తమన్ బర్త్ డే.. మహేష్ బాబు స్పెషల్ విషెస్
మ్యూజిక్ సెన్సేషన్ తమన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమన్ ఏంటన్నది ఆయన అందించిన సంగీతమే చెబుతుంది. కాపీ క్యాట్ అన్న మరకను చెరిపేసుకుంటూ తన మ్యూజిక్‌తో మాయ చేస్తేస్తున్నాడు. ఈ ఏడాది ప్రారంభంలో తమన్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. తమన్ అందించిన ప్రతీ పాట ఓ సెన్సేషనే అయింది. ప్రతీ సినిమాకు తమన్ అందించిన ఆల్బమ్ సూపర్ హిట్ అయింది.
తమన్ ప్రస్తుతం ఈ జోష్‌లో తన బర్త్ డేను గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసుకుంటున్నాడు. తమన్ బర్త్ డే నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అవుతోంది అంటే ఆయన రేంజ్ ఏంటో అర్థమైపోతుంటుంది. టాలీవుడ్ అనే కాకుండా కోలీవుడ్, శాండల్ వుడ్ ఇలా సౌత్ మొత్తాన్ని తమన్ ఓ ఊపు ఊపేస్తున్నాడు. తమన్ బర్త్ డే సందర్బంగా ఆయన అభిమానులే కాకుండా సినీ తారలందరూ ట్వీట్లు చేస్తున్నారు. స్పెషల్ విషెస్ చెబుతున్నారు.

తమన్ బర్త్ డే సందర్భంగా దర్శన నిర్మాతలు, నిర్మాణ సంస్థలు, హీరోలు ఇలా అందరూ సోషల్ మీడియాలో ట్వీట్లు చేస్తున్నారు. తాజాగా మహేష్ బాబు తమన్‌కు స్పెషల్ విషెస్ అందించాడు. దూకుడు, బిజినెస్ మెన్ వంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన సంగీత దర్శకుడికి మహేష్ బాబు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు. హ్యాపీ బర్త్ డే తమన్.. నీ మ్యూజిక్‌తో రాక్ చేయాలి.. ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకున్నాడు.


Click it and Unblock the Notifications











