twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవర్ హౌస్ ఆఫ్ ఎనర్టీ.. బాలయ్యకు మహేష్ స్పెషల్ విషెస్

    |

    బాలయ్య బాబు బర్త్ డే సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో ట్రెండ్ అవుతోంది. బాలకృష్ణ 60వ పుట్టిన రోజు వేడుకలను అభిమానులు సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. బాలకృష్ణ సైతం ప్రతీ ఏడాది మాదిరి బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్‌లో తన పుట్టిన రోజు వేడుకలను సెలెబ్రేట్ చేసుకున్నాడు. ఇక సోషల్ మీడియా మొత్తం బాలయ్య మేనియానే కనిపిస్తోంది. ఇప్పటికే టాలీవుడ్ సెలెబ్రిటీలంతా బాలయ్యకు విషెస్ తెలిపారు. తాజాగా మహేష్ బాబు, వెంకటేష్ బాలయ్యకు విషెస్ చెబుతూ ట్వీట్స్ చేశారు.

    నందమూరి వారసుల ట్వీట్స్..

    నందమూరి వారసుల ట్వీట్స్..

    ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ బాబాయ్ బర్త్ డే సందర్భంగా ఎమోషనల్ అయ్యారు. తనలోని అభిమానాన్ని తట్టి లేపింది, చూసిన మొట్టమొదటి హీరో బాలయ్యేనని ఎన్టీఆర్ ట్వీట్ చేయగా.. తండ్రి తరువాత తండ్రి స్థానంలో ఉన్నారని కళ్యాణ్ రామ్ భావోద్వేగానికి లోనయ్యారు.

    చిరు విషెస్ వైరల్

    చిరు విషెస్ వైరల్

    బాలయ్య బర్త్ డే సందర్భంగా చిరు స్పందిస్తూ..‘60లో అడుగుపెడుతున్న మా బాలకృష్ణకి షష్టి పూర్తి శుభాకాంక్షలు.ఇదే ఉత్సాహంతో ,ఉత్తేజంతో ఆయురారోగ్యాలతో నిండునూరేళ్ల సంబరం కూడా జరుపుకోవాలని,అందరి అభిమానం ఇలాగే పొందాలని కోరుకుంటున్నాను'అని ట్వీట్ చేశాడు.

    పవర్ హౌస్ ఆఫ్ ఎనర్జీ..

    పవర్ హౌస్ ఆఫ్ ఎనర్జీ..

    సూపర్ స్టార్ మహేష్ బాబు బాలయ్యకు విషెస్ తెలిపాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో ట్వీట్ చేస్తూ..‘పవర్ హౌస్ ఆఫ్ ఎనర్జీ, ఓ నటుడిగా తాను ఆరాధించే బాలకృష్ణకు 60వ పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయురారోగ్యాలు, సంతోషం ప్రాప్తించాలని కోరుతున్నాను' అని ట్వీట్ చేశాడు.

    Recommended Video

    Kiara Advani Walked Out From The Mahesh Babu's Movie
    వెంకీమామ విషెస్..

    వెంకీమామ విషెస్..

    విక్టరీ వెంకటేష్ స్పందిస్తూ..‘మా ప్రియమైన బాలయ్య బాబుకు హ్యాపీ బర్త్ డే. వృత్తిపరంగానూ, వ్యక్తిగతంగానూ అంతా మంచి జరగాలి. బీబీ3లో లుక్ అదిరిపోయింది'అని పేర్కొన్నాడు. ఇక బాలయ్య బర్త్ డే వేడుకలకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

    English summary
    Mahesh Babu Special Wishes To NBK 60th Birthday. To the powerhouse of energy, an actor I've always admired... Happy 60th Balakrishna garu. Wishing you the best of health and happiness always
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X