Gunturkaram Song: మళ్లీ అడ్డంగా బుక్కైన తమన్... 'కుర్చి మడతబెట్టి' మరీ ఆ ట్యూన్ ఎత్తేశాడుగా?
ఇప్పుడంతా సోషల్ మీడియాలో గుంటూరు కారం సినిమా నుంచి కుర్చీ మడతబెట్టి గురించి హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియాలో ఓ పెద్దాయన మాట్లాడిన మాటలను పాటగా మార్చారంటూ ట్రోలింగ్ గా స్టార్ట్ చేశారు. ఇక మహేశ్ బాబు ఇమేజ్ కు ఇలాంటి పాట ఏంటీ అంటూ నెటిజన్స్ ఫైర్ అయ్యారు. అయితే తాజాగా ఈ సాంగ్ ఫుల్ లిరికల్ పాట రిలీజ్ అయింది. అయితే ఈ ట్యూన్ కూడా తమన్ మళ్లీ ఓ సినిమాలోంచి లేపేశారని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే...
సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న చిత్రం గుంటూరు కారం. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. ఇక ఇప్పటికే ప్రచారం పర్వం మొదలు పెట్టిన చిత్ర బృందం.. మెల్లిగా సినిమాలు పాటలను రిలీజ్ చేస్తుంది. తాజాగా ఈ సినిమా నుంచి కుర్చీ మడతపెట్టి సాంగ్ రిలీజ్ అయింది. అయితే ఈ సాంగ్ మీద సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి. మహేష్ బాబు ఇమేజ్ ను దిగజార్చేలా ఈ పాటను పెట్టారంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.

తాజాగా ఈ సినిమా నుంచి కుర్చీ మడతపెట్టి ఫుల్ లిరికల్ సాంగ్ రిలీజ్ అయింది. మహేశ్ బాబు లాంటి స్టార్ హీరో సినిమాలో ఇలాంటి పాటనా అని.. నెట్టింట ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. అయితే, మాస్ యాక్షన్ మూవీలో ఈ పాట ఉండడం సరైనదే అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. మేకర్స్ ఫుల్ లిరికల్ సాంగ్ రిలీజ్ చేయగా.. మరో కొత్త ట్రోలింగ్ మొదలు అయింది.

ఎస్ఎస్ తమన్ కాపీ ట్యూన్ వ్యవహారం ఇప్పటిది కాదు.. ఆయనపై ఎప్పటి నుంచో ట్రోలింగ్ వస్తునే ఉంటున్నాయి. ఇప్పుడు తాజాగా గుంటూరు కారం కుర్చీ మడతబెట్టి సాంగ్ కూడా తమన్ ట్యూన్ కాపీ కొట్టేశాడంటూ కొందరు నెటిజన్లు వీడియోలతో సహా పోస్ట్ చేస్తున్నారు. 'కుర్చీ మడత పెట్టి' పాట చరణంలో 'ఏం రసికరాజువో' మరి అంటూ లిరిక్స్ ఉండగా.... అయితే అక్కడ అత్తారింటికి దారేది సినిమాలోని 'బేట్రాయి సామి దేవుడా' జానపద పాట ట్యూన్ పెట్టి.. తమన్ కాపీ కొట్టాడని ట్రోలింగ్ మొదలు పెట్టారు.
అత్తారింటికి దారేది సినిమాలోని సాంగ్, కుర్చీ మడతబెట్టి సాంగ్ ను రెండు కలిపి వీడియోలు చేసి.. సోషల్ మీడియాలో తమన్ మీద ట్రోలింగ్ చేస్తున్నారు. మళ్లీ ట్యూన్ లేపేశాడు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఈ పాటకు ఓ పెద్దాయన మాట్లాడిన మాటలను పాటగా మార్చడం కూడా పెద్ద ఎత్తున హాట్ టాపిక్ అవుతుంది. ఓ బూతు వల్ల వైరల్ అయిన ఈ డైలాగ్‍ను మహేశ్ బాబు పాటకు వాడడం పట్ల ఫైర్ అవుతున్నారు.

మరోవైపు ఈ కుర్చీ మడతపెట్టి పాటలో మహేశ్ బాబు, శ్రీలీల డ్యాన్స్ స్టెప్పులు మాత్రం అదిరిపోయాయి. ఇక సూపర్ స్టార్ మాస్ స్టెప్‍లు చూసి చాలా మంది ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. థియేటర్లలో మోత ఖాయం అంటున్నారు. ఇక ఈ గుంటూరు కారం మూవీ సంక్రాంతి సందర్భంగా జనవరి 12న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సినిమాలో మహేశ్ బాబు సరసన శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. హాసిని, హారిక క్రియేషన్స్ పతాకం ఈ చిత్రాన్ని నిర్మించింది.


Click it and Unblock the Notifications











