున్నాడు. అయితే మహేష్ సినీ లైఫ్ లో ఎలా ఉన్నా కూడా పర్సనల్ లైఫ్ లో మాత్రం చాలా సింపుల్ గా ఉంటాడు అనేది అందరికి తెలిసిన విషయమే. ఇక రీసెంట్ గా మహేష్ తన బాస్ కు స్పెషల్ విషెస్ అందించాడు. ఆమె మరెవరో కూడా నమ్రత శిరోద్కర్. ఒకసారి వారి లవ్ స్టోరిపై లుక్కేస్తే..

లాక్ డౌన్ లో అందరికంటే ఎక్కువగా
ఎక్కువగా కుటుంబంతో సమయాన్ని గడిపే మహేష్ వీలైనంత వరకు ప్రయివేట్ పార్టీలకు దూరంగానే ఉంటాడు. కాస్త టైమ్ దొరికినా కూడా ఫ్యామిలీతో కలిసి విదేశాలకు ట్రిప్పులు వేస్తుంటాడు. లాక్ డౌన్ లో అందరికంటే ఎక్కువగా ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేశాడు. అలాగే తన ప్రతి హ్యాపీ మూమెంట్ ను కూడా సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నాడు.

నెంబర్ వన్ లక్కీ గర్ల్
ఇక మహేష్ తన లేడి బాస్ కు స్పెషల్ గా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆమె మరెవరో కాదు. మహేష్ సతీమణి నమ్రత శిరోద్కర్. అమ్మాయిల డ్రీమ్ బాయ్ మనసును గెలుచుకున్న ఆమె ఈ వరల్డ్ లోనే నెంబర్ వన్ లక్కీ గర్ల్ అంటూ అప్పట్లో చాలా పాజిటివ్ కామెంట్స్ అందుకుంది.

హ్యాపీ బర్త్ డే బాస్ లేడి.
నేను ప్రేమించిన వారు ఈ రోజు జన్మించారు. ప్రతిరోజూ మీతో నాకు చాలా స్పెషల్. కానీ ఈ రోజు ఇంకొంచెం ఎక్కువ. నా అమేజింగ్ ఉమెన్ పుట్టినరోజును సెలబ్రెట్ చేసుకుంటున్నట్లు చెప్పిన మహేష్.. హ్యాపీ బర్త్ డే లేడి బాస్ అని స్వీట్ ట్వీట్ కూడా చేసేశాడు.

తెలివైన నమ్రత
నిజానికి మహేష్ బాబుకు నమ్రత కేవలం ఒక బార్యగానే కాకుండా పర్సనల్ అడ్వైజర్ గా ఎన్నో సలహాలు ఇస్తుంటుంది. ఒకవిధంగా మహేష్ నేషనల్ లెవెల్లో యాడ్స్ చేయడానికి ముఖ్య కారణం అలాగే ప్రొడక్షన్ హౌజ్ ను స్థాపించడానికి కారణం కూడా నమ్రతనే. ఇంటి వ్యవహరాలతో పాటు బిజినెస్ వ్యవహారాలు కూడా ఎంతో తెలివిగా మ్యానేజ్ చేయడం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య.

మహేష్ కంటే 4ఏళ్ళు పెద్ద..
మహేష్ బాబు కంటే నమ్రత 4ఏళ్ళు పెద్ద. 2000వ సంవత్సరంలో వంశీ సినిమా ద్వారా ఏర్పడిన పరిచయం వారిని ప్రేమలోకి లాగేసింది. ఇక 2005లో అతడు సినిమా సమయంలోనే మహేష్ ప్రయివేట్ గా పెళ్లి చేసుకున్నాడు. ముంబైలోనే వారి వివాహమై జరిగింది. ఇక వారి పిల్లలు గౌతమ్, సితారా కూడా వారి టాలెంట్ తో ఆడియెన్స్ కు దగ్గరవుతున్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











