మహేష్ బాబు గొప్ప మనసు.. చిట్టి గుండెకు శస్త్ర చికిత్స
ఓ మనిషి ప్రాణాలను నిలపడం అంటే మామూలు విషయం కాదు. డబ్బు లేక ఎంతో మంది చిన్నారులకు వైద్యం అందడం లేదు. రోజుకు ఎంతో మంది కళ్లు తెరవకుండానే మరణిస్తున్నారు. అయితే మహేష్ బాబు తన ట్రస్ట్ ద్వారా పిల్లలకు వైద్యం అందిస్తున్నారు. ఈ ట్రస్ట్ ఇది వరకు ఎంతో మంది చిన్నారులు ప్రాణాలు పోసింది. తాజాగా ఓ చిట్టి గుండెకు చికిత్స చేయించిన మహేష్ బాబుపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
Recommended Video

నిజమైన శ్రీమంతుడు..
మహేష్ బాబు సంపాదించడంలోనే కాదు వాటిని సమాజ సేవకు ఉపయోగించడంలోనూ ముందే ఉంటాడు. అయితే మహేష్ బాబు చేసే సేవలేవీ బయటకు రావు. తన ట్రస్ట్, టీమ్ ద్వారా చేయాల్సిన మంచి పనులను చేసేస్తూ ఉంటాడు. అందుకు మహేష్ బాబును తెరమీదే కాదు తెర వెనుకా ప్రేమిస్తుంటారు.

సమజా సేవలో సూపర్ స్టార్..
సూపర్ స్టార్ మహేష్ బాబు సమాజ సేవకు ఎప్పుడూ ముందుంటాడు. ఎప్పుడైనా విపత్తులు వచ్చినా, ఆపదలు వచ్చినా మహేష్ బాబు సాయం చేసేందుకు ముందుకు వస్తాడు. ఇప్పటికే తన సొంతూరు బుర్రిపాలెం గ్రామాన్ని దత్తత తీసుకున్నాడు. మహేష్ బాబు ట్రస్ట్ ద్వారా చిన్న పిల్లలకు వైద్యం అందిస్తున్నాడు.

చిట్టి గుండెకు కష్టం..
తాజాగా ఓ జంట (కుంచె ప్రదీప్, నాగజ్యోతి)కు జన్మించిన శిశువుకు అరుదైన గుండె జబ్బు వచ్చింది. మెరుగైన వైద్యం కోసం విజయవాడ లేదా హైదరాబాద్ తీసుకెళ్లాల్సి ఉంటుందని, ఖర్చు ఎక్కువగానే అవుతుందని తెలిపారు. ఆ సమయంలో వారికి మహేష్ బాబు ట్రస్ట్ గురించి తెలిసింది.

ట్రస్ట్ ద్వారా చికిత్స
ఆ చిట్టి గుండెకు మహేష్‌బాబు ట్రస్టు ద్వారా పిల్లలకు ఉచితంగా శస్త్ర చికిత్స చేయించారు. ప్రస్తుతం ఆ శిశువు క్షేమంగా ఉంది. తమ సంతానం ప్రాణాలు కాపాడినందుకు ఆ తల్లిదండ్రులు మహేష్ బాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కాగా.. మహేష్ బాబుపై ప్రశంసలు కురిపిస్తున్నారు. రియల్ హీరో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











