టాక్ ఆఫ్ ది టౌన్: బిగ్ బాస్‌కు కొత్త హోస్ట్.. నాలుగో సీజన్‌ కోసం స్టార్ హీరోతో ‘మా’ భారీ డీల్‌.!

By Manoj Kumar P

ఉత్తరాది నుంచి వచ్చినప్పటికీ దక్షిణాదిలోనూ సూపర్ సక్సెస్ అయింది బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్. మరీ ముఖ్యంగా తెలుగులో ఈ షో విజయవంతంగా మూడు సీజన్లు పూర్తి చేసుకుంది. దీనికి కారణం షోను హోస్ట్ చేసిన హీరోలతో పాటు అందులో పాల్గొన్న కంటెస్టెంట్లు అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అన్ని భాషల్లో ఒకే హీరో షోను హోస్ట్ చేస్తుండగా, తెలుగులో మాత్రం మూడింటికి ముగ్గురు మారారు. ఇక, నాలుగో సీజన్ హోస్ట్ గురించి తాజాగా ఓ న్యూస్ లీక్ అయింది. ఈ క్రమంలోనే ఎవరూ ఊహించని పేరు తెరపైకి వచ్చింది. ఆ సంగతులేంటో చూద్దాం పదండి.

Recommended Video

Bigg Boss Telugu 4 : Mahesh Babu To Host Bigg Boss Telugu After Jr NTR,Nani & Nagarjuna | Filmibeat
బిగ్ బాస్ సక్సెస్‌కు కారణం.. తారక రాముడే

బిగ్ బాస్ సక్సెస్‌కు కారణం.. తారక రాముడే

సెలెబ్రిటీలను ఓ ఇంట్లో ఉంచడం.. వారు చేసే పనులను జనాలకు చూపించడం.. ఇదే బిగ్ బాస్ థీమ్. అసలు ఇది తెలుగులో హిట్ అవుతుందా అన్న అనుమానం నడుమ ప్రారంభం అయింది. అయితే, మొదటి సీజన్‌ను హోస్ట్ చేసిన జూనియర్ ఎన్టీఆర్ అందరి అనుమానాలను పటాపంచలు చేశాడు. తన స్పాంటినిటీతో షోను హుందాగా నడిపి సక్సెస్ చేశాడు.

నాని హోస్టింగ్ కంటే.. అవే హైలైట్ అయ్యాయి

నాని హోస్టింగ్ కంటే.. అవే హైలైట్ అయ్యాయి

మొదటి సీజన్ హోస్ట్ చేసిన తారక్.. రెండో దానికి అందుబాటులో లేడు. దీంతో నేచురల్ స్టార్ నానిని దింపారు షో నిర్వహకులు. నటనలో మెప్పించే ఈ స్టార్ హీరో.. హోస్టింగ్‌లోనూ సత్తా చాటాడు. అయితే, ఆ సీజన్‌లో జరిగిన వివదాలు అతడి హోస్టింగ్ కంటే ఎక్కువగా హైలైట్ అయ్యాయి. దీంతో మరోసారి బిగ్ బాస్‌ హోస్ట్‌‌గా చేయనని డిసైడ్ అయిపోయాడు.

సీనియరిటీ చూపించాడు.. రికార్డుల సృష్టించాడు

సీనియరిటీ చూపించాడు.. రికార్డుల సృష్టించాడు

నాని గైర్హాజరుతో సీనియర్ హీరో నాగార్జున మూడో సీజన్ హోస్టింగ్ బాధ్యతలు తీసుకున్నారు. పేరుకు సీనియర్ హీరోనే అయినా కుర్రాళ్లకు ధీటైన హోస్టింగ్‌తో ఆకట్టుకున్నారు. కంటెస్టెంట్లతో పాటు ప్రేక్షకులను మెప్పించిన ఆయన.. ఎన్నో రికార్డులను సైతం బద్దలు కొట్టారు. వివాదాలను పరిష్కరించడంతో పాటు కంటెస్టెంట్లకు సలహాలు ఇస్తూ సీజన్‌ను విజయవంతంగా ముగించారు.

నాలుగో సీజన్‌ హోస్ట్‌ ఎవరు.? అందరిలో ఇదే డౌట్

నాలుగో సీజన్‌ హోస్ట్‌ ఎవరు.? అందరిలో ఇదే డౌట్

మూడు సీజన్లకు ముగ్గురు హీరోలు హోస్టులుగా కనిపించడంతో నాలుగో దానికి ఎవరు బాధ్యతలు తీసుకోబోతున్నారు అన్న అనుమానం తెలుగు ప్రేక్షకుల్లో కలుగుతోంది. అదే సమయంలో దీనికి సంబంధించిన ఎన్నో వార్తలు ప్రచారం అవుతుండడంతో ఈ విషయంపై ఎవరికీ క్లారిటీ రావడం లేదు. దీంతో బిగ్ బాస్ సీజన్ 4 ఇప్పటి నుంచే హాట్ టాపిక్ అవుతోంది.

మళ్లీ ఆ హీరోనే హోస్ట్.. భారీ రెమ్యూనరేషన్ ఫిక్స్

మళ్లీ ఆ హీరోనే హోస్ట్.. భారీ రెమ్యూనరేషన్ ఫిక్స్

బిగ్ బాస్ నాలుగో సీజన్ ఎప్పుడు ప్రారంభం అవుతుందో క్లారిటీ లేకపోయినా.. హోస్ట్ విషయంలో మాత్రం పలు వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే జూనియర్ ఎన్టీఆర్‌ను మరోసారి రంగంలోకి దింపబోతున్నారని ఆ మధ్య ఓ న్యూస్ ప్రచారం అయింది. ఇందుకోసం అతడికి భారీ రెమ్యూనరేషన్ ఇస్తున్నారని అన్నారు. అయితే, ఈ విషయం క్లారిటీ మాత్రం రాలేదు.

బిగ్ బాస్‌కు కొత్త హోస్ట్.. మా టీవీతో భారీ డీల్‌.!

బిగ్ బాస్‌కు కొత్త హోస్ట్.. మా టీవీతో భారీ డీల్‌.!

బిగ్ బాస్ - 4 హోస్ట్ గురించి తాజాగా ఓ న్యూస్ ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. దీని ప్రకారం... రాబోయే సీజన్‌ను సూపర్ స్టార్ మహేశ్ బాబు హోస్ట్ చేయబోతున్నాడట. ఇందుకోసం స్టార్ మా యాజమాన్యం అతడితో భారీ డీల్ కుదుర్చుకుందని అంటున్నారు. దీంతో ఇప్పటి వరకు ఎవరూ తీసుకోనంత అమౌంట్ మహేశ్ తీసుకోబోతున్నాడని ప్రచారం జరుగుతోంది.

షోలో పాల్గొన్నా.. సినిమాలకు గ్యాప్ ఉండదట

షోలో పాల్గొన్నా.. సినిమాలకు గ్యాప్ ఉండదట

‘సరిలేరు నీకెవ్వరు' జోష్‌లో ఉన్న మహేశ్ బాబు.. ప్రస్తుతం హాలిడేను ఎంజాయ్ చేస్తున్నాడు. ఇప్పటి వరకు ఆయన ఏ సినిమానూ ప్రకటించలేదు. త్వరలోనే పరశురాంతో సినిమా ప్రకటన ఉంటుందని ప్రచారం జరుగుతోంది. దీనితో పాటు మరికొన్ని సినిమాలు చేయబోతున్నాడు. మరోవైపు, బిగ్ బాస్‌లో పాల్గొన్నా ఆ సినిమా షూటింగ్‌లు మాత్రం ఆపడనే టాక్ వినిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X