Valentines Day 2023: రియల్ లైఫ్ లో ప్రేమించి పెళ్లాడిన హీరోలు-హీరోయిన్లు.. వాలంటైన్స్ డే స్పెషల్!
లవ్ ఈజ్ బ్యూటిఫుల్.. ప్రేమలో ఉన్న ప్రతి ఒక్కరూ చెప్పే మాట. ఇక ప్రేమికులు అంటే టక్కున గుర్తు వచ్చేది వాలంటైన్స్ డే. ఈరోజు ప్రేమికులందరూ తాము ప్రేమించే వ్యక్తిపై ఉన్న ప్రేము వ్యక్త పరుస్తారు. వారిలో కాలేజీ యూత్ నుంచి సీనియర్ సిటిజన్స్ వరకు ఎంతోమంది ఉంటారు. ఇక సినిమాల్లో హీరో హీరోయిన్ల మధ్య లవ్ సీన్స్ చూస్తూ ఆ పాత్రల్లో తామే ఉన్నట్లు ఫీల్ అవుతుంటారు.
మరి రియల్ లైఫ్ లో హీరో-హీరోయిన్లు లవ్వాడి.. పెళ్లాడితే? అవును సినీ రంగంలో ఎంతో మంది హీరోలు.. తాము యాక్ట్ చేసిన హీరోయిన్ల ప్రేమ వలలో పడి పెళ్లి అనే సంసార సాగరాన్ని ఎంతో అందంగా ఈదుతున్నారు. వాలంటైన్స్ డే సందర్భంగా అలా ప్రేమించి, పెళ్లి చేసుకున్న తెలుగు హీరోలు ఎవరెవరో చూద్దామా!

మహేశ్ బాబు-నమ్రత శిరోద్కర్
టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా పేరు తెచ్చుకున్నారు సూపర్ స్టార్ మహేశ్ బాబు-నమ్రత శిరోద్కర్. వీళ్లిద్దరు కలిసి వంశీ సినిమాలో నటించారు. అప్పుడు వీళ్ల మధ్య పుట్టిన ప్రేమ కాస్తా.. ఏడు అడుగుల బంధం వైపుకు సాగింది. 2005 ఫిబ్రవరి 10న పెళ్లి చేసుకున్న ఈ జంట ఇటీవల 18వ వివాహ వార్షికోత్సవాన్ని రొమాంటిక్ గా జరుపుకున్నారు. ఈ దంపతులకు కుమారుడు గౌతమ్, కూతురు సితార ఉన్న విషయం తెలిసిందే.

నాగార్జున-అమల
టాలీవుడ్ కింగ్, మన్మథుడు అక్కినేని నాగార్జున, స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన అమల ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. సరసాలు చాలు శ్రీవారు అంటూ శివ సినిమాలో చేసిన రొమాన్స్ కాస్తా రియల్ లైఫ్ లో కూడా కంటిన్యూ అయింది. చినబాబు సినిమా షూటింగ్ లో పరిచయమైన వీరి స్నేహం కాస్తా ప్రేమగా మారి వివాహం వైపు 7 అడుగులు వేసింది. 1992 జూన్ 11న పెళ్లి చేసుకున్న ఈ జంటకు అక్కినేని అఖిల్ జన్మించిన విషయం తెలిసిందే.

రాజశేఖర్-జీవిత
యాంగ్రీ యంగ్ మ్యాన్ గా పాపులర్ అయిన హీరో రాజశేఖర్. హీరోయిన్ గా, మహిళా దర్శకురాలిగా గుర్తింపు పొందారు జీవిత. వీరిద్దరూ తలంబ్రాలు, ఆహుతి, అంకుశం వంటి సినిమాల్లో నటించి సూపర్ హిట్ పెయిర్ అని అనిపించుకున్నారు. అనంతరం వీరిద్దరు ఒకరికొకరు జీవిత భాగస్వాములయ్యారు. ఈ జంటకు శివాత్మిక, శివాని అని ఇద్దరు కూతుర్లు ఉన్నారు.

శ్రీకాంత్-ఊహా
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో వివాహ బంధంతో ఒక్కటయిన మరో జంట శ్రీకాంత్, ఊహ. పలు సినిమాల్లో కలిసి నటించిన వీరిద్దరు 1997 జనవరి 20న వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు రోషన్, మేధా, రోహన్ ముగ్గురు పిల్లలు ఉన్నారు.

వరుణ్ సందేశ్-వితికా షేరు
హ్యాపీ డేస్ సినిమాతో బాగా పాపులర్ అయిన హీరో వరుణ్ సందేశ్. ఆ తర్వాత కొత్త బంగారు లోకం, ఎవరైనా ఎపుడైన, కుర్రాడు, మరో చరిత్ర తదితర సినిమాలతో అలరించాడు. ఇక పడ్డానండీ ప్రేమలో మరి అనే సినిమాలో కలిసి నటించిన వరుణ్ సందేశ్, వితికా షేరు ఆ తర్వాత పెళ్లి చేసుకుని భార్యాభర్తలుగా ఒక్కటయ్యారు. వీళ్లిద్దరు బిగ్ బాస్ తెలుగు మూడో సీజన్ లో కపుల్స్ గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.

నాగ చైతన్య-సమంత
టాలీవుడ్ క్యూట్ కపుల్ గా పేరు తెచ్చుకునారు నాగ చైతన్య, సమంత. ఏమాయ చేశావే సినిమాతో పరిచయమైన వీరి స్నేహం.. ప్రేమగా.. ఆ తర్వాత ఏడు అడుగులతో పెళ్లిగా మారింది. 2017 అక్టోబర్ 6న వివాహం చేసుకున్న వీరిద్దరూ నాలుగేళ్ల తర్వాత 2021 అక్టోబర్ 2న విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి తెలుగు సినీ ప్రేక్షకులు పెద్ద షాక్ ఇచ్చారు.

పవన్ కల్యాణ్-రేణు దేశాయ్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రేణు దేశాయ్ మొదటిసారిగా కలిసి నటించిన చిత్రం బద్రి. ఈ సినిమాలో వీరిద్దరి హిట్ పెయిర్ గా నిలిచారు. దీంతో జానీ సినిమా కూడా చేశారు. ఆ తర్వాత కొన్నాళ్లు డేటింగ్ చేసిన తర్వాత అకీరానందన్ పుట్టిన తర్వాత పవన్ కల్యాణ్-రేణు దేశాయ్ పెళ్లి చేసుకున్నారు. అయితే తర్వాత కొంత కాలానికి వీరిద్దరు విడాకులు తీసుకున్నారు. రేణు దేశాయ్ విడాకుల తర్వాత తీన్ మార్ సినిమాలో చిన్న పాత్ర చేసిన అన్నా లేజ్ నోవాను వివాహమాడాడు పవన్ కల్యాణ్.

సుమంత్-కీర్తి రెడ్డి
ఇప్పటివరకు పైన చెప్పిన జంటలందరూ ఏదో ఒక సినిమాలో నటించారు. కానీ ఏ సినిమాలో నటించకుండా పెళ్లి చేసుకున్న హీరో హీరోయిన్ సుమంత్, కీర్తి రెడ్డి. తొలి ప్రేమ సినిమాతో యూత్ మనసు కొల్లగొట్టి కీర్తి రెడ్డి.. హీరో సుమంత్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. 2004లో పెళ్లి చేసుకున్న ఈ జంట 2006లో విడాకులతో విడిపోయింది. వీళ్లే కాకుండా తెలుగులో సీనియర్ హీరోలు ఎంతోమంది ఉన్నారు. అలాగే తమిళంలో సూర్య-జ్యోతిక, ఆర్య-సయేషా సైగల్ తదితరులు ఉన్నారు.


Click it and Unblock the Notifications











