కూతురితోనే లిప్ లాక్.. రియా చక్రవర్తితో సంబంధం.. మహేష్ భట్ భాగోతంపై నెటిజన్స్ ఫైర్
సుశాంత్ సింగ్ ఆత్మహత్యతో బాలీవుడ్ మొత్తం విమర్శలు ఎదుర్కొంటోంది. డిప్రెషన్ కారణంగా సుశాంత్ మరణించడంతో సినీ ప్రముఖులంతా సంతాపాన్ని వ్యక్తం చేశారు. సుశాంత్ మరణ వార్త తెలిసిన క్షణం నుంచి సోషల్ మీడియాలో రోజుకో చర్చ జరుగుతోంది. డిప్రెషన్ కారణంగా, సినీ అవకాశాలు దూరం చేయడంతోనే సుశాంత్ మరణించాడని కరణ్ జోహర్, సల్మాన్ ఖాన్ వంటి సినీ పెద్దలపై నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా మహేష్ భట్‌పై నెటిజన్స్ తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
Recommended Video

మహేష్ భట్ ప్రమేయం..
సుశాంత్ మృతి వెనుక మహేష్ భట్ ప్రమేయం ఉందని మెజార్టీ నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు. రియా చక్రవర్తితో సంబంధం ఉండటమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వీరిద్దరు సన్నిహితంగా ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ సుశాంత్ మరణం వెనుక వీరిద్దరి పాత్ర ఉండొచ్చని కామెంట్స్ చేస్తున్నారు.

కూతురితోనే లిప్ లాక్..
మహేష్ భట్ తన కూతురితో లిప్ లాక్ చేసిన ఘటన, ఓ మ్యాగజైన్ కోసం చేసిన ఫోటోషూట్ ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. మహేష్ భట్ కామాంధుడని, ఒకవేళ పూజా భట్ తన కూతురు కాకపోయి ఉంటే పెళ్లి చేసుకునే వాడినని చెప్పిన కామెంట్లను ప్రస్తుతం నెటిజన్స్ గుర్తు చేస్తున్నారు.

రియాతో ఉంటే చంపేస్తా..
సుశాంత్ సింగ్, రియా చక్రవర్తి ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. నువ్వు నాతో ఉంటే మహేష్ భట్ నన్ను చంపేస్తాడని రియాతో సుశాంత్ చెప్పినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా మహేష్ భట్ కూడా ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సుశాంత్ ఆత్మహత్య చేసుకుంటాడని చెప్పిన సంగతిని ప్రస్తుతం వైరల్ చేస్తున్నారు.

మహేష్ భట్‌పై ట్రోల్స్..
మహేష్ భట్‌ను స్త్రీ లోలుడు, కామాంధుడు అంటూ తిట్టిపారేస్తున్నారు. కూతుర్ని కూడా వదిలి పెట్టలేదు.. పెళ్లి చేసుకుంటానని బహిరంగంగా చెప్పడాని ఫైర్ అవుతున్నారు. సుశాంత్ కేసులో మహేష్ భట్‌ను కూడా విచారించాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

చక్కర్లు కొడుతున్న ప్రశ్నలు..
నేటి ఉదయం నుంచి సుశాంత్ మరణంపై కొన్ని ప్రశ్నలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇంట్లో పార్టీ జరిగిందని, సీసీటీవీ పుటేజ్ మిస్ అయిందని, ఫ్లాట్ డూప్లికేట్ కీస్ కూడా మిస్ అయ్యాయని, ఉరి వేసుకున్నా కూడా కళ్లు, నాలుక అన్ని సవ్యంగానే ఉన్నాయని ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. సుశాంత్ మృతిసై సీబీఐ ఎంక్వైరీ వేయాలని డిమాండ్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











