twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Mahesh babu: పెళ్లి రోజు ఫ్యామిలీ ఫొటో షేర్ చేసిన సూపర్ స్టార్.. గౌతమ్ లేటెస్ట్ లుక్ వైరల్

    |

    సినిమా ఇండస్ట్రీలో బెస్ట్ కపుల్స్ లో మహేష్ బాబు - నమ్రతా శిరోద్కర్ టాప్ లో ఉంటారని చెప్పవచ్చు. ఈ జంటకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతూనే ఉంటాయి. ఒక విధంగా ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారని కూడా చెప్పవచ్చు. ఇక నేడు ఈ అందమైన జంట 17వ మ్యారేజ్ యానివర్సరీని సెలబ్రేట్ చెలుకుంటోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు పెళ్లి రోజు సందర్భంగా ఒక ప్రత్యేకమైన పోస్ట్ కూడా చేశాడు. ఇక మహేష్ పోస్ట్ చేసిన ఫొటోలో గౌతమ్ ఘట్టమనేని స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

    ఎక్కువగా ఫ్యామిలీతో..

    ఎక్కువగా ఫ్యామిలీతో..

    సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా మరొకవైపు ఫ్యామిలీకి సంబంధించిన పార్టీలతో కూడా తరచుగా పాల్గొంటూనే ఉంటాడు. కాస్త గ్యాప్ దొరికినా కూడా తన ఫ్యామిలీతో విదేశాలకు వెళ్లిపోతూ ఉంటాడు. షూటింగ్స్ వలన బిజీగా ఉన్న సమయంలో కొన్నిసార్లు తన పిల్లలను లోకేషన్స్ లోకి రప్పించుకొని మరి ఖాళీ సమయాల్లో వారితో టైమ్ స్పెండ్ చేస్తుంటాడు.

    17వ యానివర్సరీ..

    17వ యానివర్సరీ..

    మహేష్ బాబు పర్ఫెప్ట్ ఫ్యామిలీ పర్సన్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక భార్య నమ్రతా శిరోద్కర్ వచ్చిన అనంతరం తన జీవితంలో చాలా మార్పులు వచ్చాయని కూడా మహేష్ బాబు చాలా సందర్భాల్లో చెప్పాడు. ఇక నేటితో వీరి పెళ్లి జరిగి 17 ఏళ్ళు అయ్యింది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో సెలబ్రెటీలు నెటిజన్లు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

    ఆ సినిమాతో ప్రేమలో..

    ఆ సినిమాతో ప్రేమలో..

    2000వ సంవత్సరంలో మొదటిసారి నమ్రతను వంశీ సినిమాతో కలుసుకున్న మహేష్ బాబు అనంతరం ఆమెతో చాలా తొందరగా ప్రేమలో పడిపోయాడు. 2005 ఫిబ్రవరి 10న ముంబైలో వివాహం చేసుకున్నారు. ఒక సినిమా షూటింగ్ కు గ్యాప్ ఇచ్చి మహేష్ వెనువెంటనే నమ్రతను సీక్రెట్ గా పెళ్లి చేసుకోవడం అప్పట్లో అందరిని ఆశ్చర్యాన్ని కలిగించింది.

    మహేష్ స్పెషల్ పోస్ట్

    మహేష్ స్పెషల్ పోస్ట్

    ఇక నేడు 17 ఏళ్ళ వివహ బంధాన్ని పురస్కరించుకుని మహేష్ బాబు సోషల్ మీడియాలో ఒక ప్రత్యేకమైన పోస్ట్ ను కూడా చేశాడు. అప్పుడే 17 సంవత్సరాలు గడిచిపోయింది.. అంటూ హ్యాపీ యానివర్సరీ. ఇలాంటివి మరిన్ని జరుపుకోవాలి అని ఇదంతా ప్రేమతో.. అని మహేష్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు.

    గౌతమ్ లుక్ వైరల్

    గౌతమ్ లుక్ వైరల్

    ఇక మహేష్ తన ఫ్యామిలీ ఫొటోను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. ఇక అందులో మహేష్, నమ్రతా శిరోద్కర్, పిల్లలు గౌతమ్, సీతార కూడా చూడ ముచ్చటగా ఉన్నారు. ముఖ్యంగా గౌతమ్ అయితే అప్పుడే తండ్రికి తగ్గ హైట్ లోకి వచ్చేశాడు. క్యూట్ గా సీతార కూడా తల్లిని హగ్ చేసుకొని ఫొటోకి స్టిల్ ఇచ్చింది. ఇక మహేష్ ఫ్యాన్స్ గౌతమ్ ను చూస్తూ నెక్స్ట్ రాబోయే సూపర్ స్టార్ అని పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.

    మహేష్ రాబోయే సినిమాలు

    మహేష్ రాబోయే సినిమాలు

    ఇక ప్రస్తుతం మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమా మే 12న విడుదల కానుంది. ఇక త్రివిక్రమ్ దర్శకత్వంలో కూడా మహేష్ ఒక సినిమాను లాంచ్ చేశాడు. ఆ సినిమా షూటింగ్ కూడా త్వరలోనే స్టార్ట్ కానుంది. అలాగే డైరెక్టర్ ఎస్ఎస్.రాజమౌళి దర్శకత్వంలో ఒక బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాను కూడా ఇదే ఏడాది సెట్స్ పైకి తీసుకు రానున్నారు.

    English summary
    Mahesh babu special post on his marriage anniversary with family pic.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X