సెన్సేషనల్ అప్‌డేట్: చిరంజీవి సినిమాలో మహేశ్ బాబు కీ రోల్.. కథ విన్న వెంటనే గ్రీన్ సిగ్నల్.!

By Manoj Kumar P

గతంతో పోలిస్తే తెలుగు సినీ ఇండస్ట్రీలో మల్టీస్టారర్ మూవీలు ఎక్కువైపోయాయి. ప్రస్తుతం టాలీవుడ్‌లోని స్టార్ హీరోలందరూ తమ ఇగోలను పక్కన పెట్టేస్తున్నారు. ఈ క్రమంలోనే ఒకరి సినిమాల ఫంక్షన్లను మరొకరు వెళ్లడం.. మూవీలు బాగుంటే అభినందించడం వంటివి చేస్తున్నారు. అదే సమయంలో మల్టీస్టారర్ మూవీలకు సైతం పచ్చజెండా ఊపేస్తున్నారు. ఇందులో భాగంగానే మెగాస్టార్ చిరంజీవి సినిమాలో సూపర్ స్టార్ మహేశ్ బాబు కీలక పాత్ర చేస్తున్నాడన్న వార్త ఒకటి లీక్ అయింది. దీని వెనుక కథ ఏంటి.? పూర్తి వివరాల్లోకి వెళితే...

గ్యాప్ వచ్చినా గ్రేస్ తగ్గలేదని నిరూపించాడు

గ్యాప్ వచ్చినా గ్రేస్ తగ్గలేదని నిరూపించాడు

రాజకీయాల్లోకి వెళ్లిన చాలా రోజుల తర్వాత మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆయనను ప్రేక్షకులు ఆదరిస్తారా.? అప్పటి గ్రేస్ చూపిస్తారా.? వంటి ఎన్నో అనుమానాల నడుమ విడుదలైన ‘ఖైదీ నెంబర్ 150' వాటన్నీంటిని పటాపంచలు చేస్తూ సూపర్ హిట్ అయింది. తనలోని వాడి వేడి ఏమాత్రం తగ్గలేదని ఆయన నిరూపించారు.

ప్రతిష్టాత్మకంగా తీస్తే నిరాశను మిగిల్చింది

ప్రతిష్టాత్మకంగా తీస్తే నిరాశను మిగిల్చింది

‘ఖైదీ నెంబర్ 150' వంటి సూపర్ హిట్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం ‘సైరా: నరసింహారెడ్డి'. సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమాను రామ్ చరణ్ నిర్మించాడు. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులు ఆదరించలేదు. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిందీ మూవీ.

 ఈ సారి గట్టిగా కొట్టాలని.. బడా డైరెక్టర్‌తో కలిశారు

ఈ సారి గట్టిగా కొట్టాలని.. బడా డైరెక్టర్‌తో కలిశారు

ఎంతో ఖర్చు పెట్టి తీసిన సైరా నష్టాలనే మిగల్చడంతో ఈ సారి గట్టిగా కొట్టాలని మెగాస్టార్ చిరంజీవి, ఆయన కుమారుడు రామ్ చరణ్ డిసైడ్ అయిపోయారు. ఇందులో భాగంగానే బడా డైరెక్టర్ కొరటాల శివతో కలిశారు. వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో ప్రారంభం కావాల్సి ఉన్నా.. అనివార్య కారణాలతో వాయిదా పడింది. అయితే, ఈ మధ్య రెగ్యూలర్ షూట్ మొదలైంది.

మళ్లీ అదే తరహా ప్లాన్.. కొత్తగా ట్రై చేస్తున్నారు

మళ్లీ అదే తరహా ప్లాన్.. కొత్తగా ట్రై చేస్తున్నారు

తన గత చిత్రాల మాదిరిగానే చిరుతో చేస్తున్న ప్రాజెక్టు కూడా సోషల్ మెసేజ్‌తో తెరకెక్కిస్తున్నాడు కొరటాల శివ. దేవాదాయ భూముల ఆక్రమణలపై పోరాటం చేసే వ్యక్తిగా ఇందులో మెగాస్టార్ కనిపించనున్నారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. టేకింగ్‌లో మాత్రం సరికొత్త పద్దతిని చూపించబోతున్నారని సమాచారం. దీనికి ‘ఆచార్య' అనే టైటిల్ పరిశీలనలో ఉంది.

చిరంజీవి సినిమాలో మహేశ్ బాబు కీ రోల్

చిరంజీవి సినిమాలో మహేశ్ బాబు కీ రోల్

తాజాగా ఈ సినిమా గురించి ఓ సెన్సేషనల్ న్యూస్ లీక్ అయింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేశ్ బాబు కీలక పాత్ర పోషిస్తున్నారనేదే ఆ వార్త సారాంశం. రెండు రోజుల క్రితం ఈ సినిమా కథను ఆయనకు వినిపించగానే ఓకే చెప్పేశాడని సమాచారం. దాదాపు 20 నిమిషాల పాటు ఉండే ఈ పాత్రను చేయడానికి మహేశ్ ఎంతో ఉత్సాహం చూపించాడట.

Recommended Video

#Cinebox : #KRKRTrailer2 Released | Chiranjeevi - Manisharma To Team Up Again
రామ్ చరణ్‌ స్థానాన్ని భర్తీ చేయనున్న మహేశ్

రామ్ చరణ్‌ స్థానాన్ని భర్తీ చేయనున్న మహేశ్

వాస్తవానికి ఈ సినిమాలో మెగాస్టార్‌తో పాటు రామ్ చరణ్ కలిసి నటిస్తున్నాడని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. ఇందుకు అనుగుణంగానే ఎన్నో అప్‌డేట్స్ కూడా బయటకు వస్తున్నాయి. అయితే, తాజాగా బయటకు వచ్చిన వివరాల ప్రకారం.. రామ్ చరణ్ స్థానాన్ని మహేశ్ బాబు భర్తీ చేయబోతున్నాడని అంటున్నారు. దీంతో మెగా సూపర్ కాంబోపై అంచనాలు నెలకొన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X