ఆ ఇద్దరికి విషెస్ చెప్పాడు.. అనుష్కను మరిచాడు.. మహేష్ బాబు ట్వీట్స్ వైరల్
సూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటాడో అందరికీ తెలిసిందే. అది ఎలాంటి సందర్భం అయినా సరే సోషల్ మీడియాలో మహేష్ బాబు మొదటగా స్పందిస్తాడు. మరీ ముఖ్యంగా సెలెబ్రిటీల బర్త్ డేలు అయితే గుర్తు పెట్టుకుని మరీ ట్వీట్లు పెడతాడు. పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ వారితో దిగిన ఫోటోలు, పాత జ్ఞాపకాలను పంచుకుంటాడు. నేడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, లోకనాయకుడు కమల్ హాసన్, స్వీటీ అనుష్క శెట్టి బర్త్ డే. ఈ సందర్భంగా మహేష్ చేసిన ట్వీట్స్ వైరల్ అవుతున్నాయి. ఆ ఇద్దరి విషెస్ చెప్పిన మహేష్.. అనుష్కకు మాత్రం ఇంకా విషెస్ చెప్పలేదు.

కమల్ హాసన్‌కు అలా..
యూనివర్సల్ హీరో, లోక నాయకుడు కమల్ హాసన్‌కు మహేష్ బాబు విషెస్ తెలిపాడు. ఈ మేరకు ట్వీట్ చేస్తూ ఓ ఈవెంట్‌లో ఇద్దరూ కలిసి షేక్ హ్యాండ్ ఇచ్చుకున్న ఫోటోను షేర్ చేశాడు. లెజెండరీ కమల్ హాసన్‌కు హ్యాపీ బర్త్ డే.. చేసిన ప్రతీ పాత్రకు జీవం పోసే నటుడు.. ఎంతో స్ఫూర్తివంతమైన వారు.. ఎల్లప్పుడు ఆయురారోగ్యాలతో ఉండాలని మహేష్ బాబు ట్వీట్ చేశాడు.

త్రివిక్రమ్‌కు స్పెషల్..
త్రివిక్రమ్ మహేష్ బాబు రిలేషన్ అతడు సినిమాతో మొదలైంది. చాలా ఏళ్ల తరువాత మళ్లీ ఖలేజా సినిమాకు కలిసి పని చేశారు. ఆ సినిమా ఫలితం బెడిసికొట్టినా బంధం మాత్రం గట్టిగానే ఏర్పడింది. త్రివిక్రమ్ పుట్టిన రోజు సందర్భంగా మహేష్ బాబు ట్వీట్ చేస్తూ.. హ్యాపీయెస్ట్ బర్త్ డే త్రివిక్రమ్ శ్రీనివాస్.. అంతులేని సంతోషం.. తిరుగులేని విజయాలు మీ సొంతం కావాలంటూ హగ్స్ ఇస్తున్నట్టుగా ఎమోజీలను షేర్ చేశాడు.

ఖలేజా సినిమాతో..
మహేష్ బాబు అనుష్క త్రివిక్రమ్ ఈ ముగ్గరికి ఖలేజా సినిమాతో సంబంధం ఉంది. ఖలేజా సినిమా వర్కింగ్ స్టిల్‌ను షేర్ చేస్తూ మహేష్ బాబు త్రివిక్రమ్‌కు విషెస్ తెలిపాడు. కానీ అనుష్కకు మాత్రం పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపలేదు. అయితే మహేష్‌కు ఆ విషయం తెలిసి ఉండదని స్వీటి ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

సర్కారు వారి పాట సెట్స్ పైకి..
మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట మీద దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది. మహేష్ బాబు యూఎస్ వెళ్లేందుకు సిద్దమయ్యాడు. మొదటి షెడ్యూల్ అక్కడే ప్లాన్ చేసినట్టు టాక్. సర్కారు వారి పాట టీం కంటే ముందుగా మహేష్ అక్కడికి వెళ్లనున్నాడని తెలుస్తోంది. ఏది ఏమైనా డిసెంబర్‌లో షూటింగ్ ప్రారంభించబోతోన్నారని సమాచారం.


Click it and Unblock the Notifications











